
కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోమైంది. అర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. భారత్‌లో ఇదే పరిస్థతి. ఇండియా ఎకానమీ పతనావస్థకు చేరుకుందనే చెప్పవచ్చు. కానీ పరస్థతి చేయజారలేదు. ఆశలు సజీవంగానే పోరాటం చేశాయి. యూ టర్న్ తీసుకుంటూ దేశ వృద్ధి మళ్లీ గాడిన పడింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చని భారత్ ఆర్థిక సర్వే తెలిపింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి ఆర్థిక సర్వే ప్రస్తావించింది. 2024-25 నాటికి ఈ లక్ష్యానికి చేరుకోవాలంటే.. పెద్ద ఎత్తున మౌలిక రంగంలో పెట్టుబడులు పెట్టాలని అభిప్రాయపడింది.
* గత సంవత్సరం ఆదాయం పుంజుకుందని ఆర్థిక సర్వే పేర్కొంది. భారీగా ఉన్న విదేశీ మారరక నిల్వలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెరిగిన ఎగుమతులు కారణంగా .. ఆర్థిక వ్యవస్థలోకి నిధులు ప్రవాహం పెరిగిందని తెలిపింది.
when will five trillion target reaches
* మౌలిక రంగంలో 1.4 ట్రిలియన్ డాలర్లను పెట్టుబడి పెడితే 5 ట్రిలియన్ డాలర్లు సుసాధ్యమే.
2008-17 మధ్య కాలంలో మొత్తం 1.1 ట్రిలియన్ల డాలర్లను మౌలిక రంగంలో పెట్టారన్నారు. అయితే, భారి స్థాయిలో పెట్టుబడులు పెట్టడం సవాల్ తో కూడుకున్న వ్యవహారమేనని అభిప్రాయపడింది.
2020-25 ఆర్థిక సంవత్సరాల మధ్య దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల లక్ష్యంతో నేషనల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పైప్ లైన్ కేంద్రం ప్రవేశపెట్టిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది.
which will help to get five trillion revenue
* ప్రైవేటీకరణను వేగవంతానికి ఎయిరిండియా తోడ్పడిందనే చెప్పాలి. వ్యాపారంలో ప్రభుత్వ రంగాన్ని పరిమితం చేస్తూ.. అన్ని రంగాల్లో ప్రైవేటు వ్యక్తుల పాత్రను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఇటీవల కేంద్రం ఎయిరిండియాను రూ.18వేల కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే.
* సెమీ కండక్టర్ల కొరత కారణంగా పలు పరిశ్రమలు మూతపడడమో లేదంటే ఉత్పత్తిని తగ్గించడమో చేశాయని ఆర్థిక సర్వే పేర్కొంది. చిప్ ల కొరత కారణంగా కార్ల తయారీ కంపెనీలు 2021 డిసెంబర్ నాటికి 7 లక్షల కార్లను అందించలేకపోయాయని తెలిపింది. కాగా ప్రభుత్వం సెమీకండక్టర్లు, డిస్ ప్లే తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.76 వేలకోట్లు ఖర్చు చేసేందుకు ముందుకొచ్చిందని పేర్కొంది.
* కరోనా మొదటి, రెండో వేవ్ కారణంగా దేశంలో గృహ విక్రయాలు తగ్గినా వాటి ధరలు మాత్రం ఎక్కడా తగ్గలేదని ఆర్థిక సర్వే పేర్కొంది. గృహ విక్రయాలు కూడా పెరిగాయి. గృహ రుణ వడ్డీ రేట్లు తగ్గడం, కొన్ని రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీని తగ్గించడం ఇందుకు కలిసొచ్చింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనేక కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి.
2021 ఏప్రిల్-నవంబర్ మధ్య 75 కంపెనీలు ఐపీవోకి వచ్చి రూ.89,066 కోట్లు సమీకరించాయి.
టెక్నాలజీ స్టార్టప్ లు ఎక్కువగా మార్కెట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.
* దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగం పుంజుకుందని ఆర్థిక సర్వే తెలిపింది. 2019-20లో ఇది 10,237 కిలోమీటర్ల రహదారులు నిర్మించారు.
* దేశీయ ఫార్మారంగంలోకి ఈ ఏడాది ఒక్కసారిగా విదేశీ పెట్టుబడులు పోటెత్తాయని ఆర్థిక సర్వే పేర్కొంది. ముఖ్యంగా కరోనా సంబంధిత వ్యాక్సిన్లు, ఇతర ఔషదాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో 2021 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రూ.4,413 కోట్లు ఎఫ్ డీఐల రూపంలో ఆర్థిక వ్యవస్థలోకి వచ్చినట్లు తెలిపింది.