Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ అంటే ఏమిటి What is Post Office Recurring Deposit FEATURE NEWS
  • గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ.. భారీగా వ‌డ్డీరేట్లు త‌గ్గింపు.. Good News from HDFC: Massive Reduction in Interest Rates FEATURE NEWS
  • ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించుకునే మార్గాలేమిటి What are the ways to make money online FEATURE NEWS
  • Tips to Clear your loans early రుణాలు త్వరగా తీర్చేందుకు చిట్కాలు FEATURE NEWS
  • మళ్లీ పెరిగిన‌ బంగారం ధర …Gold Prices Rise Again FEATURE NEWS
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ లాభాల‌పై ట్యాక్స్ ఉంటుందా..? FEATURE NEWS
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible! FEATURE NEWS
  • Why Rbi increases interest rate వ‌డ్డీ రేట్లు ఎందుకు పెరిగాయి FEATURE NEWS
  • అమ్మో.. ఒక షేర్ కొంటే ఇన్ని చార్జీలా..? FEATURE NEWS

10 ఏళ్లలో రూ. కోటి కావాలంటే ఎంత SIP చేయాలి? How Much SIP Do You Need to Make ₹1 Crore in 10 Years?

Posted on 06/12/2025 By admin 1 Comment on 10 ఏళ్లలో రూ. కోటి కావాలంటే ఎంత SIP చేయాలి? How Much SIP Do You Need to Make ₹1 Crore in 10 Years?

రానున్న 10 సంవత్సరాల్లో రూ. కోటి సొమ్ము సమీకరించుకోవాలని అనుకుంటున్న వారికీ SIP (Systematic Investment Plan) మంచి మార్గం. చిన్న మొత్తాలతోనూ, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్‌తోనూ ఈ లక్ష్యం చేరుకోవచ్చు. అయితే.. మొత్తం పెట్టుబడి, వడ్డీ రేటు (Expected Returns), కాలపరిమితి, రిస్క్ పరిమాణం మొదలైనవి SIP మొత్తాన్ని నిర్ణయిస్తాయి. ఒక్కసారిగా పెద్ద మొత్తాన్ని పెట్టడం కంటే, ప్రతి నెలా కొంత SIP ద్వారా ఇన్వెస్ట్ చేస్తే లాంగ్-టర్మ్‌లో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. SIP ద్వారా వేర్వేరు ధరల వద్ద యూనిట్లు కొనుగోలు చేయ‌డం వల్ల రూపాయి సగటు ప్రయోజనం (Rupee Cost Averaging) లభిస్తుంది. తద్వారా అధిక రాబడికి అవకాశాలు పెరుగుతాయి.

SIP లో ఎంత పెట్టుబ‌డి పెట్టాలి? How Much Should You Invest in a SIP?

10 సంవత్సరాల్లో రూ. కోటి చేరడానికి నెలకు సుమారుగా ₹45,000–50,000 SIP అవసరం. మ్యూచువల్ ఫండ్ రిటర్న్ 15% ఉంటే, నెలకు సుమారుగా ₹35,000–40,000 SIP సరిపోతుంది. రిటర్న్స్ తగ్గితే SIP పెంచాలి. ఎక్కువ రిటర్న్స్ ఉంటే SIP తగ్గించవచ్చు. లక్ష్యానికి చేరుకోవాలంటే SIPను ప్రారంభించడానికి ఆలస్యం చేయవద్దు. స్టాక్ ఫండ్స్ రిస్క్ ఉన్నా, లాంగ్–టర్మ్ లాభం ఎక్కువ. SIP ప్రారంభంలో చిన్న మొత్తం పెట్టి, తరువాత పెంచుతూ ఉంటే కూడా లక్ష్యం చేరుకోవచ్చు. రిటర్న్ వేరియేషన్ల కోసం రెగ్యులర్‌గా ఫండ్ రివ్యూ చేయాలి. SIPను ఎప్పుడూ ఎమర్జెన్సీ కోసం రద్దు చేయవద్దు, నిబంధనలు పాటించాలి. డివిడెండ్లను లేదా రీ-ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా లాంగ్–టర్మ్ సంపాదనను మెరుగుపరచాలి.

సూచ‌న‌లు.. Key Recommendations

స్థిరమైన పెట్టుబడి పొందాలంటే కనీసం 5–10 సంవత్సరాల పాటు SIP కొనసాగించాలి. SIP ద్వారా మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది, కానీ సగటు ఖర్చు తగ్గుతుంది. అందుకే లాంగ్-టర్మ్ లాభం. SIP ద్వారా పెట్టుబడి పెరిగినపుడు, కుదిరిన రాబడితో లక్ష్యం సులభంగా చేరుతుంది. 10 సంవత్సరాల్లో రూ. 1 కోటి చేరుకోవాలంటే, వార్షిక రాబడి 9–13% మధ్య ఉంటే నెలకు ₹42,000–51,000 SIP పెట్టడం సరిపోతుంది. రాబడిని పెంచితే SIP తగ్గుతుంది. కాలపరిమితిని పొడిగిస్తే SIP మొత్తాన్ని తగ్గించి లక్ష్యానికి చేరుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు SIP ద్వారా సంపద సృష్టించడం సులభం.

రెట్టింపు స్థాయిలో పెరుగుతున్న‌ SIP పెట్టుబడులు .. SIP Investments Growing at Record Levels

ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్‌లో SIP (Systematic Investment Plan) పెట్టుబడులు రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నాయి. జూన్ త్రైమాసికంలో కొత్త SIP ఖాతాల సంఖ్య 1.67 కోట్లకు చేరింది. ఇది గత క్వార్టర్‌లో నమోదైన 1.41 కోట్లతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (AMFI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, కొత్త SIPలలో 41.9 లక్షల ఖాతాలు, 25% మార్కెట్ వాటాతో Grow సంస్థ అగ్రగామిగా నిలిచింది. జూన్‌లో Growలో కొత్త SIPలు 15.7 లక్షలుగా నమోదయ్యాయి. విలువ పరంగా, కొత్త SIP పెట్టుబడులు 32% పెరిగి ₹1,116 కోట్లకు చేరాయి. మరోవైపు, డిజిటల్, స్టాక్ ఫండ్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా SIP లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. Angel One: 15 లక్షల కొత్త SIPలు, NJ IndiaInvest: 5.9 లక్షలు, HDFC Securities: 3.8 లక్షలు, PhonePe (డిజిటల్ ప్లాట్‌ఫాం): 5.9 లక్షల SIPలు కొత్త‌గా న‌మోద‌య్యాయి.

మ్యూచువల్ ఫండ్ సిస్టమ్‌లో వృద్ధి..Growth in the Mutual Fund System

జూన్‌లో రికార్డు స్థాయిలో SIP పెట్టుబడులు ₹27,269 కోట్లకు చేరాయి. SIPల AUM (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) గతేడాది జూన్ 30తో పోలిస్తే, ఈసారి ₹15.3 లక్షల కోట్లకు చేరింది. 2025లో మ్యూచువల్ ఫండ్ విశిష్ట ఇన్వెస్టర్ల సంఖ్య 5.4 కోట్లకు చేరింది. 2023లో 3.8 కోట్లతో పోలిస్తే 42% , 2024లో 4.5 కోట్లతో పోలిస్తే 20% పెరుగుదల న‌మోదైంది. 2025 జూన్ ఆఖరికి పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల పరిమాణం (AUM) ₹74.4 లక్షల కోట్లకు చేరింది. కింద‌ట Q1లో నమోదైన ₹63.2 లక్షల కోట్లతో పోలిస్తే 18% వృద్ధి న‌మోదైంది.

ఇన్వెస్టర్ల కొత్త ధోరణులు..New Trends Among Investors

రిటైల్ ఇన్వెస్టర్లు సంప్రదాయ పొదుపు విధానాల నుంచి మ్యూచువల్ ఫండ్‌ల వంటి దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనాల వైపు మైండ్‌సెట్ మార్చుతున్నారు. సులభంగా ఇన్వెస్ట్ చేయగల డిజిటల్-ఫస్ట్ ప్లాట్‌ఫాంలు మరింత అందుబాటులోకి వచ్చి SIP పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి. AMFI, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల నిర్వహణలోని అవగాహన కార్యక్రమాలు కూడా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కూడా SIP పెట్టుబడులు సార్వత్రికంగా పెరుగుతున్నాయి. కొత్త ఖాతాల నమోదు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్ వినియోగం, ఇన్వెస్టర్ల అవగాహన వృద్ధి వల్ల‌ మ్యూచువల్ ఫండ్ సిస్టమ్ మరింత బలపడుతోంది. దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది సానుకూల సంకేతం.

అక్టోబర్‌లో రికార్డు స్థాయికి ..Record Levels in October

అక్టోబర్‌ నెల సిప్ (Systematic Investment Plan) పెట్టుబడుల ను ప‌రిశీలిస్తే.. ఈ నెలలో ఏకంగా ₹13,040 కోట్లు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయని మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (AMFI) తెలిపింది.
ఇది ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిగా నమోదు కావడం విశేషం. ఈ ఏడాది మే నుండి సిప్ పెట్టుబడులు ప్రతి నెలా ₹12,000 కోట్లకు పైగా నమోదవుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్‌ వరకు ఏడు నెలల్లో సిప్ ద్వారా ఈక్విటీల్లోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు ₹87,000 కోట్లు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో 12 నెలల్లో ₹1.24 లక్షల కోట్లు సిప్ రూపంలో వచ్చాయి. వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ పరిణామాల వల్ల మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నప్పటికీ, ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ మీద నమ్మకంతో ప్రతి నెలా సిప్ పెట్టుబడులు పెడుతున్నారు. ఇది మార్కెట్‌కి సానుకూల సంకేతం అని AMFI పేర్కొంది. అక్టోబర్‌లో కొత్తగా 9.52 లక్షలు సిప్ ఖాతాలు నమోదై మొత్తం సంఖ్య 5.93 కోట్లకు చేరింది. దీని ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఆసక్తి పెరుగుతున్నదని స్పష్టమవుతోంది.

SIP ప్రత్యేకతలు.. Key Features of SIP

SIP అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో నిర్దిష్ట మొత్తాన్ని, నిర్దిష్ట వ్యవధిలో, క్రమబద్ధంగా పెట్టుబడి చేయడం. మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకాకుండా, SIP ద్వారా పెట్టుబడి కొనసాగుతుంది. దీర్ఘకాలంలో ఇది మంచి రాబడి ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ SIP ఇన్ఫ్లోలు భారీగా పెరుగుతున్నాయి. ఇది పెట్టుబడిదారులలో అవగాహన పెరుగుతుంద‌న్న‌దానికి ఇది ఒక సూచ‌న‌గా చెప్పొచ్చు. SIPలు దీర్ఘకాలిక సంపద సృష్టిలో కీలకంగా ఉన్నాయి. గత 30 సంవత్సరాల‌లో నెలకు ₹10,000 SIP పెట్టిన వ్యక్తులు 25 కోట్ల రూపాయల వరకు సంపాదించార‌ని గణాంకాలు చెబుతున్నాయి. SIP పూర్తిగా రిస్క్ రహితంగా ఉండదు. మార్కెట్ ఒడిదుడుకులు నష్టాలకు దారితీస్తాయి. కాబట్టి ఫండ్ ఎంపికలో జాగ్రత్త అవసరం. నిపుణుల సూచన ప్రకారం.. SIP ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. కాంపౌండింగ్ శక్తి కాలక్రమేణా రాబడిని పెంచుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు, ముఖ్యంగా కోటీశ్వరులు కావాలనే లక్ష్యానికి SIP ఒక అత్యుత్తమ మార్గం.

102
FEATURE NEWS Tags:Growth in the Mutual Fund System, How Much Should You Invest in a SIP?, Key Features of SIP, Key Recommendations, New Trends Among Investors, Record Levels in October, SIP Investments Growing at Record Levels

Post navigation

Previous Post: శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy
Next Post: జోరుగా వెండి విక్రయాలు.. ! వారంలోనే 100 టన్నుల అమ్మ‌కం! Massive Silver Sell-Off: 100 Tonnes Sold in Just One Week!

Related Posts

  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks FEATURE NEWS
  • జీఎస్టీ తగ్గింపు .. రూ. కోట్లలో పండగ విక్రయాలు! GST Reduction Sparks Festive Sales Worth Crores! FEATURE NEWS
  • WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT ఒక ఎన్ఆర్ఐ తన ఈపీఎఫ్‌ ఖాతాను ఏం చేయాలి FEATURE NEWS
  • charges of Buying and selling shares in stock market స్టాక్ మార్కెట్ ఛార్జస్ గురించి తెలుసుకుందాం… FEATURE NEWS
  • ‘ఐటీఆర్‌ హోల్డ్‌’ అంటే రిజెక్ష‌న్ కాదు..! స్పష్టత ఇచ్చిన ఐటీ విభాగం! ITR on Hold’ Is Not a Rejection..! IT Department Clarifies FEATURE NEWS
  • మన్మోహ‌న్‌ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేశారు How did Manmohan affect the country’s economy FEATURE NEWS

Comment (1) on “10 ఏళ్లలో రూ. కోటి కావాలంటే ఎంత SIP చేయాలి? How Much SIP Do You Need to Make ₹1 Crore in 10 Years?”

  1. Ravi says:
    06/12/2025 at 6:46 pm

    Nice andi Jogarao….. విశ్లేషణ బాగుంది. ఫండ్ names kuda పెట్టండి.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు

Recent Posts

  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed!
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible!
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning
  • వెండి ఆభరణాలపై కొత్త రూల్: కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి! New Rules on Silver Jewellery: What to Know Before Buying
  • ఎల్ఐసీ కొత్త పాల‌సీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Expert Advice Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What is Personal loan and how to get personal loan what is scuttlebutt investing in stock market WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT which is the best stock broking agency Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

January 2026
S M T W T F S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
  • 2026లో క్రిప్టో మార్కెట్ ఎలా ఉండబోతుందంటే..? What to Expect from the Crypto Market in 2026? MARKET
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed! FEATURE NEWS
  • ఒక‌రికి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండాలి..? FINICAL PLANNING
  • EPFO 3.0: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రా.. ఈ ఏడాది లేనట్టేనా EPFO 3.0: PF Withdrawal Through ATMs — Not Happening This Year FEATURE NEWS
  • శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy FEATURE NEWS
  • మ‌రింత ప‌త‌న‌మైన రూపాయి విలువ ..Rupee Value Declines Further NEWS
  • సెకండ్ ఇన్కం సంపాదించండిలా how to earn second income  MONEY TIPS
  • ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ను వాడుతున్నారా? ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి! Using Instant Loan Apps? Take These Precautions! FEATURE NEWS

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme