how many mutual funds should i invest in
* ఒకే తరహా ఫండ్లు అనేకం వద్దు
మనం ఎక్కువకాలం పెట్టుబడులు పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్ సరైన దారి అని అనుకుంటాం. మన పెట్టుబడి విధానంలో నెలకు కొంత మొత్తాన్ని వీటికి కేటాయిస్తాం. మనం పెట్టుబడి ఎక్కువ పెట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. దీనివల్ల ఎంతోమంది ఎక్కువ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మనం ఎన్ని ఫండ్స్ లో మదుపు చేయాలన్న దానికి ఒక స్థిరమైన సూత్రమేమీ లేకపోయినా.. ఒకే విధంగా ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినపుడు వైవిధ్యం ఇచ్చే ప్రయోజనాలను కోల్పోతాం. అందుకే ఫండ్స్ గురించి సంవత్సరానికొకసారైనా తెలుసుకోవాలి. మన లక్ష్యానికి దూరంగా.. మనం ఎవరో చెప్పారని ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయకూడదు. మనం ఏ ఫండ్స్ లో నైనా ఇన్వెస్ట్ చేసినపుడు దానికి మన ఆర్థిక లక్ష్యాన్ని ముడిపెట్టాలి. మనం ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ లో దాని ద్వారా వచ్చే నష్టాన్ని కూడా భరించే సామర్థ్యం కూడా ఉండాలి. మనం అనుకున్న లక్ష్యం, పెట్టుబడికాలం అన్నింటి గురించి తెలుసుకున్న తర్వాతే దానికి సరిపోయే పథకంలో పెట్టుబడి ప్రారంభించాలి. ఒక వేళ మనకు సరిపోని పథకంలో పెట్టుబడి పెడితే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేయాలి.
never invest in same type of funds
ఒకే తరహా ఫండ్లతో నష్టమే..
ఒకే తరహా, విభాగానికి చెందిన ఫండ్స్ ఉంటే మనకు ఫలితం ఉండదు. కొన్ని ఫండ్స్ లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్లు ఉన్నాయనుకోండి. అప్పుడు ఇతర విభాగాల్లో వచ్చే లాభాలను కోల్పోతాం. అందువలన ఒకే తరహాలో ఉండే ఫండ్స్ ను తగ్గించాలి.ఫండ్స్ పొజిషన్ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి…
పెట్టుబడి పెట్టినపుడు దాని పొజిషన్ బాగా ఉండవచ్చు. కానీ రానున్న రోజుల్లో రాబడి ప్రామాణిక సూచీలతో పోల్చితే తగ్గిపోవచ్చు. అందువల్ల మనం కొంత సమయం ఇవ్వాలి. అప్పటికి ఫండ్స్ తీరు బాగా లేదని తెలిస్తే అందులో పెట్టుబడులు ఆపేయాలి.dont invest in every new fund
ప్రతి కొత్త పథకం లోనూ ఇన్వెస్ట్ చేయవద్దు
కొత్తగా వచ్చిన పథకాలలో ఇన్వెస్ట్ చేయాలని అనుకోవద్దు. వీటి వల్ల ఫండ్స్ సంఖ్య పెరగడం తప్ప లాభాలు ఉండవు. వచ్చిన ఎన్ఎఫ్ఓల్లో మీ దగ్గర లేని పథకం చూసుకోండి. లేకపోతే కొత్త పథకం గురించి ఆలోచించకండి.ఒక పథకంలో పెట్టుబడి పెట్టడం ఆపేసిన తర్వాత వెంటనే అందులో ఉన్న మొత్తాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయవద్దు. క్రమక్రమంగా వెనక్కి తీసుకుంటే మనం అనుకుంటున్న పథకానికి మళ్ళించాలి. ఏడాదిలోపు పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే అమ్మకపు రుసుము ఉండే అవకాశం ఉంటుంది. ఏడాదిలోపు ఈక్విటీ ఫండ్స్ పై వచ్చిన లాభాలపై 15 శాతం పన్ను వర్తిస్తుంది. ఫండ్ల సంఖ్యను తగ్గించాలనుకున్నపుడు ఈ విషయాలు గమనించాలి.