what will makes you rich

  1. * ధనవంతులవ్వాలంటే ఆలోచ‌న మార్చుకోవాల్సిందే

కేవలం ఆదాయం ఒక్క‌టే మిమ్మ‌ల్ని ధ‌న‌వంతుల‌ను చేయ‌దు. మీ ఆలోచ‌న కూడా మిమ్మ‌ల్ని రిచ్‌గా మార్చేందుకు తోడ్ప‌డుతుంది. కొన్ని సార్లు ఆదాయం లేక‌పోయినా మీ దీర్ఘ దృష్టి, స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌, స‌వ్య‌మైన అల‌వాట్లే మిమ్మ‌ల్ని ధ‌న‌వంతులుగా మారుస్తాయి. ఆదాయం ఎలా ఉన్నా, ఆలోచ‌న మాత్రం బాగుండాల్సిందే. అదే మ‌న‌ల్ని సంప‌ద‌కు చేరువ చేస్తుంది.

తక్కువ అమౌంట్ తో కూడా లాంగ్ టెర్మ్ లో ఎక్కువ సంప‌ద పోగేసుకోవ‌చ్చు. ఇక్కడ అమౌంట్ ముఖ్యం కాదు. మనం ఎన్ని సంవత్సరాలు ప్లాన్ చేశామో అన్న‌దే ముఖ్యం. మనం లాంగ్ టెర్మ్ లో నిజంగా ధనవంతులు అవ్వాలంటే మనకోసం మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేయాలి. మనకి 20 -25 శాతం ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉన్నాయి. వాటిలో దీర్ఘ‌కాలం పెట్టుబ‌డి చేస్తే లాభాలు ఖాయం.

what are the major requirements in life

ఈ అవ‌స‌రాలను గుర్తించాలి..
మ‌న అవ‌స‌రాల‌న్నింటినీ ముందుగానే గుర్తించ‌గ‌లిగితే వాట‌న్నిటి కోసం మ‌నం విడివిడిగా పొదుపు చేసుకుంటూ పోవ‌చ్చు. అలా చేస్తే స‌మ‌స్య‌లు దూరమే.
* అత్య‌వ‌స నిధి
* మ‌న ఆరోగ్యం
* త‌ల్లిదండ్రుల అనారోగ్యం
* భార్యకు బంగారం
* కారు
* ఇళ్లు
* పిల్ల‌ల చ‌దువు
* పిల్ల‌ల పెళ్లి, భ‌విష్య‌త్తు
* మ‌న రిటైర్మెంట్‌
* అద‌న‌పు ఆస్తులు…
సాధార‌ణంగా మన నిత్య జీవితంలో ఉండే ప్ర‌ధాన అవ‌స‌రాలు ఇవే. వీట‌న్నింటి కోసం ముందు నుంచే మ‌నం కొంచెం కొంచెం గా డ‌బ్బులు పొదుపు చేస్తూ పోతే ఆ అవ‌స‌రాలు వ‌చ్చే స‌రికి మ‌న ద‌గ్గ‌ర ఫుల్లుగా డ‌బ్బులు ఉంటాయి. లేదంటే చిరాకు, విసుగు, ఒత్తిడి, బాధ‌, ఆందోళ‌న‌, విర‌క్తి క‌లిగి తీవ్రంగా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది.

how to plan your financial needs

ఇలా ప్లాన్ చేసుకోవాలి..!
మ‌న అవ‌స‌రాల్లో దీర్ఘ‌కాలంలో వ‌చ్చేవాటిని గుర్తించి వాటి కోసం మ్యూచువ‌ల్ ఫండ్స్ సిప్ చేయాలి.
ఎందుకంటే దీర్ఘ‌కాలంలో కాంపౌండింగ్ వ‌ల్ల చాలా లాభాలు వ‌స్తాయి. విడి విడిగా కొన్నిసిప్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి గంద‌ర‌గోళం లేకుండా క్లియ‌ర్‌గా ఉంటుంది. మనం దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. సిప్ లోకి వెళ్ళి మనం లెక్కవేసుకోవాలి. అంటే మనం ఎంత అమౌంట్ కడతాం ? ఎన్ని సంవత్సరాలు కడతాం ? ఎంత రిటర్న్స్ ఇస్తుందో చెక్ చేసుకోవాలి.
– పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పేరు మీద ప్రతి నెలా రూ.1000 మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు 25 ఏళ్ళు వచ్చేసరికి `1 కోటి రూపాయ‌లు` వస్తుంది. దీంతో పాటు క‌నీసం నెల‌కు రూ. 500 సిప్ చేస్తే పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల‌కు వారికి 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చే నాటికి అధిక మొత్త‌మే జ‌మ‌ అవుతుంది.
– ఆదాయం మొద‌లైన‌ప్పుడే ఇంటి కోసం ఒక‌టి, కారు కోసం ఒక‌టి సిప్ మొద‌లు పెట్టాలి. వీలైనంత ఎక్కువ మొత్తాన్ని త‌క్కువ కాలం కోసం సిప్ చేస్తే లోన్ తీసుకునేట‌ప్పుడు మ‌న చేతిలో కొంత మొత్తం ఉంటుంది. దీని వ‌ల్ల రుణ భారం కొంత త‌గ్గుతుంది.
– నెల‌లో కానీ, సంవ‌త్స‌రంలో కానీ, అనుకోకుండా వ‌చ్చిన డ‌బ్బుల‌ను కానీ మార్కెట్ డౌన్‌లో ఉన్న‌ప్పుడు షేర్లు కొనేందుకు, లేదా మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను కొనేందుకు ఉపయోగించాలి. ఇలా చేసే మొత్తంలోనుంచి అవ‌స‌రం అనుకున్న‌ప్పుడు తీసి బంగారం కొనుక్కోవ‌డం లేదా చిన్న చిన్న అవ‌స‌రాల‌కు వాడుకోవ‌చ్చు.

జీవితం మ‌న చేతిలోనే..
ఇలా మ‌నం ప‌క్కా ప్లానింగ్ చేసుకుని అంతే ఖ‌చ్చితంగా ఉండ‌గ‌లిగితే జీవితం అంతా మ‌న చేతిలోనే, మ‌నం అనుకున్న‌ట్టుగానే ఉంటుంది. దీంతో ధ‌న‌వంతుల‌వ‌డ‌మే కాకుండా సంతోషం కూడా పొంద‌గ‌లుగుతాం. ఇక్క‌డ మ‌న‌కు ఉప‌యోగి ప‌డిన గొప్ప ఆలోచ‌న ఏమిటంటే దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి. నెలకి క‌నీసం రూ.100 దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసినా జీవితం చివ‌రి నాటికి తప్పకుండా ధనవంతులు అవ్వవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *