మాన‌వ ప్ర‌యాణం ఎప్పుడూ త‌న వంశాభివృద్ధి కోస‌మే సాగుతుంది. త‌న జీవిత‌మంతా పిల్ల‌ల‌కోస‌మే బ‌తుకుతాడు. త‌న సంతానాన్ని వృద్ధిలోకి తీసుకురావాల‌ని, వారిని ప్ర‌యోజ‌కుల‌ను చేయాల‌ని, వారికి వీలైనంత ఎక్కువ స‌దుపాయాల‌ని, సౌక‌ర్యాల‌ని క‌ల్పించాల‌ని త‌పిస్తుంటాడు. ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టి వాళ్ళ కోసమే బ‌తుకుతారు. ఆర్థ‌క‌ స్థితిమంతుల‌కైతే ఎలాంటి ఇబ్బందీ లేదు.. మ‌రి మామూలు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాళ్లు మాత్రం పిల్ల‌ల కోసం నిత్యం జాగ్రత్త తీసుకోవాల్సిందే. పొదుపు ప‌థకాల‌ను ఆశ్ర‌యించి క్ర‌మంగా వాళ్ల‌కోసం డ‌బ్బుల‌ను దాచుకోవాల్సిందే. ఇలాంటి వాళ్లు త‌ప్ప‌కుండా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాలి.

how to open children savings account

ఈ  రోజుల్లో పిల్లలకు చదువుని ఇవ్వాలన్నా డబ్బుతో కూడుకున్న పనే. పిల్లల  చదువుకి అయ్యే ఖర్చు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. చదువుకోసం కుడా ముందునుంచే క్రమంగా డబ్బులు దాచుకోవడం ఒక మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. పిల్లల కోసం మదుపు చేసేందుకు చాలామంది ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ ఎక్క‌డ, ఎలాంటి చోట డ‌బ్బులు పెట్టాలో చాలా మందికి తెలియ‌దు. మైనర్ల పేరిట పెట్టుబడులు పెట్టాలంటే ఏం చేయాలి..?

పెట్టుబడులు ఎప్పడూ పెద్ద‌ల పేరుమీదే ఉండాలి. కానీ కొంతమంది తమ పిల్లలకు పలు సందర్భాల్లో ఉన్న డ‌బ్బును ఏదో ఒక రూపంలో మదుపు చేయాలని ప్రయత్నిస్తుంటారు. భారతీయ చట్టాల ప్రకారం 18 ఏళ్ళ లోపు ఉన్నవారిని మైనర్లుగా పేర్కొంటారు. పిల్లల పేరిట బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్ తదితర ఖాతాలు ప్రారంభించి, సులభంగా మదుపు చేయడం కుద‌రదు. సంర‌క్ష‌కులు లేదా త‌ల్లిదండ్రులు పిల్ల‌లతో క‌లిసి ఉమ్మ‌డి అకౌంట్ ప్రారంభించాల్సి ఉంటుంది. దీనికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మైనర్ల హక్కులు కాపాడేందుకు వారి పేరుమీద చేసే పెట్టుబడులకు కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు.

what are the children savings plans

మైనర్ పేరిట షేర్లలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. అయితే ఇక్క‌డ లాంగ్ ట‌ర్మ్ ఇన్వెస్ట‌మెంట్ మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. ఇంట్రాడే, ఎఫ్అండ్ఓ, కరెన్సీడెరివేటివ్స్ లాంటివి అనుమతించరు. ఒకసారి మేజర్ అయిన తర్వాత మైనర్ ఖాతా రద్దు చేసి, కొత్త ఖాతా ప్రారంభించాలి. అప్పటివరకూ మైనర్ ఖాతాలో ఉన్న షేర్లు, కొత్తగా ప్రారంభించిన ఖాతాలోకి బదిలీ అవుతాయి. మ్యూచువల్ ఫండ్లలోనూ మైనర్ల పేరిట పెట్టుబడులు పెట్టేవీలుంది. ఇది కాకుండా, మైనర్ల పేరుమీద గోల్డ్ బాండ్స్‌, స్థిరాస్తి, పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన (10ఏళ్ళలోపు బాలికల కోసం) పథకాల్లోనూ మదుపు చేయొచ్చు.

పిల్ల‌ల కోసం చాలా ర‌కాల ప‌థ‌కాలు బ్యాంకులు, ఏఎంసీలు అందిస్తున్నాయి. షేర్ మార్కెట్‌లోనూ పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. పోస్టాఫీసు స్కీములు కూడా ఉన్నాయి. ఎంత డ‌బ్బు, ఎంత‌కాలం పొదుపు చేస్తాం అనే విష‌యాల‌పై మ‌నం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది.
* మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పిల్ల‌ల‌ను ఉద్దేశించి కొన్ని చిల్డ్ర‌న్ ఫండ్స్ ఉంటాయి. వీటిని పిల్ల‌ల‌కు ఉన్న‌త చ‌దువులు లేదా పెళ్లి వ‌య‌సు వ‌చ్చే దాకా పొదుపు చేయాల్సి ఉంటుంది. అయితే వీటికి కొన్ని నిబంధ‌ల‌ను త‌ప్ప‌నిస‌రి.

rules for children savings plans

* పిల్లలు పెట్టుబడి నిర్ణయాలను సొంతంగా తీసుకోలేరు. వారికి అంత అవగాహన‌ ఉండదు. కాబట్టి, ఒక సంరక్షకుడు వారి పెట్టుబడులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. సహజంగా తల్లిదండ్రులు ఈ బాధ్యత నిర్వహిస్తారు. కొన్నిసార్లు న్యాయస్థానాలు ప్రత్యేకంగా పిల్లలకోసం సంరక్షకుడిని నియమించే అవకాశం ఉంది.
* పెట్టుబడులు పెట్టేందుకు పిల్లల పుట్టిన తేది ధ్రువీకరణ తప్పనిసరిగా అవసరం. దీంతోపాటు, సంరక్షకుడికి, పిల్లలకు ఉన్నబంధుత్వాన్ని నిరూపించే పత్రాలూ కావాలి.
* సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి బ్యాంకు ఖాతా వివరాలు, పాన్ అవసరం అవుతాయి. మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి(కేవైసీ) నిబంధనలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
* పెట్టుబడులకు సంబంధించిన చెల్లింపులన్నీ సంరక్షుడిగా ఉన్న వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచే వెళ్తాయి.
* ఆయా పెట్టుబడి పథకాలకు సంబంధించిన యజమాని మాత్రం మైనరే అవుతారు.

• పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత పాన్ తో పాటు, కేవైసీ పత్రాలను సమర్పించాలి.
• పిల్లల సంతకాన్ని బ్యాంకు ద్వారా అటెస్ట్ చేయించాలి. దాన్ని ఖాతాలున్న బ్యాంకులు, డీమ్యాట్ సంస్థల్లో అందించాలి. సంరక్షకుడి సంతకం స్థానంలో దీన్ని వాడతారు.
• అప్పటి వరకూ మైనర్ పేరిట ఉన్న ఖాతాలు.. ఇక నుంచి కొత్త ఖాతాలుగా మారతాయి. మేజర్ అయిన పిల్లలు తమ ఖాతాలు సొంతంగా నిర్వహించుకునేందుకు వీలుంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *