try to invest in new stocks
మనం సాధారణంగా ఒకే స్టాక్స్‌లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తుంటాం. తెలిసిన ఆ కొన్ని స్టాక్స్‌లోనే ట్రేడింగ్ చేస్తుంటాం. దీని వల్ల మార్కెట్‌లో ఉన్న కొన్ని కొత్త స్టాక్స్‌ని, తక్కువ ధరలో ఉన్న గొప్ప స్టాక్స్‌ని మిస్ అవుతుంటాం. అందుకే మన పోర్టిఫోలియోని కొంత కాలం తర్వాత ప్రాఫిట్ తీసుకుని మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడూ ఒకే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయకుండా కొత్త స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
స్టాక్ మార్కెట్లో ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో ఇన్వెస్టర్స్ తక్కువమంది ఉన్నారు. ఇతర దేశాలవారికి చిన్నప్పటినుంచి మార్కెట్ పరంగా మంచి నాలెడ్జ్ ఉంటుంది. మనం ఎక్కువగా ట్రేడింగ్ మీద ఆసక్తి చూపిస్తాం. కానీ వాళ్ళు ఇన్వెస్ట్ మెంట్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
మనం ఏదైనా స్టాక్స్ పెరామీటర్ ద్వారా పెరుగుతున్నపుడు దానిని తీసుకుని అందులో వచ్చిన ప్రాఫిట్ ని మరొక స్టాక్ లో పెడితే అలా మనీ పెరగవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ లో నైనా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఆ స్టాక్స్ తీసేయాలి. అలా తీసేయడం వల్ల ఆ ప్రాఫిట్, మనదగ్గర ఉన్న క్యాపిటల్ ఆ రెండూ కలిపి వేరే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన క్యాపిటల్ గ్రో అవుతుంది.
అండర్ వాల్యూ అయితే లాభాలే..
మనం ఏదైనా స్టాక్స్ కొనాలనుకుంటే మనం స్టాక్స్ కోసం పరిశోధన చేసినపుడు అది అండర్ వాల్యూ స్టాక్ అయితే మనకి తొందరగా లాభాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం అలాంటి స్టాక్స్ ను హోల్డ్ చేసుకుని దాని వాల్యూ పెరిగిన వెంటనే మనం ఆ స్టాక్స్ ని అమ్మేయాలి. మనం మల్టీబేగర్ స్టాక్స్ కంటే ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.
మనం ఫండమెంటల్ గా ఆలోచిస్తే మనకి స్కీనర్ డాట్ కమ్ అనే వెబ్ సైట్ ఉంది. ఆ వెబ్ సైట్ లో మనకి ఉన్న7,000 స్టాక్స్ ఉన్నాయి. ఈ స్టాక్స్ లో మంచి స్టాక్స్ ని ఎలా వెతుక్కుంటామంటే మనం ఏదైతే పెరామీటర్ ఇస్తామో దానికి సరిపోయే స్టాక్స్ ని చూపిస్తుంది.
how to select stocks
స్టాక్ సెలక్షన్ ఇలా..
* ఏ కంపెనీ అయినా వార్షిక టర్నవర్ మినిమమ్ 100 కోట్లకి తక్కువ ఉండకూడదు.
* డెట్ ఈక్విటీ రేషియో 0.5 ఉంటే మంచిది. అసలు అప్పు లేకపోతే ఇంకా మంచిది.
* Roe అనేది 15 కన్నా ఎక్కువ ఉండాలి.
* ప్రమోటర్ హోల్డింగ్స్ అనేవి 50 శాతం కంటే ఎక్కువ ఉండాలి.
* క్యాష్ ప్లో పోజిటివ్ గా ఉండాలి.
* డివిడెండ్ ఇచ్చే కంపెనీలు కూడా అయ్యి ఉండాలి.
* ప్రమోటర్స్ ఎప్పుడూ కూడా షేర్స్ ని ఫ్లెడ్జ్ చేయకూడదు.
* గత 5 సంవత్సరాలుగా కంపెనీ నష్టాలలో ఉండకూడదు.
* కంపెనీ షేర్స్ గ్రోత్ మినిమమ్ 5 శాతం CAGR కలిగి ఉండాలి.
ఈ పాయింట్లన్నీ దృష్టిలో పెట్టుకుని మనం పారామీటర్ ఇచ్చి స్కాన్ చేస్తే కొన్ని స్టాక్స్ వస్తాయి. ఈ స్టాక్స్ ని చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఇలాంటి స్టాక్స్ మార్కెట్ కరెక్షన్ టైంలో కూడా కిందకి పడిపోవు. స్టేబుల్ గా ఉంటాయి.