Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఎంత సంపాదించినా ఈ దేశాల్లో పన్ను లేదు..! అవేమిటో తెలుసా? No Matter How Much You Earn, There’s No Tax in These Countries — Do You Know Which Ones? FEATURE NEWS
  • EPFO 3.0: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రా.. ఈ ఏడాది లేనట్టేనా EPFO 3.0: PF Withdrawal Through ATMs — Not Happening This Year FEATURE NEWS
  • కమొడిటీ ట్రేడింగ్ అంటే ఏమిటి? కమొడిటీలో ట్రేడింగ్ ఎలా చెయ్యాలి ? What is Commodity Trading FEATURE NEWS
  • 2026లో బ్యాంకింగ్‌ రంగంలో కీలక మార్పులు..! Big Changes in Banking Rules 2026 FEATURE NEWS
  • రైల్వే స్టాక్స్ దూకుడు..13% ఎగబాకిన RVNL షేర్లు.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం! Railway Stocks Surge: RVNL Shares Jump 13%, Investor Optimism Rises! FEATURE NEWS
  • వెనిజులాపై అమెరికా దాడి…భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత? US Strikes on Venezuela… How Will the Indian Stock Market Be Affected? FEATURE NEWS
  • త్వరలో ఏకంగా 42 శాతం వరకు లాభం! 5 బెస్ట్ హోసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఇవే.. ! Up to 42% Returns Ahead! Here Are the 5 Best Housing Finance Stocks FEATURE NEWS
  • ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ … కీలక వడ్డీ రేట్లపై మ‌రో కోత RBI Delivers Good News Again: Another Cut in Key Interest Rates FEATURE NEWS
  • సుర‌క్షిత‌మైన‌వి పోస్టాఫీస్ సేవింగ్స్‌ post office saving schemes are safe FEATURE NEWS
  • డివిడెండ్ పై ట్యాక్స్ చెల్లించాలా should we pay tax on dividends FEATURE NEWS

ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్‌.. India Becomes the Fourth Largest Economy in the World

Posted on 31/12/2025 By admin No Comments on ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్‌.. India Becomes the Fourth Largest Economy in the World

గ్లోబల్ ఆర్థిక రేసులో భారత్ ఇప్పుడు కీలక దేశంగా నిలిచింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి (India Becomes the Fourth Largest Economy) చేరింది. జపాన్‌ను అధిగమించడంతో భారత్‌ గ్లోబల్ ఆర్థిక మ్యాప్‌లో ముఖ్యమైన దేశంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిపుణుల ప్రకారం.. 2030 కి జర్మనీని కూడా భార‌త్ వెనక్కి నెట్టనుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్స్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు, డిజిటల్ పేమెంట్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, టెక్నాలజీ స్టార్టప్‌ల తో దేశంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్య‌మైంది. యువPopulation, నైపుణ్య ప్రోగ్రామ్స్ ద్వారా పని సామర్థ్యం పెరగడంతో పాటు FDI, మల్టినేషనల్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి.

భారత్ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయికి ..India’s Economy Reaches Record Levels

(India Becomes the Fourth Largest Economy) దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వృద్ధి పరంగా పరుగులు తీస్తోంది. కేంద్రం వెల్లడించినట్లు, భారత్ జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి చేరింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.18 లక్షల కోట్ల డాలర్లు (దాదాపు రూ.376.2 లక్షల కోట్ల)కి చేరింది.

రాబోయే లక్ష్యాలు..Future Goals

కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చే 2.5–3 సంవత్సరాల్లో జర్మనీని కూడా వెనక్కి నెట్టి, భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 2030కల్లా ఆర్థిక వ్యవస్థ 7.3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనుందని అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు, అమెరికా, చైనా ప్రస్తుతంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.

జీడీపీ వృద్ధి..GDP Growth

(India Becomes the Fourth Largest Economy) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత వాస్తవ జీడీపీ 8.2% వృద్ధిని నమోదు చేసింది. ఇది తొలి త్రైమాసికం (7.8%) తో పోలిస్తే 2024–25 చివరి త్రైమాసికం (7.4%) కంటే ఎక్కువ. అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ, దేశీయ ప్రైవేటు వినియోగం పెరగడం వలన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం అయ్యింది. కేంద్రం తెలిపినట్టు, ఇదే విషయాన్ని అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా గుర్తించాయి. భారత్ ఇప్పుడు గ్లోబల్ ఆర్థిక రంగంలో కీ డీలర్‌గా ఎదిగింది. దేశీయ వినియోగం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేవి ఈ విజయం వెనుక కీలక కారణాలుగా చెప్పొచ్చు.

2047 కల్లా భారత్‌కు ఆ హోదా లక్ష్యం..India’s Target for High Middle-Income Status by 2047

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగంగా ఎదిగే ప్రధాన దేశంగా (India Becomes the Fourth Largest Economy)కొనసాగుతోంది. కేంద్రం తెలిపినట్లుగా, ఈ ధోరణిని కొనసాగించే సామర్థ్యం దేశానికి ఉంది. ముఖ్యంగా 2047 కల్లా, అంటే స్వాతంత్య్రం రాగానే 100 ఏళ్ళలో హై మిడిల్ ఇన్‌కమ్ (అధిక మధ్యాదాయ) హోదా సాధించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. కేంద్రం వివరించినట్లుగా, దేశాన్ని ఈ లక్ష్యానికి తీసుకెళ్ళడానికి ఆర్థిక వృద్ధి, నిర్మాణాత్మక సంస్కరణలు, సామాజిక ప్రగతి అనే బలమైన పునాదులు కట్టబడుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితులు..Current Situation

దేశంలో (India Becomes the Fourth Largest Economy)ద్రవ్యోల్బణం చాలా కాలంగా తక్కువగా కొనసాగుతోంది. నిరుద్యోగం తగ్గుతూ ఉంది, కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఎగుమతులు బాగా కొనసాగుతున్నాయి, వాణిజ్య రంగంలో రుణ వృద్ధి బలంగా ఉంది. పట్టణ వినియోగం పెరుగుతుండడం , సానుకూల గిరాకీ పరిస్థితులు దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. మొత్తం గా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదిగే ధోరణిని కొనసాగిస్తోంది. 2047కి దేశాన్ని అధిక మధ్యాదాయ స్థాయికి తీసుకెళ్ళే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ప్రణాళికలు అమలు అవుతున్నాయి. ప్రస్తుత వృద్ధి, సంస్కరణలు, సామాజిక అభివృద్ధి ఇవ‌న్నీ ఈ లక్ష్యాన్ని సాధించడానికి మద్దతు అందిస్తున్నాయి.

రూపాయి విలువ ప‌త‌న‌మైనా.. దేశ అభివృద్ధి ఎలా సాధ్య‌మైందంటే?
Even with the Rupee’s Decline… How Has the Country Achieved Development?

రూపాయి అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పతనమైనప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, గట్టి వృద్ధి చూపడం విశేషం. నిపుణుల ప్రకారం, రూపాయి విలువ పతనం ఉండటం దేశ అభివృద్ధికి అడ్డుకాదు. ఎందుకంటే వృద్ధి ప్రధానంగా స్థిరమైన వ్యవస్థ, పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు ఆధారంగా వస్తుంది. నగర, పట్టణ ప్రాంతాల్లో వినియోగం బలోపేతం అవ్వడం వల్ల‌ దేశీయ GDP పెరుగుతోంది. ఎగుమతులు బలంగా కొనసాగుతున్నాయి. విదేశీ డిమాండ్ వల్ల వ్యాపారం, తయారీ రంగం అభివృద్ధి చెందింది. సాంప్రదాయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, పోర్టులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ సదుపాయాలు దేశ అభివృద్ధికి మద్దతు ఇస్తున్నాయి. విద్య, ఆరోగ్య, నైపుణ్య కార్యక్రమాలు వలన పని సామర్థ్యం పెరుగుతోంది. రూపాయి కొంత పతనం చెందినా, దేశంలో వృద్ధి స్థిరంగా కొనసాగుతుంది. గ్లోబల్ మార్కెట్‌లో రూపాయి విలువ మారడం మాత్రమే ఉంటుంది. దేశీయ వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు పెరుగుతూనే ఉంటాయి.

2026లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే? What Will India’s Economy Look Like in 2026?

ప్రస్తుతంగా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, వేగంగా ఎదుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 2026లో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడనుంది. GDP వృద్ధి, పెట్టుబడులు, వినియోగం ఇలా అన్ని రంగాల్లో బలమైన పెరుగుదల కనబడుతుంది. 2026లో GDP వాస్తవ వృద్ధి రేటు సుమారుగా 6–7% మధ్యన కొనసాగుతుందని అంచనా. ప్రైవేట్ వినియోగం పెరుగుతుంది. నగర, పట్టణ ప్రాంతాల్లో వినియోగం, రిటైల్, ఇ-కామర్స్ రంగాల్లో వృద్ధి పెర‌గ‌నుంది. ఎగుమతులు బలోపేతం కానున్నాయి. అంతర్జాతీయ డిమాండ్, ‘Make in India’ విధానాలు, రవాణా సదుపాయాల అభివృద్ధి వలన ఎగుమతులు పెరుగుతాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, FDI, స్టార్టప్‌ల విస్తరణ వ‌ల్ల‌ పెట్టుబడులు మరింత బలపడతాయి. కాగా విదేశీ మార్కెట్‌లో అస్థిరతలు, చైనా, అమెరికా వంటి దేశాల పరిస్థితులు ప్రభావితం చేయవచ్చు. ద్రవ్యోల్బణం, విలువ మార్పులు, రూపాయి విలువలో తేడాలు, ఉత్పత్తి ఖర్చులు కూడా GDP వృద్ధిపై ప్రభావం చూపవచ్చు. ఇక‌పోతే డిజిటల్ పేమెంట్స్, ఫిన్టెక్ విస్తరణ, ఆన్‌లైన్ వ్యాపారం వలన దేశీయ ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిశ్రమలు, టెక్నాలజీ రంగం, నూతన పెట్టుబడులు.. వాణిజ్య రంగంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంది. మొత్తంగా 2026లో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, వేగంగా పెరుగుతూ, ప్రపంచంలో కీలక ఆర్థిక దేశాల జాబితాలో ముఖ్యమైన స్థానాన్ని సాధిస్తుంది. ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు దేశ అభివృద్ధికి మద్దతు ఇస్తాయి.

 

68
FEATURE NEWS Tags:Current Situation, Even with the Rupee’s Decline… How Has the Country Achieved Development?, Future Goals, GDP Growth, India’s Economy Reaches Record Levels, India’s Target for High Middle-Income Status by 2047, What Will India’s Economy Look Like in 2026?

Post navigation

Previous Post: ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? నెలవారీ ఆదాయం ఎలా సంపాదించాలి? How NRIs Can Invest in India & Build Monthly Income
Next Post: 2025లో రూ.30 లక్షల కోట్లకు పెరిగిన మదుపర్ల సంపద..Investor Wealth Rises to ₹30 Lakh Crores in 2025

Related Posts

  • దూసుకెళ్తున్న బీఎఫ్‌ఎస్‌ఐ(BFSI)! భారీగా పెరిగిన మార్కెట్ విలువ‌ Soaring BFSI Sector! Market Value Surges Massively FEATURE NEWS
  • డిస్కౌంట్ బ్రోక‌ర్‌తో ఇవీ న‌ష్టాలు what are the disadvantages of discount brokers FEATURE NEWS
  • రూపాయి క్షీణత .. ‘టీవీ – మొబైల్‌’ భారం.. ! Rupee Depreciation: ‘TV–Mobile’ Burden Mounts! FEATURE NEWS
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS
  • కొత్త సంప‌న్నుల కోసం వెల్త్ సైకాలజిస్టులు Wealth Psychologists for New Affluents FEATURE NEWS
  • సిబిల్ స్కోరుపై ఆర్‌బీఐ కొత్త ప్ర‌తిపాద‌న ..RBI’s New Proposal on CIBIL Score FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు

Recent Posts

  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed!
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible!
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning
  • వెండి ఆభరణాలపై కొత్త రూల్: కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి! New Rules on Silver Jewellery: What to Know Before Buying
  • ఎల్ఐసీ కొత్త పాల‌సీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Expert Advice Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What is Personal loan and how to get personal loan what is scuttlebutt investing in stock market WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT which is the best stock broking agency Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

January 2026
S M T W T F S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
  • 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి.. ఇన్సూరెన్స్ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయ్..? 100% Foreign Investment Approval: What Changes Will It Bring to the Insurance Sector? INSURANCE
  • స్వయంకృషితో ఎదిగారు.. పారిశ్రామికవేత్తల్లో అగ్రస్థానంలో నిలిచారు Self-Made Industrialists Reach the Top FEATURE NEWS
  • FIIs AND DIIs అంటే ఏమిటి what is meant by fii and dii MARKET
  • భారతీయులు స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు? Why Indians Are Not Investing in the Stock Market FEATURE NEWS
  • మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడికి కార‌ణ‌మేంటి What is the reason for the intense pressure in the market? MARKET
  • క్రెడిట్ కార్డు… వీళ్ల‌కి వ‌రం what are the benifits of credit cards FEATURE NEWS
  • How to Check EPF balance..? పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి..? FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ఎంత‌కాలం కొన‌సాగిస్తే లాభాదాయకం How long does it take to maintain a mutual fund investment to be profitable FINICAL PLANNING

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme