అదానీ.. ద రిచెస్ట్ మేన్..!
adani is the richest man india
ఇండియాలో ఇప్పడు రెండే రెండు పేర్లు దేశీయ కార్పొరేట్ రంగంలో వినిపిస్తున్నాయి. ఒకటి అంబానీ, రెండు అదానీ. ముకేష్ అంబానీ పుట్టుకతోనే ధనవంతుడు. కాని గౌతమ్ అదానీ పుట్టుక సాధారణ మధ్యతరగతిలోనే జరిగింది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని అతనే సృష్టించుకున్నారు. బిజినెస్ లెక్కల ప్రకారం అతని నికర ఆదాయం 92 బిలియన్ డాలర్లు. కేవలం 30 సంవత్సరాల కాలంలో 7 కంపెనీలను స్థాపించి ఆసియాలోనే రెండో రిచెస్ట్ పర్సన్‌గా నిలిచారు అదానీ. ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండా, ఎవరిమీదా ఆధారపడకుండా ఈ స్థాయికి రావడం అత్యంత ఆశ్చర్యకర విషయమే అయినప్పటికీ ఇది వాస్తవం. ఈ యన కంపెనీల మార్కెట్ విలువ 153 బిలియన్ డాలర్స్ ఉంటుంది. సుమారు 83,000 మంది ఉద్యోగులు ఆయన కంపెనీలలో పనిచేస్తున్నారు.
when adani starts business
అదానీ 1962లో అహ్మదాబాద్ లో జన్మించారు. చదువుపై కాకుండా ఎక్కువ బిజినెస్ పై ఆసక్తి ఉండేది. బీకామ్ రెండో సంవత్సరంలో చదువు మానేసి ముంబై వెళ్ళి అక్కడ డైమండ్ జ్యూయలరీ షాపులో వర్కర్ గా జాయిన్ అయ్యారు. అందులో 3 సంవత్సరాలు పనిచేసి ముంబైలో అతనే స్వయంగా డైమండ్ జ్యూయలరీ షాపు ఓపెన్ చేశారు. అదంతా అతని సంపాదనతోనే సాధ్యమైంది. తన తండ్రి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని అన్న అహ్మదాబాద్ లో ప్లాస్టిక్ కొనుగోలు చేసే కంపెనీ కార్యకలాపాలను ఇతనికి అప్పగించారు. ఈ కంపెనీకి ప్లాస్టిక్ సప్లై తక్కువవడంతో నష్టాలు రావడంతో పాలీ వినైల్ క్లోరైడ్ దిగుమతులను స్వయంగా ఆయనే విదేశాల నుంచి చేయడం మొదలుపెట్టారు. తన కంపెనీతో పాటు ఇతర కంపెనీలకు సరఫరా చేసేవారు. ఈ విధంగా గ్లోబల్ ట్రేడింగ్ కు అదానీ కంపెనీ గేట్ వే గా మారింది. ఈ దిగుమతుల కోసం అదానీ షిప్‌లను కొనుగోలు చేశారు. అలా అదానీ ఎక్స్ పోర్ట్ ను స్థాపించారు. దీనిని అదానీ ఎంటర్ ప్రైజెస్ అని కూడా అంటారు. తర్వాత 1992 లో ముంద్రా పోర్ట్ ని గవర్నమెంట్ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనుకున్నపుడు దానిని అదానీ దక్కించుకున్నారు.
adani power starts on
- 1996లో అదానీ పవర్ స్థాపితమైంది. అదానీ పవర్ పేరుతో థర్మల్ పవర్ ప్లాంట్ ను స్థాపించారు. 2006లో అదానీ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారంలోకి ప్రవేశించారు. తర్వాత అదానీ విల్మార్ ద్వారా మనం వాడే పార్ట్యూన్ ఆయిల్, గోదుమపిండి తదితర నిత్యావసరాలను అదానీ కంపెనీ తయారు చేస్తుంది. 2021లో సెంట్రల్ గవర్నమెంట్ 6 ఎయిర్ పోర్ట్ లను ప్రైవేటు మెంటినెన్స్ ఇవ్వడానికి వేలం వేస్తే అందులో 5 అదానీ కంపెనీ దక్కించుకుంది. మొత్తం ఇప్పడు అదానీ గ్రూప్‌లో 7 కంపెనీలు ఉన్నాయి.
Leave a Reply