stock market is not a gambling

చాలా మంది స్టాక్ మార్కెట్ ని ఒక జూదంలా భావిస్తారు. అది ఒక గేంబ్లింగ్ అని త‌ప్పుడు అవ‌గాహ‌న‌తో దుష్ప్ర‌చారం చేస్తుంటారు. ఎందుకంటే స్టాక్ మ‌ర్కెట్‌పై చాలా మందికి నాలెడ్జ్ ఉండ‌దు. ఉన్న వాళ్ల‌లో అధిక శాతం మంది న‌ష్ట‌పోయిన వారే. ఎందుకంటే వారంతా అవ‌గాహ‌న లేకుండా స్టాక్ మార్కెట్‌లోకి వ‌చ్చి జూదం అనుకుని త‌మ‌ అదృష్టాన్ని ప‌రీక్షించుకుని బొక్క బొర్లా ప‌డిన ఆట‌గాళ్లే. అందుకే ఈ విధమైన త‌ప్పుడు భావం చాలా మంది మెద‌ళ్ల‌లో నాటుకుపోయింది. నిజానికి స్టాక్ మార్కెట్ అనేది గేమ్బ్లింగ్ కాదు అది ఒక బిజినెస్.

how much time needed to become an expert in stock market

మెచ్యూర్డ్ ట్రేడ‌ర్ కావాలంటే నెల‌లు ప‌ట్టొచ్చు..
స్టాక్ మార్కెట్‌లోకి వ‌చ్చిన కొత్త‌లో చాలా మంది దీనిని గేంబ్లింగ్ లానే చేస్తుంటారు. మొద‌ట్లో 90 శాతం మంది ఫాలో అయ్యే విధానాలు ఇలానే ఉంటాయి. మార్కెట్లో ఎలాంటి సిగ్నల్స్ లేకుండానే ట్రేడ్ చేస్తారు. న్యూస్‌, మూమెంట్‌, ప్రైస్ యాక్ష‌న్‌, స్ట్రాట‌జీ.. ఇవేవీ లేకుండా ట్రేడ్ చేసే వాళ్లు గేంబ్ల‌ర్స్ అవుతారు. అందుకే మ‌ర్కెట్‌లోకి వ‌చ్చిన కొత్త‌లో మ‌నం కొన్నాళ్లు మార్కెట్‌ని ఫాలో అవ్వాలి. ఆ త‌ర్వాత కొన్నాళ్లు మార్కెట్ గురించి, ట్రేడింగ్ ప‌ద్ధ‌తులు నేర్చుకోవాలి. ఆ త‌ర్వాత కొన్నాళ్లు త‌క్కువ అమౌంట్‌తో మార్కుట్‌లో ట్రేడ్ ప్రాక్టీస్ చేయాలి. ఆ త‌ర్వాత కొన్నాళ్లు ట్రేడ్ చేస్తూ మ‌న‌కు న‌ప్పే స్ట్రాట‌జీని గుర్తించాలి. అప్ప‌డు మార్కెట్‌లోకి పూర్తిస్థాయిలో రావాలి. దీనికి కొన్ని నెల‌లు ప‌ట్టొచ్చు. లేదా సంవ‌త్స‌రాలు ప‌ట్టొచ్చు. అప్ప‌డు మాత్ర‌మే మ‌నం మెచ్యూర్డ్ ట్రేడ‌ర్ కాగ‌లం.

వీటిని ఫాలో అవ్వండి
* ఎప్పుడైతే సరైన కారణం లేకుండా మార్కెట్ పెరుగుతుంది, లేదా పడుతుంది అని అంచ‌నా వేసి, ట్రేడ్ చేస్తామో ఖచ్చితంగా మనం గేంబ్లింగ్ చేసినట్టే.
* మనం ట్రేడింగ్ చేసే చోట ఒక బోర్డ్ పెట్టుకుని, ఏదైతే టెక్నికల్ ఎనాల‌సిస్ ని ఫాలో అవుతామో, ఆ స్ట్రాట‌జీని మనం బోర్డ్ మీద రాసుకుని ఉంచుకోవాలి.
* ఒక్కోసారి వ‌స్తే రావ‌చ్చు కానీ, చాలామంది గేంబ్లర్స్ ఒకేట్రేడ్ లో మొత్తం డబ్బులు పోగొట్టుకుంటారు.
* మనం స్టాక్ మార్కెట్లో గేంబ్లింగ్ చేయకుండా ఉండాలంటే మనం ఏదైతే స్ట్రాటజీని ఫాలో అవుతున్నామో, ఆ స్ట్రాటజీకి సంబంధించిన వివరాలను బోర్డ్ మీద రాసుకోవాలి. ఆ స్ట్రాట‌జీలో మ‌న‌కు వ‌చ్చిన ఫ‌లితాల‌ను ఒక బుక్‌లో రికార్డ్ చేసుకుంటూ ఉండాలి.
* మన దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంటే మొత్తం ఒకేసారి ట్రేడ్ చేయకూడదు. ఒకవేల మనకి ఆ రోజు ప్రోఫిట్ వస్తే ఆ రోజుకి క్లోజ్ చేసి, వేరే పని చేసుకోవడం మంచిది.
* స్టాక్ మార్కెట్ ప్రారంభంలో ఉన్న ట్రేడర్స్ ఎవరైనా కూడా, ఒక మంచి పనిచేయాలి అంటే వాళ్ళకి టార్గెట్, స్టాప్ లాస్ ఉండాలి.

why  stock market is a business

బిజినెస్ గా ఫీల్ అవ్వండి..
స్టాక్ మార్కెట్ ని మ‌నం ఖ‌చ్చితంగా ఒక బిజినెస్‌లానే భావించాలి. ఏదైనా చిన్న దుకాణం పెడితే, లేదా ఒక షాప్ ని మ‌నం సొంతంగా పెట్టి న‌డుపుతున్న‌ప్ప‌డు మ‌నం ఎలాంటి అవ‌గాహ‌న‌, అంకిత‌భావంతో చేస్తామో స్టాక్ మార్కెట్ లో కూడా మ‌నం అలానే ఉండాలి.
* అంటే ఏదైనా వ‌స్తువు త‌క్కువ ధ‌ర‌లో కొని లాభం క‌లుపుకుని ఎక్కువ ధ‌ర‌కు అమ్మ‌డం. అదే ఏ బిజినెస్‌కైనా ప్రాథ‌మిక సూత్రం. స్టాక్ మార్కెట్‌కైనా ఇదే వ‌ర్తిస్తుంది.
* మనం ఒక బిజినెస్ చేసేటపుడు మనం ఆలోచించాల్సింది లాభం. మనం మంచి స్టాక్స్ ను ఎంచుకుని దానిని మనం ఇప్పుడు కొనడం ద్వారా ఖచ్చితంగా ప్యూచర్ లో ప్రోఫిట్ తోనే అమ్మగలమ‌ని అనుకుంటే అలాంటి కంపెనీల‌ను మాత్ర‌మే మనం బై చేసుకోవాలి.
* డబ్బులన్నీ కూడా ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు. మనం రకారకాల స్టాక్స్ ని హోల్డ్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి స్టాక్స్ ని మనం బై చేసుకుని పెరిగినపుడు అమ్ముకోవాలి.
* కొన్ని సార్లు ఖచ్చితంగా స్టాక్స్ పెరగవు అని తెలిసిన తర్వాత, లాస్ లో అమ్మవలిసి వచ్చినపుడు, అదే లాస్ ని మనం మంచి స్టాక్స్ లో రికవరీ చేసుకోవచ్చు.
* స్టాక్ మర్కెట్ లో మనం ఒక ప్రొడక్ట్ ని బై చేయాలి. అది ప్యూచర్ లో ఎక్కువ ధరకి అమ్మాలి అనుకున్నపుడు దానికి సంబంధించి టెక్నికల్ ఎనాల‌సిస్ అనేది మనకి తెలియాలి. టెక్నికల్ ఎనాల‌సిస్ కోసం ప్రైజ్ యాక్షన్ సిగ్నల్స్ కానీ, రకారకాల స్ట్రాటజీ గురించి నేర్చుకోవాలి.
* చాలామంది ఇంట్రాడే ట్రేడింగ్ లో నష్టపోవడానికి కారణం ఏమిటంటే టైమ్ వాళ్ళ చేతిలో లేకపోవడం. టైమ్ మన చేతిలో ఉంటే మనం హోల్డ్ చేసుకున్న, ఈక్విటీ లేదా స్టాక్స్ మనల్ని ఖచ్చితంగా రిచ్ ట్రేడర్స్ ని చేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *