SBI increases interest rates on loans
ఇప్పటి వరకూ తక్కువ వడ్డీకే దొరికిన రుణాలు ఇక ప్రియం కానున్నాయి. గృహ, వాహన, పర్సనల్ తదితర రుణాలపై వడ్డీ భారం పెరగనుంది. ప్రభుత్వానికి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను (MCLR) సవరించింది. అన్ని కాలపరిమితులపై MCLR ను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. సవరించిన రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ తన వెబ్ సైట్ లో తెలిపింది. దీంతో రుణ భారం ఇక పై పెరగనుంది.
rbi on interest rate
ఆర్బీఐ మార్చనప్పటికీ..
బ్యాంకుల్లో లభించే నిధుల, వాటిని సమీకరించేందుకు అయ్యే ఖర్చులను గణించి, ఆ తర్వాత రుణాలను ఏ వడ్డీరేటుకి ఇవ్వాలన్నది నిర్ణయించేదే MCLR. లోన్ తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళేవారికి ఈ రేటును ప్రామాణికంగా తీసుకుని వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు. గతంలో ఆర్బీఐ రెపో రేటును తగ్గించడంతో ఈ రేట్లు భారీగా తగ్గాయి. సాధారణంగా రెపోరేటును సవరించినపుడు ఈ రేట్లూ మారుతూ ఉంటాయి. ఇటీవల ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ ఎస్బీఐ ఈ రేట్లను పెంచింది. దీని ప్రభావంతో ప్రస్తుతం లోన్స్ తీసుకున్న, భవిష్యత్తులో తీసుకోబోయే రుణ గ్రహీతలకు ఈఎంఐ భారం పెరగనుంది. ఓవర్ నైట్, ఒక నెల, మూడు నెలల MCLR రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు ఎస్బీఐ పెంచింది. దీంతో గతంలో 6.65 శాతంగా ఉన్న ఈ రేటు 6.75 శాతానికి చేరింది. 6 నెలల కాలపరిమితిపై (MCLR 7.05, సంవత్సరం కాలపరిమితిపై 7.10 శాతం, రెండేళ్ళ కాలపరిమితిపై 7.30, 3 ఏళ్ళ కాలపరిమితిపై 7.40 శాతానికి MCLR రేట్లను సవరించినట్లుగా ఎస్బీఐ తెలిపింది. ఇక పై rbi వడ్డీ క్రమంగా పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.