
మనం ఉన్న చోటే ఆస్తులు కొనాలంటే చాలా సింపుల్‌గా కొనుక్కోవచ్చు. డబ్బులు ఉంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నచోటే ఆస్తులు, షేర్లు, ఫ్లాట్ లు ఏవైనా సాధ్యమే. కానీ విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు మాత్రం ఇలా చేయడం అంత సులభం కాదు. అక్కడి నుంచి ఇక్కడ ఆస్తులు కొనాలంటే చాలా నిబంధనలు పాటించాలి. కొన్ని రకాల ఆస్తులను కొనడానికి మాత్రమే ప్రవాస భారతీయుడికి అవకాశం ఉంది. మిగిలిన రకాల ఆస్తులను కొనడానికి కొన్ని ప్రత్యేక అనుమతులు తీసుకోవలిసి ఉంటుంది. భారతీయ పాస్ పోర్ట్ కలిగిన ఎన్ఆర్ఐలు ఎవరైనా భారత రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. వ్యవసాయ భూమి, తోటలు, ఫార్మ్ హౌస్ వంటి ఆస్తులను కొనడానికి వీలులేదు.
what are the rules to NRIs to buy assets in india
* ఎన్ఆర్ఐలు మన దేశంలోని నివాస లేదా వాణిజ్య ఆస్తిని కొనడానికి ఆర్బీఐ అనుమతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంట్లో ఇకపై మన దేశంలో నివాస లేదా వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు ఆర్బీఐ నుంచి ఎలాంటి ప్రత్యేక అనుమతిని కోరవలిసిన అవసరం లేదని తెలిపింది.
* మనదేశానికి ఎన్ఆర్ఐలు రాలేకపోయినట్లయితే ఎన్ఆర్ఐ నుంచి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న వ్యక్తి కొనుగోలు సంబంధించిన వ్యవహారాలను చూసుకోవచ్చు.
* ఆర్బీఐ నిబంధనల ప్రకారం భారతదేశంలో ఎలాంటి వ్యవసాయ భూమిని లేదా తోటలను ఎన్ఆర్ఐ లు కొనుగోలు చేయకూడదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఎన్ఆర్ఐ భారతదేశంలోని వ్యవసాయ గృహాలను కూడా కొనకూడదు. ఒక వేళ మన దేశంలో ఎన్ఆర్ఐ లు ఫార్మ్ హౌస్ కొనాలనుకుంటే అతను అనుమతి కోసం ఆర్బీఐ ని సంప్రదించాలి. అప్పుడు దీనిని పరిశీలించి ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది.
* ఎన్ఆర్ఐ మన దేశానికి వచ్చి ఆస్తిని కొనడం లేదా అమ్మడం చేయవచ్చు. ఒక వేళ దేశానికి రాలేని పరిస్థితిలో ఉంటే, ఇక్కడి నమ్మకం కలిగిన వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నినీ అప్పగించి లావాదేవీలను పూర్తిచేసుకోవచ్చు.
NRIs can get housing loans in india
* ఎన్ఆర్ఐలు మన దేశంలో గృహ రుణాలను కూడా పొందవచ్చు. ఎన్ఆర్ఐలు ఏ దేశంలో స్థిరపడ్డారో ఆ దేశం ఆధారంగా రుణం కోసం సమర్పించవలిసిన పత్రాలు మారుతూ ఉంటాయి.
* మన దేశంలో పెట్టుబడిపెట్టాలంటే ఆ వ్యక్తికి మన దేశ పాస్ పోర్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి అనుమతి అవసరం లేదు. ఆర్బీఐ దేశంలో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను ఈ నియమాలను సులభతరం చేసింది.
* మన దేశంలో ఎన్ఆర్ఐ ఎన్ని ఆస్తులైనా కొనవచ్చు. ఎన్ఆర్ఐ భారత సంతతికి చెందిన వ్యక్తి. విదేశీ పెట్టుబడులతో వ్యవసాయ భూములను, తోటలను లేదా ఫార్మ్ హౌస్ లను కొనాలంటే మాత్రం ఎన్ఆర్ఐ కి అవకాశం లేదు. కానీ మన దేశంలో ఇటువంటి ఆస్తులను కేవలం బహుమతిగా పొందవచ్చు.
* ఎన్ఆర్ఐ మన దేశంలో ఏదైనా ఆస్తిపై పెట్టుబడి పెట్టాలంటే , అన్ని లావాదేవీలు భారతీయ కరెన్సీలో, భారతీయ బ్యాంకుల ద్వారా మాత్రమే జరగాలి. అలాగే మన బ్యాంకులో ఖాతా కలిగి ఉండాలి.
* మనం ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, సదరు ఆస్తి వారసత్వంగా లేదా సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లైతే విక్రయదారు నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్తిపై ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా బకాయిలు లేకుండా చూసుకోవాలి.
* మన దేశంలో ఆస్తులు ఉన్నవాళ్ళు తర్వాత ఎన్ఆర్ఐ అయితే తన ఆస్తులను కొనసాగించవచ్చు. అలాగే అతను ఎన్ఆర్ఐ గా మారకముందు తన పేరు మీద ఆస్తులను, ఎన్ఆర్ఐ అయిన తర్వాత కూడా వాటిపై అతని హక్కులు ఉంటాయి. అదే ఎన్ఆర్ఐ అయ్యాక ఆస్తులను కొనడానికి అధికారం ఉండదు. ఎన్ఆర్ఐ లు సంబంధం లేకుండా ఆస్తులను స్వాధీనం చేసుకుంటే వాటికి భారతీయ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
how to NRIs buy and sell properties in india
* ఎన్ఆర్ఐ లు తమ ఆస్తిని మన దేశంలో ఉన్న వ్యక్తికి అమ్మితే చాలా పన్ను ప్రయోజనాలు పొందుతారు. మనం ఆదాయ పన్ను చట్టం 1961, సెక్షన్ 80 సీ కింద రూ.1.50 లక్షల మినహాయింపును పొందవచ్చు. ఆస్తిని కొన్న 3 సంవత్సరాలలోపు అమ్మితే దాన్ని స్వల్ప కాలిక మూలధన ఆదాయంగా పరిగణిస్తారు. ఇలాంటి సమయంలో ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను విధిస్తారు. అదే 3 ఏళ్ళ తర్వాత ఆస్తిని అమ్మితే మనం మరొక ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాల మూలధన లాభాల పన్ను తగ్గించుకోవచ్చు.
* సరైన డాక్యుమెంటేషన్ ఉన్నట్లయితే ఎన్ఆర్ఐ ఆస్తి కొనడానికి సులభంగా నిదులు పొందవచ్చు. మన దేశంలో వివిధ రకాల ఎన్ఆర్ఐ మొత్తం ఆస్తి విలువలో 80శాతం నిధులను బ్యాంకులు రుణ రూపంలో చెల్లించగా, మిగిలిన 20 శాతం నిధులను మీ సొంత వనరుల ద్వారా చెల్లించాలి.