
how to get insurance with mutual funds
అత్యంత లాభదాయక పొదుపు సాధనాల్లో మ్యూచువల్ ఫండ్స్ మొదటి వరుసలో ఉంటాయి. క్రమానుగత పెట్టుబడి చేసే వారికి ఇందులో మంచి రాబడి వస్తుంది. కానీ బీమా కోసం వీరంతా వేరే చోటును ఆశ్రయించాల్సిందే. సరిగ్గా ఇలాంటి అవసరాన్ని గుర్తించి ఫండ్ హౌస్లు పొదుపు + బీమా కలిగి ఉన్న కొత్త పథకాలను తీసుకువస్తున్నాయి. వీటిలో ఎలాంటి ఖర్చు లేకుండా మదుపరులకు జీవిత బీమా రక్షణ అందించనున్నాయి. పొదుపు, బీమా ఒకేసారి లభించే ఈ వెసులుబాటుతో ఈ పథకం మరింత లాభదాయకం.
సిప్ మదుపరులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా జీవిత బీమా పాలసీ రక్షణ ఇక్కడ సాధ్యం.18-51 ఏళ్ళ లోపు ఉన్నవారికి ఈ బీమా అందుతుంది. ఆర్థిక ప్రణాళికలో కీలకమైన పెట్టుబడి, బీమా ఒకే చోట అందుతున్నా.. దీనికి ఉన్న పరిమితులను మనం అర్థం చేసుకోవాలి.
after how many days we get insurance
* పెట్టుబడి ద్వారా బీమా అందుకోవాలంటే సిప్ కనీస వ్యవధి మూడేళ్ళు ఉండాలి. సిప్ ను మధ్యలో రద్దు చేసినా, పెట్టుబడి వెనక్కి తీసుకున్న ఇతర పథకాల్లోకి మారిన ఈ రక్షణ దూరం అవుతుంది. మూడేళ్ళ తర్వాత సిప్ ఆపేసినా గరిష్ఠ వయసు 55-60 ఏళ్ళ నిండేదాకా బీమా వర్తిస్తుంది.
* సిప్ మొత్తంపైనే బీమా విలువ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మొదటి సంవత్సరం సిప్ మొత్తానికి 10 రెట్ల వరకూ ఉంటుంది. రెండో ఏడాదిలో 50 రెట్లకు పెరుగుతుంది. మూడో సంవత్సరంలో 100 రెట్లు అవుతుంది. ఉదాహరణకు మీ సిప్ మొత్తం నెలకు రూ.1,000 అనుకుంటే మొదటి సంవత్సరం రూ.10,000, రెండో సంవత్సరం రూ.50,000, మూడో సంవత్సరం రూ.లక్ష బీమా విలువ ఉంటుంది.
* సంప్రదాయ టర్మ్ పాలసీలకు ఇవి ప్రత్యామ్నాయం కావనే ఇక్కడ గుర్తించుకోవాలి. ముఖ్యంగా అధిక ఆదాయం ఉన్నవారికి ఈ బీమా సరిపోదు.never stop sip before 3 years
* వ్యవధికి ముందే పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే.. ఫండ్ విలువలో 2శాతం వరకూ అమ్మకపు రుసుము విధిస్తారు. ఆ తర్వాత నుంచి బీమా రక్షణ లభించదు. పెట్టుబడిదారులు మరణించిన సందర్బాల్లో నామినీ వ్యవధికి ముందే పెట్టుబడులను వెనక్కి తీసుకున్నా ఈ రుసుములుంటాయి.
* కొన్ని సంస్థలు అందించే ఫండ్ ఆధారిత బీమా పథకాల్లో మదుపరి మరణించినా.. నిర్ణీత వ్యవధి వరకూ పెట్టుబడులు కొనసాగే ఏర్పాటు ఉంటుంది. మిగిలిన సిప్ వాయిదాలను బీమా సంస్థ చెల్లిస్తుంది. నామినీ ఈ స్కీం ను కొనసాగించవచ్చు. లేదా క్లెయిం చేసుకునే వీలుంది.
బెనిఫిట్ ఉంది ఈ స్కీంలో