what are the new tax rules from april 1st
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కొత్త లెక్కలు, కొత్త నిబంధనలు మొదలైనవి ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో రిజర్వ్‌బ్యాంకు, సెబీ నిర్ణయించిన కొత్త రూల్స్ కూడా నేటి నుంచే లొక్కలోకి వస్తాయి. ప్రధానంగా పన్ను వసూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్రం ఫిబ్రవరి 1, 2022లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొన్ని నూతన మార్పులు తీసుకువచ్చింది. డిజిటల్, క్రిప్టో ఆస్తులపై ఆదాయపు పన్ను, అప్ డేట్ చేసిన రిటర్న్ ల దాఖలు, ఈపీఎఫ్ వడ్డీపై కొత్త పన్ను నియమాలు, కోవిడ్-19 చికిత్సపై పన్ను ఉపశమనం తదితర వాటిపై ఏప్రిల్ 1, 2022 నుంచి కొన్ని మార్పులు రానున్నాయి.
30 percent tax on cryptos
క్రిప్టో ఆస్తులపై 30 శాతం పన్ను..
భారత్ లో క్రిప్టో కరెన్సీలపై కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను విధానం క్రమంగా అమలులోకి వస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్రిప్టో ఆస్తులపై సుమారు 30 శాతం పన్ను విధించనున్నారు. క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిబంధనలు మరింత కఠినం చేసింది. క్రిప్టో ఆస్తులపై మైనింగ్ చేస్తున్నప్పుడు ఏర్పడే ఖర్చులపై ప్రభుత్వం పన్ను మినహాయింపులు అనుమతించదు. ఉదాహరణకు ఒక వ్యక్తి బిట్ కాయిన్ పై రూ.1000 లాభం, మరోక క్రిప్టోకరెన్సీ ఈథీరియంపై రూ.700 నష్టాన్ని పొందినట్లయితే, సదరు వ్యక్తి రూ.1000పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి ఇతర ఆస్తులలో లాభ, నష్టాలకు వ్యతిరేకంగా క్రిప్టోకరెన్సీపై లాభ, నష్టాలను సెట్ చేయలేరు..
* ఆదాయపు పన్నురిటర్న్ లలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు గాను కొత్త నిబంధన అమలులోకి రానుంది. టాక్స్ పేయర్స్ ఇప్పుడు సంబంధిత అసెసెమెంట్ సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాలలోపు అప్ డేటేడ్ రిటర్న్ ను ఫైల్ చేయవచ్చు.
central board direct taxes
* సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను రూల్-2021 ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ సంవత్సరంలో రూ.2.5 లక్షలు దాటితే పన్ను విధిస్తోంది. దీనికి మించి కంట్రిబ్యూషన్ చేస్తే, వడ్డీ ఆదాయం పై పన్ను పడుతుంది.
* వికలాంగుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వైకల్యం కల్గిన వ్యక్తికి బీమా పథకాన్ని తీసుకోవచ్చు. దీనిపై పన్ను మినహాయింపు ఉంటుంది.
* జూన్ 2021 కేంద్ర ప్రకటన ప్రకారం కొవిడ్ వైద్య చికిత్స కోసం డబ్బు పొందిన వ్యక్తులకు పన్ను మినహాయింపు వస్తుంది. అదేవిధంగా కోవిడ్ కారణంగా ఒక వ్యక్తి మరణించినపుడు కుటుంబ సభ్యులు స్వీకరించే రూ.10 లక్షల డబ్బుపై టాక్స్ మినహాయింపు ఉంటుంది.