
ప్రపంచంలో ఎనిమిదో వింతగా `కాంపౌండింగ్` ని ఐన్‌స్టీన్ అభివర్ణించారు. అంటే కాంపౌండ్ ఎఫెక్ట్ క్రియేట్ చేసే వైబ్రేషన్ జీవితాన్ని మార్చేస్తుందనడంలో సందేహం లేదు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి కొన్ని పొదుపు సాధనాల్లో అత్యధిక రాబడులు కేవలం కాంపౌండింగ్ వల్లే సాధ్యమవుతాయని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. డబ్బులోనే కాకుండా జీవితంలోనూ సక్సెస్ సాధించడానికి కాంపౌండ్ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుందని వివరించే పుస్తకం THE COMPOUND EFFECT .
what is compound effect
మనం ప్రతిరోజు స్థిరంగా తీసుకునే చిన్న,చిన్న నిర్ణయాలు కాంపౌండ్ అయ్యి మనకు దీర్ఘకాలంలో అతి పెద్ద విజయాన్ని తీసుకురావడాన్నే కాంపౌండ్ ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. అయితే ఆ నిర్ణయాలు తీసుకోవడం, పాటించడం, ఫలితం పొందడం అనేది ఎలా సాధ్యమవుతుందనేది ఈ పుస్తకంలో రచయిత DARREN HARDY చాలా స్పష్టంగా వివరించారు.
THE COMPOUND EFFECT పుస్తకంలో 6 STRATEGIES ని రచయిత ప్రతిపాదించారు. వీటిని అదే ఆర్డర్ లో క్రమం తప్పకుండా పాటిస్తే మన ఆదాయం, సక్సెస్ రెట్టింపు అవుతుంది. ఆ STRATEGIES గురించి ఓసారి తెలుసుకుందాం.
ACTION
డారెన్ సక్సెస్ కి ఒక ఫార్ములా ఇచ్చారు. అది ఏమిటంటే ఒక చిన్న పనిని ప్రతిరోజు స్థిరంగా చేయగలిగితే కొంత కాలం తర్వాత ఆ పనిలో నిపుణులు అవుతారు. అదే విజయ రహస్యం.
నిజమైన విజయం ఎప్పుడూ పగలు, రాత్రి కష్టపడితే వస్తుంది.
CHOICES
మన పుట్టుక, చావు మాత్రం మనం నిర్ణయించలేము. కానీ మిగతా జీవితమంతా మనం తీసుకునే చాయిస్ బట్టి ఉంటుంది. అందుకే మనం చేసే ప్రతి చిన్న పనిని, చాయిస్ ను ట్రాక్ చేస్తూ ఉండాలి.
ట్రాక్ చేయడాన్నే మనం అలవాటు చేసుకుంటే మన జీవితం మారుతుంది.
రాబోయే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నిరంతరం సిద్ధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు స్కిల్స్, నాలెడ్జ్ పెంచుకోవాలి.
HABITS
రిపీటెడ్ గా మనం చేసే పనులే మన అలవాట్లుగా మారుతాయి.
మన అలవాట్లే మన విజయానికి కీలకపాత్ర పోషిస్తాయి. మన అలవాట్లు మన లక్ష్యానికి ఉపయోగపడుతున్నాయా లేదా అని మనం చూసుకోవాలి.
ఎంత కష్టమైనదైనా నిర్విరామంగా సాధన చేస్తే మన లక్ష్యాన్ని సాధించవచ్చు.
మనకు బలమైన కారణం ఉంటే ఎన్ని చెడ్డ అలవాట్ల ఉన్నా మార్చుకోవచ్చు.
మన చెడ్డ అలవాట్లను దూరం చేయడానికి డారెన్ కొన్ని వ్యూహాలను తెలియజేశారు.
* ముందు మన చెడ్డ అలవాట్లను ట్రిగ్గర్ చేసే పరిస్థితిని కనిపెట్టాలి.
* మన చెడు అలవాట్లకు సంబంధించిన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు.
* చెడు అలవాట్ల స్థానంలో మంచి అలవాట్లను ఉంచాలి.
* మన చెడ్డ అలవాట్లను మెల్లగా మానుకోవాలి.
* మనకు ఏ వ్యూహం చేయడానికి వీలుగా ఉంటుందో అదే మనం పాటించాలి.
MOMENTUM
ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారడానికి, అదృష్టవంతులు ఇంక అదృష్టవంతులుగా మారడానికి ఈ మొమెంటమ్ కారణం. సాధించాలనే కసి, ఉత్సాహం వస్తేనే మనం మొదలవగలం. మరి ఆ మొమెంటమ్ ను సాధించాలంటే ఈ రెండు ఉండాలి.
.CONSISTENCY, PERSISTENCY.. అంటే స్థిరత్వం, పట్టుదల. ఈ రెండే కాంపౌండింగ్‌లో ప్రధాన సిద్ధాంతాలు. లక్ష్యాలను ఊహించుకోవడం చేస్తే విజయం ఆసాధ్యమైతే కాదు.
డారెన్, నిద్రపోయే ముందు ఆ రోజు చేయవలిసిన పనులు పూర్తయ్యాయా లేదా అని సమీక్షించుకోవడం.
ఆ రోజు నేర్చుకున్న మంచి విషయాలను గుర్తుచేసుకోవడం, మంచి ఆలోచనలు రావడం కోసం మంచి బుక్ చదవడం వంటివి చేసేవారు.
INFLUENCES
మనం తీసుకునే నిర్ణయాలపై ఇతరుల ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం అనేది మంచిగా ఉండాలి కాని చెడుగా ఉండకూడదు.
మన ఆలోచనలు మంచిగా ఉండాలంటే మన మైండ్ కి మంచి ఇన్ పుట్ ఇవ్వాలి.
అందుకోసమే అనవసర విషయాలను పట్టించుకోకూడదు. అలాగే మన మైండ్ ను పాడుచేసే వార్తలు చదవకూడదు.
దీనికి బదులు బుక్ చదవడం లేదా మోటివేషనల్ వీడియోస్ చూడడం చెయ్యాలి.
మన సక్సెస్ లేదా ఫెయిల్యూర్ మన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం మీద ఉంటుంది.
మనకు సమానమైన పార్టనర్ లేదా మనకు మంచి సలహాలు ఇచ్చే అడ్వైజర్ ను కూడా పెట్టుకోవాలి.
ACCELERATION
చాలామంది విపరీతంగా కష్టపడి మంచి ఫలితం రాకపోయేసరికి ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేస్తారు. ఆ స్టేజ్ దాటాక కూడా కష్టపడేవారే విజేతలు అవుతారు. కానీ నిజమైన ఎదుగుదల దాని తర్వాతే ఉంటుందని గుర్తించుకోవాలి.
* అందరికంటే భిన్నంగా ఉండడానికి ప్రయత్నించాలి.
* మనం పూర్తిచేయవలిసిన టార్గెట్ కంటే ఎక్కువ చేసి చూపించాలి.
* ఎప్పుడూ చేయవలిసిన దానికన్నా ఎక్కువ చేయాలి.
* మన మీద ఇతరులకు ఉన్న నమ్మకాన్ని దాటి ముందుకు వెళ్ళాలి.
* ఇవన్నీ మనం చేయాలంటే కాంపౌండ్ రూల్స్ ను మనం పాటించాలి.