
ప్రతి పనికీ పాన్ కార్డు అవసరమే.. మనకు సంబంధించిన అన్ని వివరాలకు పాన్ కార్డు నంబర్ లింక్ అయి ఉండాల్సిందే.. లేకుంటే ఎటువంటి లావాదేవీలు జరగవు. పన్ను చెల్లింపుదారుల వివరాలు, టీడీఎస్, ట్రాన్సాక్షన్ వంటివి పాన్ కార్డుద్వారా ఆదాయపన్ను శాఖ ట్రాక్ చేస్తుంది. ఇది మీ సమాచారాన్ని సులభంగా తిరిగి పొందడానికి, వివిధ పెట్టుబడులు, రుణాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలను గురించి తెలుసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది. మరి పాన్ కార్డులో ఉండే ఆ అంకెలు, అక్షరాల అర్థం ఏమిటో ఓ సారి తెలుసుకుందాం.
what is the information in pan card
PAN లేదా పాన్ కార్డ్ పూర్తిపేరు పర్మినెంట్ అకౌంట్ నెంబర్. ఇందులో పది అంకెల నెంబర్ ఉంటుంది. దీనిని ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ప్రతి పాన్ కార్డు ఒక ప్రత్యేక నెంబర్ ను కలిగి ఉంటుంది.
పాన్ నెంబర్ వ్యక్తి ఆర్థిక కార్యకలాపాల రికార్డ్ ను కలిగి ఉంటుంది. అన్ని రకాల చెల్లింపుల్లో అంతర్భాగ మై ఉంటుంది.
* భౌతికంగా ఇది ప్లాస్టిక్ కార్డు. ఇందులో పాన్ కార్డు హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, ఫోటో వంటివి ఉంటాయి. దానిపైన పాన్ నెంబర్ ఉంటుంది.
* అడ్రస్ లేదా జాబ్ ప్రొ ఫై ల్ లో మార్పు వచ్చినప్పటి కి పాన్ నెంబర్ ప్రభావితం కాదు. కాబట్టి ఇది జీవితకాలం పాటు చెల్లుబాటు అవుతుంది. దీనిని గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు.
పాన్ కార్డులో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ హోల్డర్ అనే దాని కింద ఐదు ఇంగ్లీష్ అక్షరాలు, నాలుగు అంకెలు, ఆ తర్వాత మరో ఒక ఇంగ్లీష్ అక్షరం ఉంటుంది. మొత్తం పది అంకెలు/ అక్షరాలు ఉంటాయి. ఉదాహరణకు ABCDE1234E అని ఉంటుంది.
– ఇందులో మొదటి మూడు అక్షరాలు ఆల్బాబెటిక్ సీక్వెల్స్.
– నాలుగో అక్షరం కార్డు హోల్డర్ టైప్ కు సంబంధించింది.
కార్డు హోల్డర్ టైప్ అంటే.. ఉదహరణకు నాలుగో అక్షరం P అని ఉంటే ఇండివిడ్యువల్ అని అర్థం.4th letter of pan card consist of
నాలుగో క్యారెక్టర్ అర్థాలు ఇలా…
A-Association of persons(AOP)
B-Body of Individuals(BOI)
C-Company
F-Firm
G-Government
H-HUF (Hindu Undivided Family)
L-Local Authority
J-Artificial Juridical Person
P-Individual or Person
T-Trust(AOP)– ఇక ఐదో క్యారేక్టర్ సర్ నేమ్ లేదా లాస్ట్ నేమ్ అయి ఉంటుంది. పర్సన్ లేదా ట్రస్ట్ లేదా సొసైటీ లేదా ఎంటీటీ లేదా ఆర్గనైజషన్ పేర్లను సూచిస్తాయి.
ఆ తర్వాత నాలుగు అంకెలు ఉంటాయి.
– చివరి అక్షరం లేదా 10వ అక్షరం ప్రస్తుతం కోడ్ చెల్లుబాటును ధృవీకరించడానికి ఉద్దేశించింది.
types of pan cards
పాన్ కార్డు రకాలు
పాన్ కార్డులో వివిధ రకాలు ఉన్నాయి.
ఆర్గనైజేషన్, కంపెనీలకు పాన్ కార్డు
కో-ఆపరేటివ్ సోసైటీలు, ట్రస్టులకు పాన్ కార్డు
ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్స్ కు పాన్ కార్డు
బిజినెస్ యూనిట్లు, భాగస్వామ్య సంస్థలకు పాన్ కార్డు