మన దేశ ప్రజల్లో అధిక శాతం మంది కేవలం బ్యాంకు డిపాజిట్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సంప్రదాయ పొదుపు సాధనంగా ముద్ర పడడం, రిస్క్ భయం లేకపోవడం వల్ల ఇంకా ఆసక్తి తగ్గడం లేదు. అధిక రాబడులను ఇచ్చే ఎన్నో పొదుపు సాధనాలు ఉన్నప్పటికీ బ్యాంకులవైపే మొగ్గు చూపడంతో దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ కోల్పోతున్నారు. ఇటీవల జరిగిన అనేక సర్వేల్లో ఇదే విషయం వెల్లడైంది. బ్యాంకు డిపాజిట్లలో 70 శాతం మంది, బంగారంపై 25 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నట్టుగా చెబుతున్నారు. మనకి బ్యాంకులలో ఇన్వెస్ట్ చేస్తే ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసేంత రిటర్న్స్ ఇవ్వవు. కానీ సేప్టీ కోసం ఎక్కువమంది బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
ద్రవ్యోల్బణానికి తగ్గ రిటర్న్ తప్పనిసరి
A return above inflation is essential
మన దేశంలో సగటు ద్రవ్యోల్భణం 6 నుంచి 7 శాతం ఉంది. మనకి సంవత్సరం, సంవత్సరానికి ద్రవ్యోల్భణం పెరుగుతుంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే వచ్చే రిటర్న్స్ మన ఖర్చులకు కూడా సమానంగా సరిపడవు. మన దగ్గర ఇప్పుడు ఉన్న డబ్బులు రాబోయే రోజులకి తగ్గట్టుగా రెట్టింపు చేసుకోలేకపోతే ఆ డబ్బులు కోసం మనం అప్పులు చేయవలిసి వస్తుంది. లేదా రిటర్న్స్ రాక పోగా తిరిగి నష్టపోతాం. అంటే ఒక వస్తువు ధర ఇప్పుడు ఎంత ఉందో, పదేళ్ల తరువాత ఎంత పెరుగుతుందో చూసుకుని, ఆ పెరుగుదలకు సరిపడా నిష్పత్తిలో రాబడి వచ్చేలా మన డబ్బులను పొదుపు చేసుకోవాలి. అలా చేయలేని పక్షంలో తిరిగి నష్టపోతున్నట్టే అర్థం.
ఇండియాలో ఫైనాన్సియల్ హెల్త్ ఎలా ఉంది
How is financial health in India
మన దేశంలో ఒక మామూలు మనిషి ఫైనాన్షియల్ హెల్త్ అంత బాగున్నట్టు లేదు. ఒక ఫైనాన్షియల్ సర్వే ప్రకారం ఒక చిన్న కుటుంబం సగటు ఆదాయం రూ. 23వేలు ఉంటుంది.
* మనదేశంలో 46 శాతం కుటుంబాలు ఆదాయం నెలకి రూ.15 వేలు లోపు ఉంది.
* మొత్తం దేశ జనాభాలో 3 శాతం మాత్రమే లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నారు. ఈ లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నవారిని మనం అధిక ధనవంతులు అని అనవచ్చు.
*మన దేశంలో 3 నుంచి 5 శాతం వరకు ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళ దగ్గరే 60, 70 శాతం ఇండియన్ మనీ ఉండిపోయింది.
*మన దేశంలో 70 శాతం మంది పోస్టాఫీసు లేదా సేవింగ్ బ్యాంకుల్లో పొదుపు చేస్తున్నారు. కొంతమంది ఇన్సురెన్స్ లో చేస్తున్నారు. లేదంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
*ఎక్కువమంది బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి గ్యారంటీ ఉంటుందని భావిస్తున్నారు. మిగిలిన ఇన్వెస్ట్ మెంట్ గురించి ఆలోచించట్లేదు. ఈ సర్వే ప్రకారం 70 శాతంలో 64 శాతం మంది కూడా కేవలం బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని తేలింది.
*19 శాతం మంది ఇన్సురెన్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని బట్టి మనకి అర్ధమైంది ఏమిటంటే
మన దేశంలో 70 శాతం జనాభా వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చెయ్యాలనే ఆలోచన లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు.
* 70 శాతం జానాభాలో 3 శాతం మంది మాత్రమే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ డబ్బులను రెట్టింపు చేసుకుంటున్నారు. అలా ఇన్వెస్ట్ చేసుకున్నవారే లక్షాధికారులు అయ్యే స్టేజీకి వెళ్ళగలిగారనేది సర్వేలో తేలింది.
* మన దేశంలో 22 శాతం జనాభా ఏదో ఒక ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి ముందుకొస్తున్నారు. రియల్ ఎస్టేట్, స్టాక్స్ లోనూ, మ్యూచువల్ ఫండ్స్, యులిప్స్, బాండ్స్, గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇందులో 18 శాతం మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
* ఫిక్స్డ్ డిపాజిట్, పోస్టాఫీసులో ఇన్వెస్ట్ మెంట్ కంటే రియల్ ఎస్టేట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల మంచి రిటర్న్స్ పొందగలుగుతాం అనే విషయంపై కొద్ది మందికి అవగాహన ఉంది.
* స్టాక్స్ లలో 3 శాతం జనాభా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే 6 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యులిప్స్ లో 3 శాతం జనాభా ఇన్వెస్ట్ చేస్తున్నారు.
* స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారిలో సక్సెస్ అయినవారు మాత్రం దాదాపు 0.5 శాతం. మిగిలినవారు లాస్ అవుతున్నారు. దానికి కారణం ఏమిటంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చెయ్యాలంటే స్టాక్ మార్కెట్ పై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం. వాళ్ళు, వీళ్ళు చెప్పిన మాటలు విని మనం ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే అధిక శాతం మంది మార్కెట్‌కు దూరంగా ఉంటున్నారు. అవగాహనతో వచ్చిన వారంతా లాభాలు పొందుతున్నారు.
* మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వారు దాదాపు 80 శాతం మంది మంచి రిటర్న్స్ పొందుతున్నారు. మిగిలిన 20 శాతం ఎక్కువ రిటర్న్స్ రావాలని ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు. ఆ రిస్క్ లతో డబ్బులను పోగొట్టుకుంటున్నారు.
ఖర్చుల విషయానికి వస్తే..
ఒక కుటుంబం అతి తక్కువలో ఖర్చు చేసినా రూ.14 వేలు వరకు ఖర్చు అవుతుంది. మధ్యతరగతి వాళ్ళు సగటు ఆదాయం రూ.15 వేలు నుంచి 23 వేలు వరకు ఉంటుంది. కనుక ఖర్చులు పోనూ ఎక్కువ డబ్బులు మిగలక మిగిలిన డబ్బులతో పోస్టాఫీస్ లోనూ లేదా సేవింగ్ అకౌంట్స్ లో డబ్బులను ఉంచేస్తున్నారు. అందువల్ల వారు అధిక రాబడి పొందలేక మరింత పేదవారిగా తయారవుతున్నారు. ఏ పెట్టుబడికైనా అధిక మొత్తంలో డబ్బులు కావాలనే భావన, భయంతో చాలా మంది లాభదాయకమైన మంచి పథకాలవైపు మళ్లడం లేదు.