when will rbi monitory polacy commite meeting

ఆర్‌బీఐ మోనిట‌రీ పాల‌సీ క‌మిటీ మీటింగ్ ప్ర‌స్తుతం జ‌ర‌గ‌నుంది. రెండు నెల‌ల‌కోసారి జ‌రిగే ఈ మీటింగ్‌లో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు బ‌లాన్ని చేకూర్చే నిర్ణ‌యాలు తీసుకుంటారు. క‌రోనాతో… ఇప్ప‌డు ఒమైక్రాన్‌తో చితికిపోయిన ఎకాన‌మీని గాడిన పెట్టేందుకు ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు.  క‌రోనాతో ప్ర‌ధానంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగింది. అగ్రరాజ్యంలో కూడా ద్రవ్యోల్బణం బాగా పెర‌గ‌డంతో అక్కడ వ‌డ్డీ రేట్ల పెంపు అనివార్యమైంది. మ‌రి కొన్ని దేశాలు క‌రోనా కార‌ణంగా రేట్ల‌ను పెంచాయి. ఈ క్ర‌మంలో ఇండియాలో కూడా రేట్లు పెంచుతారా అని చూస్తున్నారు. రెండు సంవత్సరాలుగా రెపో రేటును ఆర్ బీ ఐ 4శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్న విష‌యం తెలిసిందే.

will rbi increase inrest rates 

ఇప్పుడు ఆర్థిక నిపుణులు, పెట్టుబడిదారుల చూపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరపతి విధాన కమిటీ(MPC) సమావేశం పైనే ఉంది. అయితే ఈ నెల 7న ప్రారంభమయ్యే ఈ సమావేశం లతా మంగేష్కర్ మరణంతో వాయిదా పడింది. ఆర్ బీ ఐ ఈ సమావేశం అనంతరం 10న నిర్ణయాలు ప్రకటించనుంది.
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులన్నీ కీలక వడ్డీరేట్లు పెంచే పనిలో ఉన్నాయి. ఇప్పుడు ఆర్ బీ ఐ కూడా అదే బాటలో పయనిస్తుందా లేదా మన దేశ పరిస్థితులకు అనుగుణంగా భిన్నమైన నిర్ణయం తీసుకుంటుందా అన్న‌ది చూడాలి.

all are expecting no change in intrest rates

 కీలక రేట్లను మరి కొన్ని నెలలపాటు యథావిధిగా కొన‌సాగించ‌వచ్చ‌ని ఆర్థిక నిపుణులు అంచ‌నా వే స్తున్నారు. కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒమిక్రాన్ రూపంలో ఇబ్బందులు ఎదురైనా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు దిగజార‌లేదు. ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో ద్రవ్యోల్బణం కాస్త అదుపులోనే ఉందని చెప్పొచ్చు. అదే సమయంలో ముడి చమురు ధరలు పెరుగుతుండడం కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాల కారణంగా రేట్లు పెంచడానికి ఆర్ బీ ఐ కి మరికొంత సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ బ‌డ్జెట్లో ఎటువంటి తాయిలేలు లేక‌పోప‌వ‌డంతో అంద‌రూ నిరుత్సాహంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో వ‌డ్డీరేట్లు పెంచితే స్టాక్ మార్కెట్లు భారీ కుదుపునకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణుల వాద‌న‌. ఈ పరిణామాల కారణంగా ఫిబ్రవరిలో కాకుండా ఏప్రిల్ లేదా జూన్ వరకు ఆర్ బీ ఐ రేట్ల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసే అవకాశం ఉండొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *