important words in stock market
స్టాక్ మార్కెట్ లో తరుచుగా మనం కొన్ని పదాలు విటుంటాం. వాటిని ఎప్పటికప్పడు తెలుసుకుంటూ వీలైతే వాటన్నింటినీ పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అందులో కొన్ని పదాలను ఇక్కడ తెలుసుకుందాం..
what is volatility in stock market
- వాలటిలిటీ అంటే షేర్ల ధర ఒక్కసారిగా పెరిగిపోవడం కాని తగ్గిపోవడం కాని జరిగితే దానిని వాలటిలిటీ అంటారు.
* what is bid price and ask price
బిడ్ ప్రైస్ అంటే కొనుగోలుదారులు ఏ ప్రైస్ దగ్గర షేర్లను కొంటారో దానిని బిడ్ ప్రైస్ అంటారు. ఆస్క్ ప్రైస్ అంటే సెల్లర్స్ ఏ ప్రైస్ దగ్గర అమ్మడానికి రెడీగా ఉంటారో వాటిని ఆస్క్ ప్రైస్ అంటారు.
మీరు బిడ్ ప్రైస్ ఆస్క్ ప్రైస్ చూడాలనుకుంటే మీ ట్రేడింగ్ అకౌంట్ లో ఏదైనా షేర్ ని ఎంచుకుని మార్కెట్ డెప్త్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు బిడ్ ప్రైస్, ఆస్క్ ప్రైస్ కనిపిస్తాయి.* portfolio
మీకున్న గ్రూప్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎసెట్స్ అన్నింటినీ కలిపి పోర్ట్ ఫోలియో అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు. అలాగే కొంత మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాడు. కొంత బాండ్స్ లో ఇలా రకరకాల మార్గాల్లో ఇన్వెస్ట్ చేశాడు. వీటన్నింటినీ కలిపి అతని పోర్ట్ ఫోలియో అంటారు. ఎవరికి వారు వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోగలరో అనే దాని ఆధారంగా ఏ రంగంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలో చూసుకుంటూ పోర్టఫోలియోని సరిచూసుకుంటూ వస్తారు.* stock symbol
స్టాక్ సింబల్ ని టిక్కర్ సింబల్ అని కూడా అంటారు. స్టాక్ సింబల్ అంటే ఎక్స్చేంజీ లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీకి కూడా ఆ కంపెనీ పేరుకి తగ్గట్టుగా సింబల్ ఇస్తుంటారు. ఒక్కక్కొసారి మీ షేర్ కొనాలనుకుంటే ట్రేడింగ్ అకౌంట్ లో మీ కంపెనీ షేర్ దొరకకపోతే సింబల్ ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది. ఒకవేళా మీరు ఏదైనా కంపెనీ సింబల్ తెలుసుకోనాలంటే bseindia.com, nseindia.com వెబ్ సైట్ లో సెర్చ్ చేస్తే మనకి అక్కడ చూపిస్తుంది.* short selling
సాధారణంగా ఒక షేరు పెరుగుతున్నప్పుడు తక్కువ ధరలో కొని ఎక్కువ ధరలో అమ్మితే మనకి లాభం వస్తుందని తెలుసు. కానీ ఒక షేరు పడిపోతున్నప్పుడు కూడా మనం దాని నుంచి డబ్బులు సంపాదించవచ్చు. దీనిని షార్ట్ సెల్లింగ్ అంటారు.* what is liquidity in stock market
మనం ఏ సమయంలోనైనా ఎంత సులభంగా మనకి కావల్సినన్ని షేర్లను కొనగలుగుతున్నామో, అమ్మగలుగుతున్నామో తెలిపే దానిని లిక్విడిటీ అంటారు. ఎక్కువ క్రయ విక్రయాలు జరిగే స్టాక్‌కు ఎక్కువ లిక్విడిటీ ఉన్నట్టు. లిక్విడిటీ ఉన్న షేర్లను మనం కొనాలనుకున్న లేదా అమ్మాలనుకున్నాఅటువైపు కొనాలనుకున్నావాళ్ళు లేదా అమ్మాలనుకున్నావాళ్ళు మనకి అందుబాటులో ఉంటారు. కాబట్టి సులభంగా షేర్లను కొనడం గానీ అమ్మడం గాని చేయవచ్చు. మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న షేర్లను లిక్విడిటీ ఉన్న షేర్లు అని అంటారు.