భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసే వారికి, నగదు సురక్షితంగా పెంచుకోవాలనుకునేవారికి బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (NBFC) అందించే అత్యంత సులభమైన , రాబడి ఆప్షన్ ఎఫ్డీ ( ఫిక్సడ్ డిపాజిట్). ఇది ఒక నిర్దిష్ట వ్యవధి (కొన్ని నెలలు నుండి కొన్ని సంవత్సరాలు) లో మీ డబ్బును బ్యాంకులో లేదా ఫైనాన్షియల్ సంస్థలో జమ చేసేటప్పుడు, స్థిరమైన వడ్డీ రేటుతో లాభం పొందే విధానం. ఇందులో రాబడి స్థిరంగా ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉంటుంది. వడ్డీ ముందుగా నిర్ణయిస్తారు. ఇన్ఫ్లేషన్ వల్ల రియల్ రాబడి తగ్గే అవకాశం ఉంది. సరైన పథకాన్ని ఎంచుకుని మీ ఆదాయానికి, అవసరానికి తగ్గట్టే ఎఫ్డీ పెట్టడం ఒక సురక్షిత పెట్టుబడి ఎంపిక.
లాభాలు..Benefits of Multiple FDs
బహుళ FDలతో స్థిరమైన వడ్డీ ఆదాయం ఉంటుంది. నెలకు లేదా త్రైమాసికానికి ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. ప్రభుత్వ బ్యాంకులు లేదా RBI నిబద్ధత ఉన్న ప్రైవేట్ బ్యాంక్ FDలు రిస్క్ తక్కువ. ట్యాక్స్ ప్లానింగ్ సులభం . ఆరు నెలలు, ఏడాది, మూడు సంవత్సరాల FDలు, టాక్స్ ప్లానింగ్‌కు అనుకూలం.
నష్టాలు ..Drawbacks
– అధిక FD రేటు ఉన్నా, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయితే, రియల్ రాబడి తగ్గిపోతుంది. చిన్న బ్యాంకుల్లో అధిక వడ్డీ అందిస్తే, బ్యాంకు స్దిరత్వం పక్కాగా చూడాలి. లిక్విడిటీ సమస్య ఉంటుంది. FDని ముందస్తుగా రద్దు చేస్తే పీనాల్టీలు ఉంటాయి. మొత్తం లాభం తగ్గుతుంది. అధిక FDలలో పెట్టుబడి పెట్టడం అంటే “హెచ్చరికలతో లాభం పొందడం”. అని నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ బ్యాంక్ FDలు సురక్షితం. వాటితో స్థిరమైన లాభం పొందొచ్చు. చిన్న ప్రైవేట్ FDలతో ఎక్కువ వడ్డీ పొందొచ్చు. కానీ రిస్క్ ఎక్కువ. లాభం కావాలంటే రిస్క్‌ను అర్థం చేసుకోవాలి.
– బహుళ FDలు మంచివే. కానీ కాల పరిమితులు, వడ్డీ రేట్లు, లిక్విడిటీ, ఇన్ఫ్లేషన్ ప్రభావాలను కూడా గమనించాలి. కొన్ని FDలు అధిక వడ్డీ రేట్లలో, కొన్ని తక్కువ రేట్లలో ఉంటాయి. తక్కువ వడ్డీ రేట్లలో పెట్టుబడి పెడితే మొత్తం రాబడి తగ్గే అవకాశం ఉంటుంది. FDలను వేర్వేరు ఉంచకపోతే అత్యవసర నగదు అవసరంలో కొన్ని FDలను ముందుగానే రద్దు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పీనాల్టీలు పడతాయి. వడ్డీ ఆదాయం తగ్గుతుంది. బహుళ ఎఫ్డీలతో డాక్యుమెంట్లు, రీ-న్యూ ల సదుపాయాలు మరీ కష్టంగా మారవచ్చు. ప్రతి FDకి వేర్వేరు పీరియడ్, బ్యాంక్ రూల్స్ ఉంటే, నియంత్రణలో చిక్కులు రావచ్చు.
ప్రయోజనాలు..Advantages
– ఒకే బ్యాంక్, ఒకే FDలో పెట్టడం కంటే.. విభిన్న బ్యాంకులు, వివిధ FDలో పెట్టడం మంచిది. ఒక్క బ్యాంక్ లో సమస్య వచ్చినా, మొత్తం పెట్టుబడికి ముప్పు ఏర్పడదు.
– బ్యాంకును బట్టి వడ్డీరేట్లు మారుతుంటాయి. వేర్వేరు బ్యాంకుల్లో FDలు పెడితే వడ్డీ రేట్లలో సమగ్ర లాభం పెరుగుతుంది.
లిక్విడిటీ సౌలభ్యం..Liquidity Convenience
FDలను వేర్వేరుగా ఉంచితే నగదు అవసరం వచ్చినప్పుడు, కొంత FDనే రద్దు చేసి అవసరాన్ని తీర్చవచ్చు. మొత్తం FDను ముందుగానే రద్దు చేయనవసరం ఉండదు.
ట్యాక్స్ ప్లానింగ్ సౌలభ్యం..Ease of Tax Planning
వేర్వేరు FDలు, వేర్వేరు కాలపరిమితులు ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్ లియబిలిటీని సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని FDలు ఒక సంవత్సరానికి, కొన్ని 5–10 సంవత్సరాలకి పెట్టడం ద్వారా సంవత్సరాల వారీగా ఆదాయం విస్తరించవచ్చు.
ముందస్తుగా ఉపసంహరించుకుంటే.. If Withdrawn in Advance…
FDను ముందస్తుగా రద్దు చేసినప్పుడు ప్రారంభంలో ఇచ్చిన వడ్డీ రేటు కాకుండా, బ్యాంకులు తక్కువ రేటును వర్తింపజేస్తాయి. అంటే మీరు ఆశించిన మొత్తం రాబడి సాధ్యంకాకపోవచ్చు. . పీనాల్టీలు విధిస్తారు. చాలా బ్యాంకులు ప్రీ-మెచ్యూర్మెంట్ చార్జీలు వసూలు చేస్తాయి. సాధారణంగా FD రాబడిలో 0.5% – 1% తగ్గించే అవకాశం ఉంది. ముందస్తు ఉపసంహరణ ద్వారా తక్షణ నగదు అవసరాలు తీర్చుకోవచ్చు. FD ను ముందస్తుగా రద్దు చేస్తే, సంపూర్ణ వడ్డీ పొందలేరు. దీని వల్ల లాంగ్‑టర్మ్ పెట్టుబడి లక్ష్యాలు కొంతమేర ఆలస్యం అవుతాయి.
బహుళ FDల రికార్డులు… Records of Multiple FDs
బ్యాంక్ పేరు, FD సంఖ్య, ప్రారంభ , ముగింపు తేదీలు, వడ్డీ రేట్లు లాంటి వివరాలను ఒకే ఫైల్లో లేదా ఎక్సెల్లో నమోదు చేయాలి. ఇలా చేయడం వల్ల, మధ్యంతరలో ఈఎంఐ లేదా వడ్డీ లెక్కింపు సులభం అవుతుంది. నగదు అవసరం వచ్చినప్పుడు ఏ FD రద్దు చేయాలో సులభంగా తెలుసుకోవచ్చు. కాబట్టి, FD రాబడిని, లిక్విడిటీ అవసరాలను ముందుగానే ప్లాన్ చేయాలి. బహుళ FDలు వేర్వేరు వడ్డీ రేట్లలో ఉంటాయి.
ప్రతి FD వడ్డీ రాబడిని గణించటం, మొత్తం లాభాన్ని చూడటం కోసం రికార్డులు అవసరం.ఎంత రాబడి తగ్గుతుందో లెక్కించడానికి రికార్డులు ఉంటే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవచ్చు. బహుళ FDలలో పెట్టుబడి ఉంటే, అన్ని డాక్యుమెంట్స్, వడ్డీ రాబడి, కాల పరిమితులు, ముందస్తు రద్దు వివరాలు సక్రమంగా రికార్డు చేయడం చాలా అవసరం. ఇలా చేస్తే, భవిష్యత్తులో లాభాలను, లిక్విడిటీ అవసరాలను సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు, అని ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నారు.
డిపాజిట్ బీమా ..Deposit Insurance
Deposit Insurance and Credit Guarantee Corporation (DICGC) ద్వారా బ్యాంక్ డిపాజిట్లకు బీమా రక్షణ ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకులు, మరిన్ని ప్రైవేట్ బ్యాంక్ FDలు కూడా ఈ బీమా కవర్లో వస్తాయి. ఒక ఖాతాదారుని ₹5 లక్షల వరకు (ప్రincipal + వడ్డీ కలిపి) రక్షిస్తుంది. ఈ బీమా ఉంటే.. బ్యాంక్ దివాళా తీసినా, డిపాజిట్ సురక్షితంగా ఉంటుంది. చిన్న రిస్క్ ఉన్నా, పెట్టుబడి కి భద్రత ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఖాతాదారుని FD మొత్తం లేదా ఒక భాగం తిరిగి పొందగలరు. కాగా బీమా పరిమితి ₹5 లక్షల వరకు మాత్రమే. ఒక్క వ్యక్తికి, ఒక్క బ్యాంక్‌లో ఉన్న అన్ని డిపాజిట్లు కలిపి ఈ పరిమితి వర్తిస్తుంది. ముఖ్యంగా పెద్ద మొత్తంతో FD చేసే వారు బీమా కవర్ క్రాస్-చెక్ చేయడం అవసరం. FDలు పెట్టేటప్పుడు, డిపాజిట్ బీమా ను తప్పనిసరిగా పరిశీలించాలి. పెద్ద మొత్తాలు ఉన్నప్పుడు, వేర్వేరు బ్యాంకుల్లో FDలు పెట్టి బీమా పరిమితిని కవర్ చేయడం ఉత్తమం.
బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లు.. Bank Fixed Deposit (FD) Interest Rates
ప్రభుత్వ బ్యాంకులు..Government Banks
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): సీనియర్ పౌరులకు 6.95% వడ్డీ రేటు (2-3 సంవత్సరాల FD), సాధారణ పౌరులకు 6.45% వడ్డీ రేటు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): సీనియర్ పౌరులకు 7.10% వడ్డీ రేటు (390 రోజుల FD), సాధారణ పౌరులకు 6.60% వడ్డీ రేటు.
కెనరా బ్యాంక్: సీనియర్ పౌరులకు 7.00% వడ్డీ రేటు (444 రోజుల FD), సాధారణ పౌరులకు 6.50% వడ్డీ రేటు.
ఇండియన్ బ్యాంక్: సాధారణ FD రేట్లు 2.80% నుండి 6.70% వరకు ఉన్నాయి.
ప్రైవేట్ బ్యాంకులు..Private Banks
ICICI బ్యాంక్: సీనియర్ పౌరులకు 7.10% వడ్డీ రేటు (2-10 సంవత్సరాల FD), సాధారణ పౌరులకు 6.60% వడ్డీ రేటు.
HDFC బ్యాంక్: సీనియర్ పౌరులకు 7.10% వడ్డీ రేటు (18-21 నెలల FD), సాధారణ పౌరులకు 6.60% వడ్డీ రేటు.
Kotak మహీంద్ర బ్యాంక్: సీనియర్ పౌరులకు 7.10% వడ్డీ రేటు (23 నెలల FD), సాధారణ పౌరులకు 6.60% వడ్డీ రేటు.
Federal బ్యాంక్: సీనియర్ పౌరులకు 7.20% వడ్డీ రేటు (999 రోజుల FD), సాధారణ పౌరులకు 6.70% వడ్డీ రేటు.
చిన్న ఫైనాన్స్ బ్యాంకులు..Small Finance Banks
Suryoday Small Finance బ్యాంక్: సీనియర్ పౌరులకు 8.20% వడ్డీ రేటు (5 సంవత్సరాల FD), సాధారణ పౌరులకు 7.40% వడ్డీ రేటు.
Jana Small Finance బ్యాంక్: సీనియర్ పౌరులకు 8.00% వడ్డీ రేటు (5 సంవత్సరాల FD), సాధారణ పౌరులకు 7.25% వడ్డీ రేటు.
Slice Small Finance బ్యాంక్: సీనియర్ పౌరులకు 7.75% వడ్డీ రేటు (18 నెలల FD), సాధారణ పౌరులకు 6.25% వడ్డీ రేటు.
Utkarsh Small Finance బ్యాంక్: సీనియర్ పౌరులకు 7.65% వడ్డీ రేటు (2-3 సంవత్సరాల FD), సాధారణ పౌరులకు 6.00% వడ్డీ రేటు
ముఖ్య సూచనలు..Key Highlights
సీనియర్ పౌరులకు సాధారణ పౌరుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నారు. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు సాధారణంగా ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కానీ రిస్క్ కూడా ఎక్కువ. ఆర్బీఐ రేట్ల ఆధారంగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను మార్చవచ్చు.
