
పెట్టుబడులు పెట్టేందుకు.. స్థిరమైన రాబడులు పొందేందుకు అత్యుత్తమ మార్గం పోస్టాఫీస్ సేవింగ్స్. వాటిల్లో రిస్క్ తక్కువగా ఉంటుంది. మీ పొదుపులను సురక్షితంగా ఉంచుకోవడానికి పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఉత్తమ ఎంపిక. ఇందులో స్థిరమైన వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. అవసరాలు, వయసును బట్టి వివిధ వర్గాల వారు పథకాలు ఎంచుకోవచ్చు. పోస్ట్ ఆఫీసుల్లో బెస్ట్ సేవింగ్ స్కీమ్‌లు ఏమున్నాయో తెలుసుకుందాం..
కొన్ని పథకాలు ఇలా..
Some Popular Schemes
మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం పోస్టాఫీస్ కొన్ని పథకాలను రూపొందించింది. వాటిల్లో ముఖ్యమైనది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (SB). ఆ తర్వాత నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా (RD), నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా (TD), జాతీయ పొదుపు నెలవారీ ఆదాయ ఖాతా (MIS), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా (SCSS), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (PPF), సుకన్య సమృద్ధి యోజన ఖాతా (SSA), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (NSC), కిసాన్ వికాస్ పత్ర (KVP), పిల్లల కోసం PM కేర్స్ (2021) తదితర సేవింగ్స్ పథకాలు ఉన్నాయి.పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా
Post Office Savings Account (SB)
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా అనేది పొదుపు ఖాతా పథకం. దీని ద్వారా కనీస డిపాజిట్ రూ.500 నుంచి కనిష్టంగా రూ.50 వరకూ డిపాజిట్ చేయొచ్చు. 4 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. ఈ సేవింగ్స్ ఖాతాను పెద్దలు, మైనర్లు తెరవవచ్చు. గరిష్ట పెట్టుబడి రూ.10,000 వరకు ఉంటుంది. ఎటువంటి పన్ను మినహాయింపు ఉండదు.నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా
National Savings Recurring Deposit (RD)
ఇందులో కనీస నెలవారీ డిపాజిట్ రూ.100గా ఉంటుంది. వార్షిక వడ్డీ రేటు 5.8 శాతంగా ఉంటుంది. సామాన్య , మధ్యతరగతి వర్గీయులు ఇందులో సేవింగ్స్ చేసుకోవచ్చు. దీని మెచ్యూరిటీ కాలం ఐదేళ్ళు. ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చేయాలి.నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా
National Savings Time Deposit Account (TD)
ఇందులో గరిష్ట పెట్టుబడి పరిమితులు లేవు. ఈ పథకంలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. ఐదు సంవత్సరాల కాలానికి 6.7శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఏడాది, రెండేళ్ళు, ఐదేళ్ళ కాల పరిమితితో ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల డిపాజిట్‌పై పన్ను మినహాయింపు ఉంటుంది.జాతీయ పొదుపు నెలవారీ ఆదాయ ఖాతా
National Savings Monthly Income Account (MIS)
ఈ పథకం ద్వారా 6.6శాతం వడ్డీ రేటును పొందొచ్చు. ఇది అతి చిన్న పెట్టుబడి పథకం. కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.4.5 లక్షలు, ఉమ్మడిగా రూ.9 లక్షల వరకూ డిపాజిట్ చేయొచ్చు. దీని మెచ్యూరిటీ కాలం ఐదేళ్ళు.సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా
Senior Citizens Savings Scheme (SCSS) Account
ఈ సేవింగ్స్ స్కీమ్ ఖాతా ను 60 ఏళ్లు పైబడిన ఎవరైనా తెరవవచ్చు. దీని మెచ్యూరిటీ కాలం 5 ఏళ్ళు. రూ.1000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకూ పెట్టుబడి పెటొచ్చు. 7.4శాతం వడ్డీ రేటు పొందొచ్చు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సైనికులు ఈ పథకానికి అనర్హులు.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా
Public Provident Fund (PPF) Account
ఈ పథకం కింద రూ.500 డిపాజిట్‌తో ఖాతాను తెరవవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్ళు. ఇందులో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరానికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల డిపాజిట్ ఉంటుంది. PPF ఖాతా కింద 7.1శాతం వడ్డీ రేటు పొందొచ్చు. ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది.సుకన్య సమృద్ధి ఖాతా
Sukanya Samriddhi Account (SSA)
ఇది ఆడపిల్లల కోసం ఏర్పాటైన పథకం. ఈ పథకం కింద 7.6 శాతం వడ్డీ రేటు అందిస్తారు. కనిష్టంగా రూ. 250 నుంచి ఒక ఆర్థిక సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. పిల్లలకు 15 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు పెట్టాలి. దీని మెచ్యూరిటీ కాలం 21 ఏళ్ళు. పన్ను మినహాయింపు లభిస్తుంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు
National Savings Certificates (NSC)
ఇందులో కనీస పెట్టుబడి రూ.100గా ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు. ప్రస్తుత వడ్డీ రేటు 6.8శాతంగా ఉంది. ఇందులో ఎంత మొత్తాన్ని అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు.కిసాన్ వికాస్ పత్ర
Kisan Vikas Patra (KVP)
ఈ పథకం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఇందులో ఖాతాదారులకు సర్టిఫికెట్ అందిస్తారు. వడ్డీ రేటు 6.9 శాతం వడ్డీరేటు పొందొచ్చు.పిల్లల కోసం PM కేర్స్ పథకం
PM CARES for Children Scheme
కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ స్కీమ్‌ను’ ప్రవేశపెట్టింది. ఇందులో పిల్లల పేరు మీద ఖాతా తెరవాలి. ప్రతి నెలా పీఎం కేర్ ఫండ్ నుంచి స్టైఫండ్ రూపంలో చెల్లిస్తారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా రూ.4 వేలు అందుకుంటారు. ఆ తర్వాత 23 ఏళ్ల కు పెద్దమొత్తంలో పదిలక్షల రూపాయలను పొందుతారు.