సంపద సృష్టించాలని, ధనవంతులవాలని అందరికీ ఉంటుంది. కానీ అందరికీ అది సాధ్యమవుతుందా అంటే సమాధానం లేదు. కోరిక అందరికీ ఉన్నా ప్రయత్నం అందరిలోనూ ఉండదు. ప్రతి చిన్న విషయానికీ తలొగ్గితే క్రమశిక్షణ కోల్పోయి ఎప్పటికీ ఆర్థిక స్వాతంత్రం సాధించలేము. అయితే వీటికి ఎన్నో సజీవ ఉదాహరణలు మన చుట్టూ ఉన్నా మనం వాటిని గుర్తించలేము. ఆర్థిక పరమైన విషయాల్లో మనం ఎంత ఖచ్చితంగా ఉంటే అంతగా విజయం సాధిస్తాం. ఈ విషయాన్ని చాలా విశేషంగా వివరించిన పుస్తకం `THE RICHEST MAN IN BABYLON`. George.S. Clason అనే అమెరికన్ రచయిత ఈ పుస్తకాన్ని రచించారు. 1926లో మొదటిసారిగా పబ్లిష్ అయ్యింది. శతాబ్దమవుతున్నా ఈ పుస్తకం ఇప్పటికీ అనుసరణీయమే. ఇందులోని విషయాలన్నీ ఈ జనరేషన్‌కు కూడా చాలా ఉపయోగపడేలా ఉంటాయి. ఇందులో విలువైన ఆర్థిక సలహాలను రచయిత కొన్ని కల్పిత పాత్రల ద్వారా మనకు వివరించారు.
the secrets of rich
ఇవీ ప్రధాన విషయాలు..
THE RICHEST MAN IN BABYLON పుస్తకంలో ఆర్థిక అభివృద్ధికి మనం ఏం చేయాలన్న విషయాలు అనేకం ఉంటాయి. మన ఆదాయంలో ఎంత భాగం సేవింగ్ చేయాలి… ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి.. మన సంపదను ఎలా కాపాడుకోవాలి… బంగారం ప్రాముఖ్యత ఏమిటి వంటి విషయాలను ఈ బుక్ లో చక్కగా వివరించారు. సేవింగ్స్‌కు ఉన్న మార్గాల్లో ఏది మనకు బెస్ట్ అనేది ఎలా తెలుసుకోవాలని తదితర వివరాలన్నీ ఈ బుక్‌లో ఉన్నాయి.
HISTORY OF BABYLON CITY
BABYLON CITY చాలా పురాతనమైనది. ఇది ఇరాక్ లో మూప్రెడ్స్ నది ఒడ్డున ఉండేది. ఒకప్పుడు నదిలో ప్రవహించే నీరు, మట్టి మాత్రమే ఉండేది. అక్కడ ఇంజనీర్స్ ఆ నదిపై ఒక డ్యామ్ నిర్మించి అందులోని నీటిని పొలాల్లోకి మళ్ళించారు. BABYLON CITY ఇప్పుడు లేదు కాని అక్కడ చెప్పుకోడానికి చాలా జ్ఞాన సంపద ఉంది. అప్పటి రాజులు భావితరాలకు మేలు చేయాలని తమ విలువైన ఆర్థిక సలహాలను, సూత్రాలను మట్టిపాత్రలపై రాయించేవారు.
BABYLON CITY లో రథాలు నిర్మించే బన్సీర్ అనే వ్యక్తి ఉండేవారు. అతను ఎప్పటినుంచో అదే వృత్తి మీద బతుకుతున్నారు. బన్సీర్ ఫ్రెండ్ కొబ్బి ఒక మ్యుజీషియన్. ఒక రోజు ఇద్దరు సంపాదన గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ధనవంతులు ఎలా సంపాదిస్తున్నారో తెలిస్తే మనంకూడా వాళ్ళను అనుసరించవచ్చుకదా. వాళ్ళిద్దరూ అర్కడ్ అనే ధనవంతుని దగ్గరకు వెళ్ళి సంపాదించడానికి మార్గాలు తెలుసుకుంటారు.
అర్కడ్ ధనవంతులు అవ్వడానికి 3 విషయాలను తెలియజేస్తారు.
* మనం ఎంత సంపాదించిన మన భవిష్యత్తు కోసం మన సంపాదనలో 10 శాతం సేవ్ చేయాలి.
* ఆర్థిక విషయంలో అనుభవం లేనివారిదగ్గర సలహాలు తీసుకోకూడదు.
* మనం ఆదా చేసే డబ్బు రిటర్న్స్ వచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలి.
ఈ మూడు విషయాలను అనుసరిస్తే మీరు కూడా ధనవంతులు అవుతారు అని అర్కడ్ చెబుతారు.
SECRETS OF WEALTH
* ముందు మనం సంపాదించిన దానిలో 10 శాతం సేవ్ చేయాలి.
* మనం ఆదా చేసిన 10 శాతం ఖర్చు చేయకుండా మిగిలిన ఆదాయంతో ఖర్చుచేసుకోవాలి.
* మనం ఆదాచేసిన డబ్బుతో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయండి. లేదా ఎక్కువ వడ్డీకి అప్పు ఇవ్వండి. మనం అప్పు ఇచ్చే ముందు అతను ఆ అప్పును తిరిగి చెల్లించగలడా లేదా మనం తెలుసుకోవాలి.
* మనకంటూ ఒక సొంత ఇల్లు కలిగి ఉండాలి. లేదంటే అద్దెకు ఉండే బదులు అప్పు చేసి అయినా ఇల్లు ఉంటే అది ఏదో ఒక రోజు మన ఇల్లు అవుతుంది. అప్పు తీరిపోతుంది.
* భవిష్యత్తులో రేటు పెరుగుతుంది అనుకుంటే ల్యాండ్ కాని బిల్డింగ్స్ కాని కొనడం ఉత్తమం.
* చక్రవడ్డీ లభించే స్కీమ్స్ లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
* ఆర్థిక విషయాలపై నిరంతరం మన స్కిల్స్ ని పెంచుకుంటూ ఉండాలి.
OPPORTUNITIES
ఎలాంటి పరిస్థితులోనైనా అవకాశాలను చూడగలిగేవారే అదృష్టవంతులు.
ఎంత చిన్న అవకాశం వచ్చినా మనం ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. అప్పుడే అదృష్టదేవత మనల్ని వరిస్తుంది.
LAWS OF WEALTH
* ఎవరైతే తమ సంపదను ఎక్స్ పర్ట్ సలహా తీసుకోకుండా తెలియని చోటా ఇన్వెస్ట్ చేస్తారో వారి సంపద తరిగిపోతుంది.
* ఎవరైతే తన ఆదాయంలో 10 శాతం సేవ్ చేస్తారో వాళ్ళ దగ్గరకు సంపద వస్తుంది.
*ఎవరైతే తమ సంపదను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ సంపద రెండింతలు అవుతుంది.
* ఎవరైతే అత్యాశకు లోనై మోసగాళ్ళ మాటలు నమ్మి అర్థం లేని స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వారి నుంచి సంపద పారిపోతుంది.
* మనం అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్న వ్యక్తులకు మాత్రమే అప్పు ఇవ్వడం మంచిది. తర్వాత బాధపడే కన్నా ముందే జాగ్రత్త పడటం మేలు.
* మన వద్ద ఎంత డబ్బు ఉన్నా అంతకుమించి దానిని మనం సురక్షితంగా రక్షించుకోవాలి. అలాగే మనకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
* మనం ఎక్కడున్నా కష్టాన్ని నమ్ముకుంటే అదే మనకు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది.