ఫ్యూచ‌ర్స్ అండ్ ఆప్ష‌న్స్ అంటే..?

what is futures and options

స్టాక్ మార్కెట్‌లో మ‌నం త‌రుచూ వింటూ ఉండే ప‌దం ఇది. ఫ్యూచ‌ర్స్‌లో ఇంత లాభాలు వ‌చ్చాయి.. అంత న‌ష్ట‌పోయాము అని. కానీ అస‌లు ఫ్యూచ‌ర్స్ అంటే ఏమిటో మ‌న‌కు స‌రిగ్గా తెలియదు. ఓ సారి దానిపై ఓ లుక్కేద్దాం. ఫ్యూచ‌ర్ అంటే కొనుగోలుదారులకు అమ్మినవా కు మధ్య జరిగే ఒప్పందం. దీనిని ఒక ఉదాహ‌ర‌ణ తీసుకుని అర్థం చేసుకుందాం..

 రైతు ఒక పంటను పండిస్తున్నాడనుకుందాం. ఆ పంటకు త్వరలో డిమాండ్ త‌గ్గి విప‌రీతంగా అందుబాటులోకి రావ‌డంతో ధర తగ్గిపోతుందేమో అని రైతు అనుకుంటున్నాడు. ప్రస్తుత ధర కేజీ 80 రూ. ఉంది. పంట ధర కేజీ 60 రూ. పడిపోవచ్చని భావిస్తున్నాడు.

అదే విధంగా ఓ వ్యాపారి ఆ పంట ధ‌ర‌ రాబోయే రోజుల్లో కేజీ 100రూ. అవ్వవచ్చని అనుకుంటాడు. అప్పుడు పై రైతు ద‌గ్గ‌రికి వెళ్లి కొనేందుకు సిద్ధ‌మ‌య్యాడు. వీళ్ళద్దరి మ‌ధ్య బేరం కుదిరి పంట అమ్మేసరికి కేజీ 80రూ.కి తీసుకునేలా వ్యాపారి ఒప్పందం కుదుర్చుకుని అగ్రిమెంట్ రాసుకుంటారు. దీనిని బ‌ట్టి రేపు పంట చేతికి వ‌చ్చి అమ్మే స‌మ‌యానికి ధ‌ర పెరిగినా… త‌గ్గినా వీరికి సంబంధం ఉండ‌దు. ఒప్పందంలో ఏమేర‌కు ధ‌ర నిర్ణ‌యించుకున్నారో అదే ధ‌ర‌కు అమ్మాలి.

పై ఉదాహరణలో రైతు 1000 కేజీల పంట‌ను రూ.80 చొప్పున వ్యాపారికి అమ్మాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పుడున్న మార్కెట్ రేటు 80 కంటే ఎక్కువ ఉంటే రైతుకు న‌ష్టం, వ్యాపారికి లాభం.
80 కంటే త‌క్కువ ఉంటే రైతుకు లాభం, వ్యాపారికి న‌ష్టం. దీనిని బట్టి ఇక్క‌డ ఒకరికి లాభం మరొకరికి నష్టం. కాబట్టి ఒక వస్తువుని లేదా ఆస్తిని భవిష్యత్తులో ధరను ఊహించి దాని ఆధారంగా ఏర్పరచుకున్న కాంట్రాక్టను అమ్మడం లేదా కొనడాన్ని ఫ్యూచర్ మార్కెట్ అంటారు.

how to trade futures and options

ఫ్యూచ‌ర్ అండ్ ఆప్ష‌న్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు ఇక్క‌డ షేర్ల‌ను విడివిడిగా కొన‌లేం. లాట్ లోనే కొనాలి. ఇక్కడ లాట్ అంటే సుమారు 100 లేదా 150 షేర్లు. కంపెనీ కంపెనీకి లాట్ సైజ్ మారుతుంది. ఇక్క‌డ జ‌రిగే క్ర‌య విక్రయాల‌ను కాంట్రాక్ట్ అంటారు.

— ప్ర‌తి కాంట్రాక్ట్‌కు ఒక ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. సాధార‌ణంగా ప్ర‌తి నెలా ఆఖ‌రి గురువారం కాంట్రాక్ట్‌లు ముగుస్తాయి. ఆ తేదీనాటికి మ‌నం ఫ్యూచ‌ర్ అండ్ ఆప్స‌న్స్‌ను అమ్మేయాల్సి ఉంటుంది. ఈ నెల రోజుల కాంట్రాక్ట్‌లో రెండో రోజే మనం అనుకున్న లాభం వ‌చ్చేస్తే అప్పుడే అమ్మేయ‌వ‌చ్చు. లేదంటే ఉంచుకోవ‌చ్చు.

what is a lot in futures

— ఫ్యూచ‌ర్‌లో ఒక లాట్ లో సుమారు 500 షేర్లు ఉంటాయి. వీటిని కొనాలంటే క‌నీసం 3 నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కూ అవుతుంది. కానీ ఇక్క‌డ ఎక్చేంజీలు ట్రేడ‌ర్ల‌కు మార్జిన్ ఇస్తాయి. అంటే ఓ 20 శాతం డ‌బ్బులు పెడితే మిగిలిన డ‌బ్బుల‌ను ఎక్చేంజీ స‌మ‌కూరుస్తుంది. కాబ‌ట్టి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల షేర్ల‌ను మ‌నం ల‌క్ష రూపాయ‌ల‌కే కొనుక్కోవ‌చ్చు. కానీ ఈక్విటీలో ఇలా కుద‌ర‌దు. మొత్తం డ‌బ్బులు పెడితేనే షేర్ల‌ను కొన‌డం సాధ్య‌మ‌వుతుంది.

— ఫ్యూచ‌ర్‌లో త‌క్కువ డ‌బ్బుల‌తో ఎక్కువ లాభాలు వ‌స్తాయి. అదే విధంగా న‌ష్టాలు కూడా అధికంగా ఉండే అవ‌కాశం ఉంది. కానీ ఈక్విటీలో మాత్రం పూర్తిస్థాయి డ‌బ్బులు పెడితే ఓ మాదిరి లాభాల‌ను తీసుకోవ‌చ్చు. న‌ష్ట‌భ‌యం కూడా ఫ్యూచ‌ర్స్‌తో పోలిస్తే త‌క్క‌వే.

 

Author photo
Publication date:
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *