ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డు లింక్ చేసుకోవడం తప్పనిసరి. లేకుండా డీ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. 2025 డిసెంబర్ 31 తర్వాత ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్ కార్డులు పనిచేయవని ఆదాయపు పన్ను శాఖ స్పష్టంగా తెలిపింది . అంటే లింక్ చేయని పాన్ కార్డ్‌తో లావాదేవీలు చేయలేరు, బ్యాంకింగ్, ఐటీ ఫైలింగ్ వంటి సేవలు నిలిచిపోతాయి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే లింక్ చేయాలి. లేకపోతే మీ పాన్ చెల్లదు. అని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. గడువు దాటినవారు లింక్ చేసేటప్పుడు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కొత్త గడువును కూడా నిర్లక్ష్యం చేస్తే, పాన్ నంబర్ రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఇప్పటికీ లక్షల పాన్లు లింక్ కాలేదు.. Lakhs of PAN Cards Still Remain Unlinked
ఆదాయపు పన్ను శాఖ అంచనాల ప్రకారం, దేశవ్యాప్తంగా ఇంకా లక్షలాది పాన్లు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. ఇంతకు ముందు పలు మార్లు గడువులు పొడిగించినా.. ఇంకా చాలామంది లింక్ చేయలేదు. ఈసారి మాత్రం ఇక మినహాయింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
లింక్ చేయకుంటే ఎదురయ్యే ఇబ్బందులు.. Consequences of Not Linking PAN with Aadhaar
బ్యాంక్ ఖాతాల్లో లావాదేవీలు నిలిచే అవకాశం
క్రెడిట్/డెబిట్ కార్డుల వినియోగంలో ఆటంకం
ఐటీ రిటర్నులు ఫైల్ చేయలేకపోవడం
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సేవల్లో ఆటంకం
పన్ను రీఫండ్లు జమ కాకపోవడం
ఆధార్ లేకుండా పాన్ చెల్లనందున, ఇన్వెస్ట్మెంట్ లేదా ప్రాపర్టీ కొనుగోలు లావాదేవీల్లో సమస్యలు ఎదురవుతాయి
ఎవరెవరు లింక్ చేయాలి? Who Needs to Link Their PAN with Aadhaar?
పాన్–ఆధార్ లింక్ చేయాలా, వద్దా అనే సందేహం చాలా మందికి ఉంది. ఎవరికీ ఇది తప్పనిసరి? ఎవరికీ మినహాయింపు? అన్న విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ తాజాగా స్పష్టంచేసింది.
తప్పనిసరిగా లింక్ చేయాల్సిన వారు.. Individuals Required to Link PAN with Aadhaar
భారత పౌరులుగా పాన్ కలిగి ఉన్న వారందరూ..
2017 జూలై 1కి ముందు పాన్ తీసుకున్న వ్యక్తులు
పన్ను చెల్లించే, ఐటీ రిటర్న్ ఫైల్ చేసే వ్యక్తులు
బ్యాంకులు, ఫైనాన్షియల్ లావాదేవీలు చేసే వ్యక్తులు
డీమాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లు ఉన్నవారు
మినహాయింపు ఉన్న వారు .. Exempted Categories
అస్సాం, మేఘాలయ, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్ర నివాసితులు
విదేశీ పౌరులు (NRIలు, OCIలు)
80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు
భారతీయేతర వ్యక్తులు లేదా సంస్థలు
ఎలా లింక్ చేయాలి? How to Link PAN with Aadhaar?
ముందుగా అధికారిక వెబ్సైట్ www.incometax.gov.inలోకి వెళ్లాలి.
హోమ్‌పేజీపై కనిపించే ‘Link Aadhaar’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
పాన్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
మొబైల్‌కు వచ్చే OTP ద్వారా ధృవీకరణ చేయాలి.
గడువు తేదీకి ముందు అవసరమైతే రూ.1,000 ఫీజు చెల్లించాలి.
వివరాలు సరైగా ఉంటే లింకింగ్ విజయవంతమవుతుంది.
ఎలా పేమెంట్ చేయాలంటే.. How to Make the Payment
అదే పోర్టల్‌లో ‘e-Pay Tax’ ఆప్షన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
చెల్లింపు పూర్తి అయిన తర్వాత మళ్లీ లింక్ ప్రక్రియ ప్రారంభించాలి.
మొబైల్ ద్వారా లింక్ చేసే మార్గం.. How to Link PAN with Aadhaar via Mobile
మీ మొబైల్ ఫోన్ నుంచి ఈ మెసేజ్ పంపండి
UIDPAN<SPACE><ఆధార్ నంబర్><SPACE><పాన్ నంబర్>
దీన్ని 567678 లేదా 56161 నంబర్‌కు పంపండి.
లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే.. How to Check If Your PAN is Linked with Aadhaar
అదే వెబ్సైట్లో ‘Link Aadhaar Status’ ఆప్షన్ ద్వారా చెక్ చేయొచ్చు.
లింక్ అయి ఉంటే “Your PAN is linked with Aadhaar” అని సందేశం వస్తుంది.
తప్పు వివరాలుంటే సరిచేయండి.. Correct Any Errors in Your Details
ఆధార్, పాన్‌లో పేర్లు లేదా జన్మతేదీ భిన్నంగా ఉంటే లింకింగ్ విఫలమవుతుంది. పాన్, ఆధార్ కార్డుల్లో పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ ఒకేలా ఉండాలి. ఆధార్ వివరాలను uidai.gov.in ద్వారా సరిచేయాలి. పాన్ వివరాల సవరణకు NSDL లేదా UTIITSL వెబ్సైట్లలో అప్డేట్ చేయాలి. చివరి రోజుల్లో వెబ్సైట్ క్రాష్ అవ్వొచ్చు. కాబట్టి గడువు లోపల ఆధార్‌తో పాన్ కార్డును లింక్ చేసుకోవడం మేలు. లింక్ అయిన తర్వాత స్క్రీన్‌షాట్ సేవ్ చేసుకోవాలి.
ఆధార్‌తో పాన్ కార్డ్ లింక్ ఎందుకంటే? Why Linking PAN with Aadhaar is Important
“పాన్–ఆధార్ లింక్ ఎందుకు ?” అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. పన్ను ఎగవేతలను అరికట్టడం, ఒకే వ్యక్తి పేరుతో ఉన్న బహుళ పాన్లను గుర్తించడం, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత తీసుకురావడం వంటి ముఖ్య ఉద్దేశ్యాలతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
డూప్లికేట్ పాన్లపై చెక్ ..Check on Duplicate PAN Cards
కొంతమంది వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉపయోగించి పన్ను మినహాయింపులు పొందుతున్నారని గతంలో పన్ను శాఖ గుర్తించింది. ఆధార్‌తో లింక్ చేసిన తర్వాత ఒక్క వ్యక్తికి ఒకే పాన్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దీంతో డూప్లికేట్ పాన్లపై చెక్ పడుతుంది.
పన్ను ఎగవేతలపై నియంత్రణ .. Control on Tax Evasion
ఆధార్ లింక్ ద్వారా ప్రతి లావాదేవీ పాన్‌తో ముడిపడి ఉంటుంది. ఎవరు ఎంత ఆదాయం పొందుతున్నారు, ఎంత పన్ను చెల్లిస్తున్నారు అన్నది సులభంగా ట్రాక్ చేయగలుగుతోంది. దీనివల్ల పన్ను ఎగవేతలు తగ్గి ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశముంది.
ఫ్రాడ్ అకౌంట్లపై అడ్డుకట్ట ..Curb on Fraudulent Accounts
బ్యాంకు, ఇన్వెస్ట్మెంట్, డీమాట్ వంటి లావాదేవీల్లో ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కావడంతో నకిలీ అకౌంట్లు తెరవడం కష్టమైంది. ఇది ఆర్థిక భద్రతకు మేలని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ పథకాల్లో ఉపయోగం ..Use in Government Schemes
ఆధార్ ద్వారా పాన్ లింక్ చేయడం వలన పన్ను రిటర్న్స్, సబ్సిడీలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు నేరుగా వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ లింకింగ్ ప్రక్రియతో పథకాల దుర్వినియోగం తగ్గింది.
ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత ..Transparency in the Financial System
ఈ లింక్ వల్ల బ్లాక్ మనీ లావాదేవీలను గుర్తించడం సులభమవుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ఆధార్‌తో పాన్ లింక్ చేయడం పన్ను చెల్లింపుదారులకు సులభత, భద్రత, పారదర్శకత కలిగించడమే లక్ష్యం. ఇది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, దేశ ఆర్థిక ఆరోగ్యం కోసం అవసరం.
పన్ను వ్యవస్థలో సాంకేతిక మార్పులు .. Technological Reforms in the Tax System
ప్రభుత్వ డిజిటల్ రిఫార్మ్స్‌లో భాగంగా ఆధార్–పాన్ లింకింగ్ ఒక కీలక దశగా నిలిచింది. వ్యక్తిగత లావాదేవీలు, ఆదాయం, పెట్టుబడులు అన్నీ ఇప్పుడు ఒకే సిస్టమ్ ద్వారా పన్ను శాఖకు అందుబాటులోకి వస్తున్నాయి.
పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం ..Ease for Taxpayers
రిటర్నులు దాఖలు చేయడం, రిఫండ్లు పొందడం, రికార్డులు అప్డేట్ చేయడం వంటి ప్రక్రియలు ఇప్పుడు మరింత వేగవంతంగా, సులభంగా మారాయి. ఆధార్ ధృవీకరణతో పన్ను శాఖకు వ్యక్తి గుర్తింపు సులభమవడంతో సమయ, పత్రాల వృథా తగ్గింది. ఆధార్–పాన్ లింకింగ్ వల్ల చెల్లించాల్సిన పన్ను తప్పించుకోవడం అసాధ్యం అవుతోంది. ఫలితంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
