యాక్సిస్‌లోకి సిటీ..
why citi bank merges with axis bank
దేశంలో బ్యాంకింగ్ రంగంలో సేవలందిస్తున్న సిటీ గ్రూప్ ఈ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. సిటీ గ్రూప్ ఇండియా రిటైల్ బిజినెస్ లను యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసే ఒప్పందం చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. సిటీబ్యాంక్ రిటైల్ బిజినెస్ విలువ 2.5 బిలియన్ డాలర్లుగా అంచనా. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఒప్పందాన్ని కూడా ఆమోదించనుంది.
సిటీ గ్రూప్ ఇండియా రిటైల్ బిజినెస్ లో పనిచేస్తోన్న ఉద్యోగులకు యాక్సిస్ బ్యాంకు ఉద్యోగాలను ఇస్తోంది. ఈ విలీనం సుమారు 6 నెలలు సమయం పడుతుందని తెలుస్తోంది. అయితే ఇంకా ఈ వ్యవహారంపై యాక్సిస్ బ్యాంక్, సిటీగ్రూప్ ప్రతినిధులు ఇంకా అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు.
citi bank exits from india
* దేశంలోనే బ్యాంకింగ్ నుంచి ఎగ్జిట్ అవుతామని గత ఏడాది ఏప్రిల్ లో సిటీగ్రూప్ ప్రకటించింది.
* రిటైల్ బిజినెస్ లలో క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్ సర్వీస్ లు, హోమ్ లోన్స్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి సెగ్మెంట్లు కలిసి ఉంటాయి.
* సిటీ బ్యాంక్ కు దేశంలో 35 బ్రాంచులు ఉన్నాయి. మొత్తం 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
* సిటీ బ్యాంక్ రిటైల్ బిజినెస్ విలువ లెక్కించేటప్పుడు డిపాజిట్లు, కస్టమర్లు, అసెట్స్, లయబిలిటీస్ వంటి విషయాలను లెక్కలోకి తీసుకుంటారు.
Leave a Reply