జుబిలియంట్ ఫార్మోవా షేర్ మంచిదేనా..?
what is the revenue of jubilant pharmova
ఈ కంపెనీ ఫార్మాసెక్టర్ కి సంబంధించినది. స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్స్, సీడీఎంవో, జనరిక్స్, కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సర్వీసెస్, నోవల్ డ్రగ్స్ లో ఈ కంపెనీ పనిచేస్తూ ఉంది. వీళ్ళకి ఎక్కువ రెవెన్యూ స్పెషాలిటీ ఫార్మాసిటికల్స్ నుంచి వస్తుంది. సీడీఎంవో సిగ్మెంట్ నుంచి 33 శాతం ఆదాయం, జనరిక్ నుంచి 24 శాతం రెవెన్యూ వస్తుంది. ఈ కంపెనీ ఆపరేషన్స్ అన్నీ యూఎస్ఏ, కెనడాలో ఉన్నాయి. ఇండియాలో స్పెషల్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా వర్క్ చేస్తోంది.
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్ ఫోలియోలో…
జూబిలియంట్ ఫార్మావాలో రాకేష్ ఝున్ ఝున్ వాలా కొన్ని సంవత్సరాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ షేర్ ఇప్పుడు 60 శాతం డిస్కౌంట్ తో ట్రేడ్ అవుతుంది. రాకేష్ ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఈ ప్రొడక్ట్స్. ఆర్థిక సంవత్సరం 2023లో జూబిలియంట్ జనరిక్ లిమిటెడ్ అనే కంపెనీ ఇందులో నుంచి డీమెర్జ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ డీమెర్జ్ 2023లో జరిగితే అప్పుడు వాల్యూ అన్ లాక్ అయ్యి ఆ రెండు షేర్స్ డీమెర్జ్ అయిన తర్వాత చాలా బాగా పెరగడానికి స్కోప్ ఉంటుంది. ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయని ఉద్దేశంతో జూబిలియంట్ జనరిక్ లిమిటెడ్ కంపెనీని డీమెర్జ్ చెయ్యాలని అనుకుంటున్నారు. జూబిలియంట్ ఫార్మావా అనే కంపెనీ దాదాపుగా రూ 1000 నుంచి పడి ఇప్పుడు 400 దగ్గర ట్రేడ్ అవుతుంది.
how jubilant pharmova generates profits
* 2010లో ఈ కంపెనీ రెవెన్యూ 3700కోట్ల నుంచి 2019లో దాదాపుగా 9100 కోట్ల వరకు గ్రోత్ సాధించింది. తర్వాత కొవిడ్ కారణంగా 6000 కోట్ల కి పడిపోయింది. ఇప్పుడే రికవరీలో 6100 కోట్లుకి పెరుగుతోంది. కాని ఈ కంపెనీ ఎప్పుడైతే 2019 లో 9100 కోట్లు గ్రోత్ జనరేట్ చేసిందో అలాంటపుడు ఈ కంపెనీ నెట్ ప్రోఫిట్ 574 కోట్లు ఉంది. ఇప్పుడు కూడా కంపెనీ రెవెన్యూ 6,100 కోట్లు ఉన్నా నెట్ ప్రోఫిట్ 568 కోట్లు జనరేట్ అవుతుంది. అందువలన ఈ మేనేజ్ మెంట్ ని దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రొడక్ట్స్ రిక్వైర్ మెంట్ ని చూస్తే ప్యూచర్ గ్రోత్ క్లియర్ గా కనిపిస్తోంది.
* ఎప్పుడైతే షేర్ ప్రైస్ పడిపోతూ ఉందో, అప్పుడు వాల్యూమ్స్ కనుక తగ్గిపోతే అలాంటపుడు స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ రివర్సల్ ని ఆశించవచ్చు. ఇప్పుడు మనం మార్కెట్ ని పరిశీలిస్తే స్టాక్ ప్రైసెస్ పడుతూ ఉన్నాయి. అదే టైమ్ లో వాల్యూమ్ తగ్గుతూ ఉంది. అయితే ఇప్పుడు వడ్డీలు పెరుగుతుండడం వల్ల అన్ని కంపెనీల షేర్ ప్రైసెస్ పడిపోతున్నాయి. కానీ రికవరీ వచ్చినపుడు ఈ షేర్ కేవలం 1, 2 సంవత్సరాల్లోనే షేర్ ప్రైస్ డబుల్ అవ్వవచ్చు.
Leave a Reply