
what is the strategy of warren buffett
ప్రపంచ స్టాక్‌మార్కెట్ చరిత్రలో వారెన్ బఫెట్ ఒక సెన్షేషన్. చాలామంది ఇన్వెస్టర్లకి ఒక ఇన్స్పిరేషన్. వారన్ బఫెట్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారంటే అదే కంపెనీలో షేర్లను కొనేందుకు జనాలు పరుగులు తీస్తారు. అంత నమ్మకం వారన్ బఫెట్ ఇన్వెస్ట్ మెంట్ అంటే. మరి ఆయన ఆ స్థాయిని అంత సులభంగా సాధించారా అంటే కాదు. కొన్ని సిద్ధాంతాలను ఖచ్చితంగా పాటించడం, పని విషయంలో అంత ఏకాగ్రతగా ఉండడంతోనే అది సాధ్యమైంది. సింపుల్ గా చెప్పాలంటే ఆయన జీవితమే ఓ పాఠం. బఫెట్ అనుసరించిన కొన్ని విధానాలు, చెప్పిన కొన్ని పాఠాలు, ఆయన అనుభవాలు మనకు ఎంతో పనికివస్తాయి. వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవితంలో కూడా ఫాలో అవ్వగలిగే విషయాల్లు ఎన్నో ఆయన వివరించారు.
పాఠాలెన్నో.. ఇక్కడ కొన్ని..
* మనం ఎప్పుడైనా కంపెనీలోని ప్రొడక్టును చూసి ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే కంపెనీని కాపాడేది ప్రొడక్టే . ప్రొడక్టు బాగుంటే జనాలు కొంటారు. కన్నిసార్లు మేనేజ్ మెంట్ ఎంత దరిద్రంగా ఉన్నా ప్రొడక్ట్ మాత్రం మార్కెట్‌లో నిలబడిపోతుంది.
no emotions in business
* బిజినెస్ లో ఎమోషన్స్ ఉండకూడదు. ఒకే కంపెనీని ఎక్కువగా నమ్మకుని, దానితో బంధం పెంచుకుని ఇన్వెస్ట్ మెంట్ చెయ్యకూడదు. వాషింగ్టన్ డీసీ విషయంలో బఫెట్ దీనినే పాటించారు.
* ముందు మనం డబ్బులను దాచుకోవాలి. తర్వాత ఖర్చుపెట్టాలి. వీలైనంత వరకూ తక్కవ ఖర్చుతోనే దినచర్య సాగేలా చూడాలి.
* వారన్ బఫెట్ ముందు మనకు వచ్చిన డబ్బులో కొంత సేవ్ చేసి మిగిలిన డబ్బులో నుండి ఖర్చు పెట్టమని అంటున్నారు. అలా చేయడం వలన మనకు తెలియకుండానే చాలా డబ్బులు సేవ్ అవుతాయి.
research before investing
* ఇన్వెస్ట్ మెంట్ ముందు ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చెయ్యాలి. ఒక కంపెనీ గురించి పూర్తిగా అర్థమైన
తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఆ కంపెనీ ప్రొడక్టు గురించి, దానిఉపయోగాలు, ప్రజల్లో దానిపై ఉన్న నమ్మకం ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా రీసెర్చ్ చెయ్యాలి.
* కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం అని చెబుతారు వారన్ బఫెట్. కస్టమర్స్‌తో ఎలా మాట్లాడాలి, మీడియాని ఎలా ఫేస్ చేయాలి అనే విషయాలకు కమ్యూనికేషన్ చాలా అవసరం.
* డబ్బు కంటే కీర్తి గొప్ప. గౌరవాన్ని, నమ్మకాన్ని కాపాడుకునేందుకు మనం చలా కృషి చేయాలి.
* పెద్దవాళ్ళతో స్నేహం అవసరం. అదే మన జీవితానికి కొన్ని అవకాశాలను ఇస్తుంది.
* ముచ్చట్లు తగ్గించు.. అనవసర మాటల వల్ల ప్రయోజనం ఉండదు అనేది బఫెట్ చెప్పే విషయం.
* ఓటమిని ఒప్పుకోకూడదు. ఎప్పుడు గెలుపువైపు ప్రయాణించాలి.