స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీలు తమ షేర్లను తామే కొనుక్కునే ప్రక్రియే బై బ్యాక్‌. అయితే దీనివల్ల మదుపరులకు ప్ర‌యోజ‌నామా లేదా అన్న‌ది కంపెనీ, మార్కెట్ పరిస్థితిని అధ్య‌యం చేస్తే అర్థ‌మ‌వుతుంది.

వాటాదారుల నుంచి నిర్ణీత సమయంలో నిర్దేశించిన ధరకు కంపెనీ వాటాలను కొనుగోలు చేస్తుంది. ఇది ఒక కార్పొరేట్ ఏక్ష‌న్‌. సహజంగా మార్కెట్ ధరకంటే నిర్దేశించిన ధర ఎక్కువగా ఉంటుంది. 2021లో 42 కంపెనీలు బైబ్యాక్ నిమిత్తం సుమారు రూ.14,341 కోట్లు వెచ్చించాయి. 2022లో ఇప్పటివరకూ 9 కంపెనీలు షేర్ల బైబ్యాక్ ను ప్రకటించి రూ.19,525 కోట్లకు కేటాయించాయి.

why companies announces share buyback

బై బ్యాక్ ఎందుకంటే..
* కంపెనీల లాభాలు మరింత మెరుగయ్యే అంచనాల నేపథ్యంలో అనేక కంపెనీలు రాబోయే రోజుల్లో షేర్ల బైబ్యాక్ ద్వారా తమ వాటాలను మరింత పెంచుకునే వీలుంది.
* తమ కంపెనీ షేరు వాస్తవిక విలువకన్నా తక్కువకు మార్కెట్లో ఉందని కంపెనీలు భావించినప్పుడు, షేర్ ధరకు మద్దతు ఇవ్వడానికి కొన్ని కంపెనీలు షేర్ల బైబ్యాక్ ను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల మార్కెట్లో కంపెనీ షేర్ల సంఖ్య తగ్గి, ఉన్న షేర్ల ధరకు డిమాండ్ పెరుగుతుంది.
* కొన్ని కంపెనీలు తమ వద్ద నిరుపయోగంగా ఉన్న మిగులు మొత్తాల నుంచి వాటాదారులకు ప్రతిఫలం ఇచ్చేందుకు బైబ్యాక్ మార్గాన్ని ఎంచుకుంటాయి.
* యాజమాన్య నియంత్రణ వాటా పెంచుకోడానికీ.. ఇతర వ్యక్తులు, సంస్థలు కంపెనీలో పైచేయి సాధించకుండా తదితర ఆలోచనలతో యాజమాన్యాలు రక్షణాత్మకంగా బైబ్యాక్ ను చేస్తుంటాయి.
* కంపెనీ ఆర్థిక ఆరోగ్యాన్ని, తమ వ్యాపారంపై ఉన్న నమ్మకాన్ని పెట్టుబడిదారులకు తెలియజేసేందుకూ బై బ్యాక్ చేస్తుంటాయి.
* బైబ్యాక్ ద్వారా మంచి రాబడిని అందుకోవడంతోపాటు, వాటాదార్లు మూలధన లాభంపై పన్ను మినహాయింపును పొందే వీలుంటుంది. కంపెనీలు మాత్రంబైబ్యాక్ ట్యాక్స్ ను చెల్లించాలి.

types of shares buy back

రెండు ర‌కాలుగా..
మొద‌టి ప‌ద్ధ‌తిలో కంపెనీ ఒక ధరను నిర్ణయించి ఆఖరి తేదీని ప్రకటిస్తుంది. అర్హులైన వాటాదారులు బైబ్యాక్ నిష్పత్తి ప్రకారం తమ షేర్లను కంపెనీకి ఇవ్వడానికి బ్రోకర్ ద్వారా గడువు లోపు టెండర్ వేసే ప్ర‌క్రియ టెండ‌ర్ ఆఫ‌ర్‌. టెండర్ 10 రోజుల వ‌ర‌కూ వరకూ తెరిచి ఉంటుంది.
ఓపెన్ మార్కెట్లో నుంచి బైబ్యాక్ చేయ‌డం రెండో విధానం. స్టాక్ ఎక్స్ఛేంజీ లేదా బుక్ బిల్డింగ్ ఏదైనా ఒక పద్ధ‌తిలో కంపెనీ దీనిని చేస్తుంది. కంపెనీ ప్రతిపాదించిన ఎక్కువ ధరకు నిర్దేశించికున్న షేర్లను, నిర్ణీత‌ గడువులోపు స్టాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు.

* మార్కెట్ ధరతో పోల్చినప్పుడు బైబ్యాక్ ధర ఎక్కువ‌గా ఉంటుంది. అందువల్ల ఎక్కువధరకు షేర్లను విక్రయించే అవకాశం లభిస్తుంది.

* బైబ్యాక్ లో పాల్గొనాలా వద్దా అనేది పెట్టుబడుదారుల ఇష్టమే. ఉన్న ధర కంటే బైబ్యాక్ ధర ఎక్కువనిపిస్తే ఆశ చూపొచ్చు.

* షేర్ల ధరలను మార్కెట్ పెచ్చుతగ్గులు, గిరాకీ- సరఫరాలోని ఎన్నో విషయాలు ప్రభావితం చేస్తుంటాయి. బైబ్యాక్ ద్వారా కొనుగోలు మద్దతు కొంతకాలానికి ఉపయోగపడొచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా కంటే టెండర్ ఆఫర్ బైబ్యాక్ లోనే మదుపరులకు ఉపయోగమని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *