డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి..?
which is the best investment option
మనలో చాలా మందికి ఉండే సందేహమే ఇది. వచ్చిన ఆదాయంలో మిగిలిన నిధులను ఎలా, ఎక్కడ దాచుకోవాలి లేదా ఎక్కడ పెట్టుబడి పెడితే సేఫ్‌గా, లాభదాయకంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇందుకు చాలా విషయాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. మన అవసరాలు, రిస్క్ సామర్థ్యం ఇలా వీటన్నింటినీ బట్టి ఎక్కడ పెట్టవచ్చు అని నిర్ణయించవచ్చు. అయితే సాధారణంగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ సాధనాలను ఓసారి పరిశీలిద్దాం.
types of best asset classes
డబ్బును పొదుపు చేసేందుకు ప్రధానంగా 4 ఎసెట్ క్లాసెస్ ఉంటాయి. అందులో ప్రధానంగా
1.డెట్ 2.ఈక్విటీ 3.గోల్డ్ 4.రియల్ ఎస్టేట్
* ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్, బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, పీపీఎఫ్, ఎన్ పీఎస్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ తక్కువ వడ్డీతో, తక్కువ రిస్క్ కలిగి ఉంటాయి. వీటినే డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటారు.
ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్లకి సంబంధించింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్‌తో కూడుకున్న, లాభదాయక మార్గం ఇది.
* గోల్డ్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గోల్డ్ జ్యూయలరీ కావచ్చు, గోల్డ్ కాయిన్స్ కావచ్చు, ఈ – గోల్డ్, గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్.. ఇవన్నీ బంగారం సంబంధించినవే.
* రియల్ ఎస్టేట్ లో చాలా రకాలు ఉంటాయి. ప్లాట్, హౌస్, కమర్షియల్ ప్లేసెస్ లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు.
డెట్..
డెట్ ఇన్స్ట్రుమెంట్ లో వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. మనకు డబ్బు అవసరం అయితే వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేసి డబ్బులను తీసుకోవచ్చు. మనకు ఫిక్స్డ్ డిపాజిట్ లో వడ్డీ తక్కువగా ఉంటుంది. కానీ ఖర్చులు ఎక్కువగా పెరిగితే మనకి లాస్ వస్తుంది. ఈ కేటగిరిలో డిస్ అడ్వాంటేజ్ ఇది.
ఈక్విటీ
ఈక్విటీలో, మ్యూచువల్ ఫండ్స్ లో నెగిటివ్ ఏంటంటే అది వాలటాలిటీ. అంటే మార్కెట్ పడటం, లేవడం. ఇందులో షార్ట్ టెర్మ్ లో ఇన్వెస్ట్ చేసినవాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి.
గోల్డ్…
గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేస్తుంది. అలాగే మార్కెట్ పడిపోతున్నపుడు గోల్డ్ రేటు బాగా పెరిగిపోతుంది. కాని గోల్డ్ లో క్యాష్ ప్లో ఉండదు. అలాగే ఆర్నమెంట్ గోల్డ్ లో మేకింగ్ ఛార్జస్ ఎక్కువగా ఉంటాయి.
is real estate profitable
రియల్ ఎస్టేట్ …
రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది. అయితే మనం ఎంచుకునే లొకేషన్ బట్టి, ప్లేస్ ను బట్టి ఇది మారుతుంది. దీనిలో క్యాష్ ప్లో బాగా వస్తుంది. కానీ ఇందులో లిక్విడిటీ తక్కువ. అంటే అర్జెంట్ గా డబ్బులు అవసరం వచ్చినపుడు దానిని అమ్మడం అంత సులభం కాదు. మనం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్లానింగ్ లేకుండా చేయకూడదు.
ఇళ్ళు కొనాలంటే ప్లానింగ్ లేకుండా ముందుకి వెళ్ళకూడదు. మన దగ్గర 20-30 శాతం క్యాష్ ఉండాలి. ఈఎమ్ఐ నెలకు మన జీతంలో 40 శాతం దాటకుండా ఉండాలి. అప్పులు ఉండకూడదు. ఇలా అయితే మనం రియల్ ఎస్టేట్ లో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసినా మన క్యాష్ ప్లో కి మన ఫైనాన్షియల్ కి ఎటువంటి ఇబ్బంది జరగదు.
Leave a Reply