`నీకు ఒక పెద్ద స‌మ‌స్య వ‌చ్చింది. ఇప్ప‌డు నువ్వు ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల‌వు అనుకుందాం, అప్పుడు టెన్ష‌న్ ప‌డ‌న‌క్క‌ర్లేదు. ఒక వేళ నువ్వు ఏం చేసినా ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేవు అనుకుందాం, అప్ప‌డూ టెన్ష‌న్ అవ‌స‌రంలేదు.`

అంటే మొత్తమ్మీద మ‌నం టెన్ష‌న్ ప‌డ‌డం అన‌వ‌స‌రం అనేది ఇక్క‌డ పాయింట్‌. ఇలాంటి ఒక గొప్ప జీవిత స‌త్యం చెప్పింది గురు గోపాల్ దాస్‌. జీవితంలో సంతోషాలు మ‌నం చూసే కోణంలోనే ఉంటాయ‌న్న‌ది నిజం. అదే విష‌యాన్ని వివిధ ఉదాహ‌ర‌ణ‌లతో LIFE’S AMAZING SECRETS అనే పుస్తకంలో ర‌చ‌యిత GAUR GOPAL DAS వివ‌రించారు.

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో స్థిరత్వం పొంద‌డం ఎలా.? జీవిత పరమార్థం ఎలా కనుక్కోవాలి అనే విష‌యాల‌ను తెలిపేది LIFE’S AMAZING SECRETS book. మనం ఒంటరిగా ఉన్నా లేదా బాధ‌లో ఉన్న లేదా జీవితం మీద విరక్తి కలిగిన ఈ పుస్తకం చదవితే మనకి కావలిసిన సమాధానం దొరుకుతుంది. ఆనందానికి, విర‌క్తికి కార‌ణాలు వెతికే క‌న్నా వాటి మూలాల్లోకి వెళ్లి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాటిన్నింటినీ వివ‌రించ‌డంమే ఈ పుస్తకం ప‌ర‌మార్థం.

what the four wheels of car indicates

మన జీవితాన్ని రచయిత కారుతో పోల్చుతారు. కారుకి 4 చక్రాలు ఉన్నట్లే మన జీవితంలో కూడా 4 విషయాలు ఉంటాయి. వాటన్నింటినీ చక్కగా బ్యాలన్స్ చేయగలిగితే జీవితం చక్కగా ముందుకు సాగిపోతుంది.

4 చక్రాలు ఏమిటో వాటి గురించి తెలుసుకుందాం…

WHEEL-1
PERSONAL LIFE…

మన జీవితం అస్తవ్యస్తంగా ఉండి మనం అనుకున్నది జరగకపోతే, మనం ఏమీచేయలేకపోతే ఇక చింతించడం ఎందుకు అని రచయిత మాట. ఇప్పుడు మనకి చెడు జరిగింది అని అనిపించవచ్చు. కానీ ఎవరికి తెలుసు భవిష్యత్తులో అదే మన జీవితాన్ని మారుస్తుందని. మన ఆధీనంలో లేని వాటి గురించి చింతించడం ఆపాలి. మనం ప్రతి సందర్భంలో మంచినే వెతకాలి. మనకి జరిగే ప్రతిదానికీ కృతజ్ఞత భావం చూపించాలి. సమస్య వచ్చినపుడు చింతించడం ఆపాలి.

what should we do in everyday life for happiness

ప్రతి ఒక్కరూ జీవితంలో చేయవలిసిన మూడు పనులు …
-కృతజ్ఞత భావం చూపించడం. ఇది కేవలం ఎమోషన్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ దీనికి సమయం కేటాయించి ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రతి రోజూ మనకి జరిగే 5 మంచి విషయాలను అందులో రాస్తే కృతజ్ఞత భావం ఆటోమేటిక్ గా పెరుగుతుంది.
-ప్రతి రోజూ కేవలం 10 నిమిషాలు ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే మనలో ఆందోళన తగ్గి ఆలోచనా విధానం మారుతుంది.
-సమస్య వచ్చినపుడు ముందు అది మన కంట్రోల్ లో ఉందా లేదా అని ప్రశ్నించుకోవాలి. మన కంట్రోల్ లో ఉన్నా లేకపోయినా ప్రశాంతంగా ఉండాలి.
ఈ మూడు పనులు చేస్తే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆనందంగా ఉంటారు.

WHEEL -2
RELATIONSHIP…

రిలేషన్ షిప్ లో మన వాడే పదజాలం చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సమస్య నీది, ఇది ఒక సమస్య అనడానికి చాలా తేడా ఉంది. ఈ సమస్య నావల్లే వచ్చింది అని అన్నపుడు మనల్ని మనం నిందించుకోవడం మొదలుపెడతాం. ఆత్మ న్యూనతభావానికి లోనవుతాం. ఈ సమస్య మన వ‌లన వచ్చిందని ఇతరులు నిందించినపుడు మనలో కోపం కలుగుతుంది. రిలేషన్ షిప్ కూడా డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండ సమస్యను సమస్యలా చూసినపుడు దాని పరిష్కారం వైపు అడుగులు వేస్తాం. అది రిలేషన్ షిప్ మెరుగు అవడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఇతరులను నిందించేముందు ఒకసారి వారిలో ఉన్న మంచి గుణాలను పరిశీలించాలి.

how many types of people are there

మనుషులు 5 రకాలుగా ఉంటారు
-అన్నింటిలో చెడును చూసేవారు
-మంచినీ చెడును చూసి, చెడు మీద ఫోకస్ చేసేవాళ్ళు
-మంచినీ చెడును రెండింటిని సమానంగా చూసేవారు
-మంచినీ చెడును చూసి కేవలం మంచి మీద ఫోకస్ చేసేవాళ్ళు
– మంచిని మాత్రమే చూసేవాళ్ళు
మ్యూచువల్ ఫండ్స్, రిలేషన్ షిప్ ఒకేలా ఉంటాయి. రెండింటిలో కూడా విత్ డ్రా చేసే ముందు మ‌నం త‌ప్ప‌కుండా ఇన్వెస్ట్ చేసి ఉండాలి.

WHEEL -3
WORK LIFE

మనం ప‌నిచేసే చోట చాలా సమస్యలు ఉంటాయి. చాలా ర‌కాల మ‌నుషులు ఉంటారు. మనం మంచిగా ఉన్నా కూడా ఇతరులు మనకి హాని కలిగించాలని చూస్తారు. ఇక్క‌డ‌ అతి మంచితనం అస్సలు పనికిరాదు. సందర్భాన్ని బట్టి నడుచుకోవాలి. రెండు విషయాల్లో మనం ముక్కుసూటిగా ఉండాలి. ఒకటి పని విషయంలో, రెండొవ‌ది తిండి విషయంలో.
వర్క్ విషయంలో మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి.

సత్ప్రవర్తన పెంచుకోవడానికి మూడు విషయాలు తెలుసుకుందాం.
-విలువల గురించి తెలుసుకోవడం.
-ఆ విలువలను పాటించడం.
-పాటించిన విలువలను నలుగురికి చెప్పి ఇన్ స్పైర్ చెయ్యడం.
అందుకే గొప్పవారు ఆచరిస్తారు. సాధారణ వ్యక్తులు వారిని అనుసరిస్తారు అని అంటారు. చివరిగా మన వర్క్ లైఫ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మనకి ఇష్టమైన పనిని చేస్తే జీవితంలో కష్టపడవలిసిన అవసరం లేదు. అందుకే ప్రతి ఒక్కరూ ఇకిగాయ్ (IKIGAI) ఏంటో తెలుసుకోవాలి.
మ‌న‌కు ఏ పనిలో నైపుణ్యత ఉంది.
సమాజానికి ఉపయోగపడే పని ఏమిటి
మనం ఏ పని చేస్తే డబ్బులు వస్తాయో… ఈ ప్రశ్నలన్నీంటికి సమాధానాలు తెలుసుకోవాలి. అప్పుడే మ‌న ప‌నిలో సంతోషం, ఇష్టం రెండూ ద‌క్కుతాయి.

what is IKIGAI

ikigai is a reason for living. మ‌నం ఎందుకోసం బ‌తుకుతున్నామో, జీవితంలో ఎందుకోసం ప‌నిచేస్తున్నామో తెలుసుకోవ‌డం. దేవుడు మ‌న‌ల్ని ఎందుకోసం పుట్టించాడో.. మ‌నం ఏం సాధించ‌బోతున్నామో అనేదే ఇక్క‌డ కీల‌కం. ఈ purpose అనేది మ‌న‌ల్ని నిరంత‌రం ఉత్సాహంగా ఉంచుతూ, మ‌న ప‌ని వైపు మ‌న‌ల్ని ప్రోత్స‌హిస్తుంది. ప్ర‌తి రోజూ స‌రి కొత్త శ‌క్తిని ఇస్తుంది. దీన్ని గుర్తించ‌నంత కాలం మ‌న జీవితం వ్య‌ర్థ‌మ‌వుతున్న‌ట్టే.

WHEEL -4
SOCIAL CONTRIBUTION

మన జీవితం సెల్ఫిస్‌ నుంచి సెల్ఫ్‌ లెస్ స్టేజ్ కి చేరుకునే ఒక జర్నీలాంటిది. సెల్ఫిస్ అంటే స్వార్థం. సెల్ఫ్ లెస్ అంటే నిస్వార్థం. మ‌నం చేసే ప్ర‌తి ప‌నీ మ‌న కోస‌మే ఉంటుంది. డ‌బ్బు, ప్రేమ‌, ఆస్తులు, ప‌ర‌ప‌తి.. ఇలా అన్నీ స్వార్థం కోస‌మే చేస్తాం. కానీ వీట‌న్నింటి త‌ర్వాత చేయాల్సింది నిస్వార్ధ సేవే.
అప్పుడే జీవితం ప‌రిపూర్ణ‌మ‌వుతుంది. మ‌నం ఎంత బిజీగా ఉన్నా ఇత‌రుల కోసం కొంత స‌మ‌యం కేటాయించ‌గ‌ల‌గ‌డం ముఖ్యం. మ‌న‌కున్న‌దానిలో ఇతరులకి కొంతైనా సేవ చెయ్యాలి. ఇంట్లో వారికి సేవ చేసిన తర్వాత మన సర్కిల్ ని మరింత పెంచాలి. సేవ అనేది డబ్బు సహాయమే కాదు. మాట సహాయం లేదా చేతల ద్వారా సహాయం చెయ్యడం కూడా అవ్వవచ్చు. అప్పుడే మ‌న‌సుకు అంతులేని ఆనందం ద‌క్కుతుంది.

మ‌న‌కు ఎన్నో ఇచ్చిన ఈ స‌మాజానికి కొంత తిరిగి ఇవ్వ‌డం క‌నీస బాధ్య‌త‌. మ‌న జాబ్‌, ఫామిలీ త‌ర్వాత సొసైటీ.. ఇలా వీట‌న్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఇలాంటి విష‌యాలెన్నోఈ పుస్త‌కంలో ర‌చ‌యిత కూలంక‌షంగా వివ‌రించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *