
మన స్టాక్ మార్కెట్లను గ్లోబల్‌గా ఉండే స్టాక్ మార్కెట్లు ప్రభావితం చేస్తాయి. అందుకే వాటి టైమింగ్స్‌ని మనం తప్పకుండా మనం తెలుసుకోవాలి. అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఏ టైంలో ఏం చేయోలో ఓసారి తెలుసుకుందాం.
సాధారణంగా ఇండియా స్టాక్ మార్కెట్ టైమ్ ను ఇలా వర్గీకరించవచ్చు.
* ఫ్రీ ఓపెన్ మార్కెట్ .. ఉదయం 9- 9.15 నిమిషాల మధ్య ట్రేడ్ అయ్యే వాటిని ఫ్రీ ఓపెన్ మార్కెట్ అంటారు.
తర్వాత వచ్చేది నార్మల్ మార్కెట్. ఇందులో 9.15నిమిషాల నుంచి 3.30 నిమిషాల మధ్యలో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఉదయం 9.గంటలకు కేవలం ఈక్విటీ మర్కెట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. 9గంటల నుంచి 9.08నిమిషాల వరకు ఆర్డర్స్ ఇవ్వవచ్చు లేదా ఆర్డర్స్ కేన్సల్ చేసుకోవచ్చు. కాని 9.08 నిమిషాల తర్వాత ఆర్డర్స్ మార్చుకోడానికి అవ్వదు.
what is preopen market
* మనం ఫ్రీ ఓపెన్ మర్కెట్ లో ట్రేడింగ్ చెయ్యాలనుకుంటే nse india.com వెబ్ సైట్ లోకి వెళ్ళి market data then pre open market క్లిక్ చేస్తే అక్కడ ఈ రోజు ట్రేడర్స్ ఎందులోనికి రెడీ అవుతున్నారో ఆ స్టాక్ లిస్ట్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏ స్టాక్స్ లో అయితే ఎక్కువ వాల్యూమ్ ఉంటుందో వాటిని మనం ఫ్రీ ఓపెన్ మార్కెట్ ట్రేడింగ్ కు తీసుకోవచ్చు. మార్కెట్ 3.00 – 3.30 నిమిషాల మధ్య జరిగే ఏవరేజ్ ప్రైస్ ని క్లోజింగ్ ప్రైస్ అంటారు.
timings of international stock markets
ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇలా..
సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడ్ అవుతున్న దానిని SGX నిప్టీ అంటారు. అక్కడ ఉదయం 6.00 గంటల నుండి అర్ధరాత్రి 11.30 వరకు రెండు సిప్ట్ లుగా ఈ మార్కెట్ పనిచేస్తుంది. అక్కడ కేవలం నిప్టీ ప్యూచర్ కాంట్రాక్ట్, నిప్టీ ఆప్సనల్ కాంట్రాక్ట్ ట్రేడ్ అవుతూ ఉంటాయి.
* ఆసియాలో మొదటి ఓపెన్ అయ్యే మార్కెట్ జపాన్ మార్కెట్. దానిని నిక్కీ అంటారు. ఈ మార్కెట్ ఉదయం 5.30 కి ఓపెన్ అవుతుంది. చివరిగా ఇండియన్ మార్కెట్ 9.15 నిమిషాలకు ఓపెన్ అవుతుంది.
మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత యూరప్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. అమెరికన్ మార్కెట్లు సాయంత్రం 8.00 గంటల నుంచి 2.30 వరకు ఓపెన్ అయి ఉంటాయి.
* బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ చేసే వారికీ ప్రత్యేకంగా విండో ఓపెన్ చేస్తారు. వీళ్ళ మార్కెట్ టైం 8.45 -9.00 గంటల వరకు ఉంటుంది. ఈ టైంలో బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ కి అనుమతి ఇస్తారు.