వాడు పిసినారోడు.. వీడు చాలా కన్జూస్.. ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్ట‌డు.. ఒకరికి పెట్టడు, తాను తినడు..  ప్రతి విషయంలోనూ మరీ పొదుపు పాటించాలని అనుకుంటాడు.. అనే మాట‌లూ మ‌నం కొంద‌రి విష‌యంలో వింటూ, అంటూ ఉంటాం. ఇటువంటి వారిని లోభి లేదా  పిసినారి అని అంటుంటారు.  మ‌న స‌మాజంలో ఎటువంటి వారెంతో మంది మ‌న‌కు తార‌స‌ప‌డుతుంటారు. కుటుంబ స‌భ్యుల్లో, స్నేహితుల్లో.. ప‌నిచేసే చోట .. ఇలా ఒక చోట ఏమిటి.. అంత‌టా ఇటువంటి వారు మ‌న‌కు క‌నిపిస్తుంటారు.  అయితే ఎవ్వరికీ ఏమీ ఇవ్వనివాడు లేదా డబ్బుని కనీసం ఖర్చుపెట్టనివాడిని పిసినారి అంటాం.  కాగా  ఈ రకమైన తత్వం సరైన కాదా అనేది సందర్భం మీద ఆధారపడుతుంది. కానీ లోకం వాళ్లనేదో తప్పుడు వ్యక్తులుగా ప్రచారం చేస్తుంది. వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది. కానీ నిఖార్సయిన పిసినారి ఎవడూ లోకం మాటలను పట్టించుకోడు. తన పని తాను చేసుకుంటూ డబ్బుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాడు. కానీ అసలైన అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆ పిసినారే అందరికీ గుర్తు వస్తాడు. ఆ పిసినారే వాళ్లను ఆదుకుంటాడు. పొదుపు, పిసినారితనం అనే ఈ రెండు రెలెటివ్ పదాలు. వాటిని నిర్వచించటం కుదరదు, వ్యక్తి కీ వ్యక్తికీ మారుతూ ఉంటాయి.

ఉదాహ‌ర‌ణ‌కు.. For example..

– ఒక‌ ఆఫీస్ లో ఇద్దరు మిత్రులుండేవారు. ఒకరు సూర్యం. రెండవ వాడు శ్యామ్. సూర్యం ఎప్పుడు పొదుపు చేయడం ఎలా ? అనే దానిపైనే ఆలోచించేవాడు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ మొదలు బ్యాంకు, చిట్ ఫండ్ కంపనీలు, షేర్స్ ఇలా రకరకాల పొదుపు విష‌యాలు పాటించి  అంద‌రికీ పాఠాలు చెప్పేవాడు. నేటి పొదుపు రేపటి సుఖం అనేవాడు.  కానీ తన ఖర్చు తాను పెట్టుకొనేవాడు.

– శ్యామ్ మటుకు పిసినార్లకు పిసినారి. ఏమి చేసి డ‌బ్బు దాచేవాడో ఎవ్వరికీ తెలియ వచ్చేది కాదు. వాళ్ల  ఊరిలో కుటుంబం ఉండేది. సాయంత్రం వేడి వేడి మిర్చి బజ్జీలు అందరం తినేవాళ్లం. శ్యామ్ తినేవాడు కాదు. ఒకసారి ఫ్రీ గా తింటే ఎదోకప్పుడు మాకు తినిపించాలి వస్తుంద‌నేది ఆయ‌న ఆలోచన. ఒకసారి తాను ఉండే రూమ్ కి వెళ్లాను. రెండే రెండు లావు మిరపకాయలు తీసుకుని సెనగ పిండి లో కలుపుకొని కడాయిలో నూనె పోసి అందులో వేసి తయారైనాక ప్లేట్ లో పెట్టుకుని తింటుండగా చూశాను. నన్ను చూసి లోపల పెట్టి వచ్చాడు. బయట తింటే ఐదు రూపాయలు, అదే మనం చేసుకుంటే రెండు రూపాయి ల కు నాలుగు చేసుకోవొచ్చు అన్నాడు.

దాన కర్ణులు కాదెవ్వరూ.. 

No one is a Donor

ఇక్కడ మనం గుర్తించాల్సిందేంటంటే ఇక్కడ ఎవ్వరూ దాన కర్ణులు కాదు. అందరూ తమ అవసరాల కోసమే ఖర్చు పెట్టుకుంటారు. తమ కోసమే బతుకుతారు. మితి మీరిన లగ్జరీల కోసం ఆరాటపడి అధికంగా ఖర్చు చేసుకుంటారు. లోకం ముందు గొప్పగా కనిపడేందుకు షో చేస్తారు. ఈ తరహాలో ప్రవర్తిస్తూ తామేదో గొప్ప వాళ్లమని, డబ్బుల విషయంలో ఉదారంగా ఉంటామని, డబ్బులు దాచుకునేంత పిసినారోళ్లం కాదని, ఈ లోకాన్ని మేమే బతికిస్తున్నామనే భావనలో ఉంటారు. అందుకే పిసినారోళ్లను ఈసడించుకుంటారు. కానీ వాళ్లకేదైనా అత్యవసరమైతే `నేనందరికీ పెట్టానే.. కానీ నాకెవ్వరూ పెట్టే వాళ్లే లేరే`అని ఆడిపోసుకుంటారు. మనిషి తన అవసరాలను తీర్చుకోటానికి కష్టపడి పనిచేస్తూ జీవించినంత కాలం ఏ సమస్యా ఉండదు, కానీ ఎదుటివారిలా జీవించాలనుకున్నప్పుడే అసలు సమస్య. అప్పుడే అతను లేనిపోని ఖర్చులు మీద వేసుకుంటాడు. అనవసరమైన ఆర్భాటాలకుపోయి లగ్జరీగా జీవితం గడపటానికి వృథా ఖర్చులన్నీ చేయ‌డం మొదలెడతాడు.

 

పిసినారోళ్ల తీరే వేరు..

Pisinarollu is different..

* ఎవ్వరికోసం ఆరాటపడరు.

* తమ అవసరాల కోసం ఎవ్వరి మీదా ఆధారపడరు.

* తమ డబ్బును షో చేయరు.. దర్పాన్ని ప్రదర్శించరు..

* లోకం ఏమనుకున్నా పట్టించుకోరు. మొహమాటానికి పోరు..

* ఎవ్వరి మీద పడి ఏడవరు..

* గొప్పలకు పోరు.. ఉన్నంతలో పొదుపుగా బతుకుతారు.

* ముందు చూపుతో వ్యవహరిస్తూ రేపటి కోసం జాగ్రత్త పడతారు.

* తమ కోసమే బతకుతారు.. కానీ నిజమైన అవసరమొస్తే మాత్రం ఎవరినైనా ఆదుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో అవసరమైతే తాము నష్టపోతారు కూడా.

* ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే స్థైర్యం కలిగి ఉంటారు.

మితిమీరిన  పిసినారిత‌నంతో తంటా 

Problems  with excessive miser

పిసినిరి త‌నం ఉండొచ్చు. అయితే మితిమీరిన పిసినారితనంతోనే అసలైన తంటా.. కనీస అవసరాలు తీర్చుకోకుండా, కుటుంబ అవసరాలను గుర్తించకుండా డబ్బును పొదుపు చేసే తీరు మాత్రం సరైనది కాదు. అర్థం లేకుండా, అవగాహనరాహిత్యంతో చేసే పొదుపు నీటిలో పోసిన పన్నీరే. ఇష్టాలని, సుఖాలని అన్నీ చంపుకుని విపరీతంగా లెక్కలు వేసే వాళ్లు మాత్రం పిసినారి కాదు.. వాళ్లని మూర్ఖులంటారు..

పిసినారి స్వ‌భావం 

వ్య‌క్తుల స్వ‌భావాలు భిన్నంగా ఉంటాయి. భ‌విష్య‌త్‌లో ఇబ్బంది ప‌డ‌కూద‌ద‌నే ఉద్దేశంతో కొంత‌మంది డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌రు. వాళ్ల‌కి సంపాదించ‌డం,దాచుకోవ‌డ‌మే తెలుసు. పొదుపు, భ‌ద్ర‌త కోస‌మే ఎక్కువ‌గా వారు ఆలోచిస్తుంటారు. ప్ర‌తినెలా చేతికి ఆదాయం  రాగానే బకాయి, ఇతర చెల్లింపులు ముందుగా పూర్తి చేస్తారు. ఆ తరువాత మిగిలిన దానితో నెలవారీ ఖర్చులు పోగా ఇంకా కొంత మొత్తాన్ని పొదుపు చేయటం వారికి సహజంగా అలవాటైన పని. అది వారి ఆర్థిక క్రమశిక్షణకు తార్కాణం.  కుటుంబ అవ‌స‌రాల కోసం అప్పుడ‌ప్పుడు బంగారం కొంటారు. అదేవిధంగా బీమా పాల‌సీలు క‌డుతుంటారు. ఇత‌ర రంగాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అన‌వ‌స‌రంగా ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌రు.  హంగులు, ఆర్భాటాల‌కు పోరు. చాలా సింపుల్‌గా జీవిస్తారు. ఇత‌రుల జీవితాల‌తో పోల్చుకుని క‌ష్టాల‌ను కొనితెచ్చుకోరు.  చాలా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రిస్తారు. జీవిత చ‌రమాంకంలో ఆరోగ్య స‌మ‌స్య‌లు, ఇత‌ర‌త్రా ఇబ్బందులను త‌ట్టుకునేలా.. ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌తారు. వీరు ఎవ‌రిపైనా ఆధార‌ప‌డ‌రు.

– కుటుంబం, ఆర్థిక విషయాల నిర్వహణలో చాలా ప‌క్కాగా ఉంటారు. కుటుంబ అవసరాలు,  ఆర్థిక స్థితిగతులను సమన్వయం చేసుకుంటారు.

– పొదుపు చేయటం అనేది పిసినారుల‌ సహజ స్వభావం. భవిష్యత్తులో వచ్చే అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఖర్చులు తగ్గించుకుంటారు. ఉన్న‌దానిలో స‌ర్దుకుపోతారు. డబ్బును నిలువ చేస్తారు. సాధ్యమైనంత వరకూ కుటుంబ నిర్వహణలో కానీ, మ‌రే ఇత‌ర అవసరాల నిమిత్తం కానీ ప‌రులపై ఆధారపడకుండా తామే స్వయంగా నిర్వహించుకుంటారు.

– ‘‘ఖర్చు తగ్గించుకోవడమే పెద్ద పొదుపు’’ అనే విషయాన్ని వారు మ‌న‌కు తెలియ‌జేస్తుంటారు.

–  ఏ పనికైతే ఉద్దేశించి డ‌బ్బులు ఉంచుతారో.. ఆ మొత్తం అందుకోసమే ఖర్చు చేస్తారు.  దానికోసం ముందుగానే  విడిగా కొంత‌మొత్తం తీసి ఉంచటం వారికి అలవాటు.

–  ఒకేప‌నిపై పిసినారులు ఆధార‌పడి జీవించ‌రు. వేర్వేరు వ్యాప‌కాలు, ప‌నుల ద్వారా వారు డ‌బ్బులు సంపాదిస్తుంటారు.  టైం వేస్ట్ చేయ‌రు.  ప్రతి స‌మ‌యం వారు డ‌బ్బుల సంపాద‌న‌పైనే ఆలోచిస్తారు.

– ఆర్థిక స్వావలంబన, ఆర్థికపుష్టితో పాటుగా ఆర్థిక క్రమశిక్షణ పాటించటంలో  పిసినారులు ముందుంటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *