
మనం నమ్మిందే చెయ్యగలం. మనసారా అనుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. విజయమైనా.. ఓటమైనా మన చేతిలోనే ఉంటుంది. మనసుకి మనమేదైతే చెప్తామో అదే మన పనిలో, తీరులో కనిపిస్తుంది. బలంగా కోరకుంటే ఏదైనా సాధించగలం అని చెప్పే పుస్తకం సైకో సైబర్‌నేటిక్స్. మన మెదడు, మన ఆలోచనలే మనల్ని నడిపించేవి అని ప్రాక్టికల్‌గా చూపించారు రచయిత.
గెలుపు, నమ్మకం ఈ రెండింటిలో ఏది ముందు అంటే గెలిస్తే మనమీద మనకు నమ్మకం వస్తుందని అనుకుంటాం కాని నమ్మకం ఉంటేనే గెలుపు మనది అవుతుందని ఈ పుస్తకం రచయిత MAXWELL MALTZ సలహా ఇచ్చారు.
MAXWELL 1960లో పబ్లిష్ చేసిన ఈ పుస్తకం ఎంతో మందిని ఆకర్షించింది. విజయతీరాలను చేరుకోవడానికి దగ్గరి మార్గాన్ని చూపించింది.
ఒక మనిషి సెల్ఫ్ ఇమేజ్ సరిగా లేకపోతే ఆ మనిషి ఎంత కష్టపడిన చివరికి ఫెయిల్ అవుతారు.
సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏమిటీ దానిని ఎలా సెట్ చేసుకోవాలి. అనవసర భయాలు వదిలి విజయం ఎలా సాధించాలి.. వీటన్నింటిని వివరణాత్మకంగా చెప్పారు రచయిత.
what is importance of belief
ముఖ్యమైనది నమ్మకం
సెల్ఫ్ ఇమేజ్ అంటే మన మీద మనకుండే ఒక అభిప్రాయం. ఇది మన సక్సెస్, ఫెయిల్యూర్ని బట్టి గతంలో జరిగిన అనుభవాల బట్టి అన్ కాన్సయస్ గా ఏర్పడుతుంది.
* ప్రతి మనిషి పోజిటివ్ గా ఆలోచిస్తే పనులు జరిగిపోతాయి అనుకుంటారు. కానీ మన ఆలోచన బిలీఫ్ సిస్టమ్ కి వ్యతిరేకంగా ఉంటే ఏ పనీ జరగదు.
* ప్రతి మనిషిలోనూ ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే సబ్ కాన్సియస్ మైండ్. దీనిని రచయిత క్రియేటివ్ మెకానిజం అంటారు.
* సబ్ కాన్సియస్ మైండ్ ని ఆపరేట్ చేసే దానిని సర్వో మెకానిజం అంటారు. దీనినే మనం కాన్సియస్ మైండ్ అంటాం.
* మన జీవితంలో ఆనందంగా ఉండాలంటే పోజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేటివ్ మెకానిజం ను సరిగా ఉపయోగించుకోవాలి అని రచయిత చెబుతున్నారు.
what is subconscious mind
సబ్‌కాన్షియస్ మైండే ఒక మిషన్
మనుషులు బతకడానికి కేవలం ఆహారం వెతుక్కోవడమే కాదు. వారి లక్ష్యాలను సెట్ చేసుకోగలరు. తమ సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకగలరు. తమ సబ్ కాన్సియస్ ఉపయోగించి వారి సమస్యలకు పరి ష్కార మార్గాలు కనుక్కోగలరు. తమ సబ్ కాన్సియస్ మైండ్ ఉపయోగించి విజయం సాధించగలరు.
మనిషి మిషన్ కాదు. మనిషి వద్దే మిషన్ ఉంది. అదే మన సబ్ కాన్సియస్ మైండ్.
ఒక గోల్ ని మన మైండ్ లో సెట్ చేస్తే నెర్వెస్ సిస్టమ్ దానిని గైడ్ చేస్తుంది.
మనం అనుకున్న పని అవుతుందా లేదా అని ఆందోళన చెందకూడదు.
మన మైండ్ లో చివరిగా రిజల్ట్ పెట్టుకుని పనిచేయండి.
ఇమేజినేషన్ ద్వారా పోజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ని క్రియేట్ చేయండి.
టెంపరరీ ఫెయిల్యూర్స్ కి , తప్పులకి భయపడకూడదు.
మనం సక్సెస్ అయినట్టు భావించి పనిచెయ్యాలి.
ఊహ..
ఇమేజినేషన్ మన సెల్ఫ్ ఇమేజ్ ను మార్చుకోవడంలో, సక్సెస్ లో చాలా కీలకపాత్ర వహిస్తుంది.
మన ఇమేజినేషన్ బట్టి మన ప్రవర్తన ఉంటుంది.
ప్రతి రోజూ 30 నిమిషాలు మనం ఇమేజినేషన్ కి కేటాయించాలి. ఆ ఇమేజినేషన్ చాలా క్లియర్ గా ఉండాలి. చిన్నచిన్న శబ్దాలు, వస్తువులు కూడా మనం ఇమేజినేషన్ చెయ్యాలి. అలా చెయ్యగా కొంత కాలానికి సబ్ కన్సియస్ మైండ్ అది నిజమని ఒప్పుకుంటుంది.
de hypnotize your self
డీ హిప్నటైజేషన్..
ప్రతి మనిషి కూడా కొంతవరకు హిప్నాటైజ్ అయి ఉంటాడు. మన మీద మనకున్న నెగిటివ్ బిలీఫ్స్ మన ప్రవర్తన పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మన మీద మనకున్న నెగిటివ్ ఆలోచనలను పాజిటివ్ గా మార్చుకోవాలి. అది కేవలం ఇమేజినేషన్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.
ఇమేజిన్ చేసే సమయంలో మన శరీరం పూర్తిగా రిలాక్స్ మూడ్ కి తీసుకురావాలి. దీనినే డీ హిప్నోటైజేషన్ అంటారు. 95 శాతం మంది ప్రజలు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు.
మనం ఎవరికంటే తక్కువ కాదు. అలాగని ఎవరి కంటే ఎక్కువ కాదు. మనం మనమే. మనకి మనమే పోటీ. మనకి ఎవరూ లేరు సాటి. మనం యూనిక్ అని గుర్తించుకోవాలి.
* చాలామంది గతంలో ఒక పనిని చేసి విఫలమైనపుడు, మళ్లీ ఆ పని చేయవలిసి వస్తే నా వళ్ళ కాదు అని చేతులెత్తేస్తారు. ఎప్పుడో జరిగిన తప్పుకు మనం చేతకాని వాళ్ళలా మిగిలిపోకూడదు.
మనం ఆ పని ఎందుకు చెయ్యలేం. అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.?
రిలాక్స్..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. ఒత్తిడి వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. మన సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో క్రియేటివ్ బ్రెయిన్ ఏక్టివ్గా పనిచెయ్యాలంటే కొన్ని సూత్రాలను పాటించాలి.
* మనం ఏదైనా పనిలోకి దిగే ముందు వర్రీ అవ్వాలి. కాని పనిలోకి దిగాక రిలాక్స్ అవ్వండి.
ప్రస్తుతంలో ఉండండి. ప్యూచర్ ని ప్లాన్ చేసుకోండి. కాని ప్యూచర్ లో ఎలా రియాక్ట్ అవుతామో దాని గురించి బెంగపడవద్దు.
* ఒక్కసారి ఒక్క పనిని మాత్రమే చెయ్యండి. మల్టీ టాస్కింగ్ మంచిదికాదు.
* మన సబ్ కాన్సియస్ మైండ్ నిద్రలో చాలా బాగా పనిచేస్తుంది. మన సమస్యకు పరి ష్కారం దొరకకపోతే ఒక్క కునుకు తీయండి. అప్పుడు సబ్ కాన్సియస్ మైండ్ మనకి కావాల్సిన జవాబును ఇస్తుంది.
* ఎల్లప్పుడూ రిలాక్స్ గా ఉండండి. మనం రిలాక్స్ గా ఉంటే మన సబ్ కాన్సియస్ మైండ్ చురుకుగా పనిచేస్తుంది.
సంతోషం..
మనం ఆరోగ్యంగా ఉంటే హ్యాపీగా ఉంటాం. లైఫ్ లో సెటిల్ అయ్యాక హ్యాపీగా ఉంటాం అనుకుంటాం. కాని అలా జరుగుతుందని చెప్పలేం. సెటిల్‌మెంట్ ఆనందాన్ని ఇవ్వదు. దానిని మనం నిత్యం ప్రాక్టీస్ చేస్తుండాలి. హ్యాపీగా ఉండడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి. చివరిగా పరిస్థితులు మారే వరకు మన హ్యాపీనెస్ ను వాయిదా వేయకూడదు.
విజయానికి కావాల్సినవివే..
* మనం సక్సెస్ అవ్వాలంటే ఒక గోల్ లేదా ఒక మర్గాన్ని ఎంచుకుని ముందుకు సాగాలి.
* ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాలు తెలుసుకుని రెస్పాండ్ అవ్వాలి.
* గోల్ ఉంటే సరిపోదు.. దానికి తగ్గ పని చేయగల సత్తా కూడా ఉండాలి. తప్పులు చేసినపుడు వాటి నుంచి నేర్చుకోవాలి. అప్పుడే మన డ్రీమ్స్ రియాల్టీగా మారుతాయి.
* ఏ వ్యక్తినీ చిన్న చూపు చూడకూడదు. ప్రతి ఒక్కరికీ విలువనివ్వాలి.
* మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఇతరులను ఎలాగైతే అప్రిసియేట్ చేస్తామో అదే విధంగా మనల్ని కూడా అప్రిసియేట్ చేసుకోవాలి.
* సెల్ఫ్ కాన్పిడెన్స్‌ని దెబ్బతీయకూడదు. గతంలో మనం సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి.
మనం ఎలాంటి ఆకారంలో ఉన్నా ముందు మనల్ని మనం ఒప్పుకుంటేనే సమాజం ఒప్పుకుంటుంది.
ఇలా ఈ పుస్తకంలో ప్రతి పేజీ మనల్ని ఉద్రేక పరుస్తుందనడంలో సందేహం లేదు. అంతిమంగా విజయం సాధించడానికి మనం చేయాల్సిన కృషిని రచయిత మనకు గుర్తుచేస్తుంటారు.