హెల్త్ ఇన్సురెన్స్ లో ఈ విష‌యాలే కీల‌కం important things to know in health insurance

మన ఆర్థిక భద్రతకోసం ఏర్పరుచుకునే ఒక ప్రణాళికలో ఒక ముఖ్యమైన స్ట్రాటజీ. మనకీ, ఇన్సురెన్స్ కంపెనీకి మధ్య జరిగే ఒక ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం ఎంతో కొంత డబ్బులు ఇన్సురెన్స్ కంపెనీకి చెల్లించినట్లయితే మనకి ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా, ఏవైనా యాక్సిడెంట్లు జరిగినా, మనం ఎంతైతే డబ్బులు ఖర్చు పెడతామో దానికి త‌గినంత తిరిగి క్లైయిం రూపంలో హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీవాళ్ళు ఇస్తారు. ఇక్క‌డ ఒప్పందం ప్రకారం ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలో టర్మ్ అండ్ కండీషన్స్‌ను పాలసీలో ముందే రాస్తారు.

how to select a insurance policy

హెల్త్ ఇన్సురెన్స్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకి వచ్చే ఆదాయంలో వివిధ రకాల పెట్టుబడులు పెట్టి కొన్ని ప‌థ‌కాల్లో భ‌విష్య‌త్తు కోసం పొదుపు చేస్తాం. ఇలాంటి క్ర‌మంలో ఎప్పుడైతే మనం ఆరోగ్య సమస్యకి గుర‌వుతామో మనం పెట్టే ఫండ్ కంటే ఎక్కువ మోతాదులో చికిత్స కోసం డబ్బులు ఖర్చు అవుతాయి. అప్పుడు మన పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న నిధుల నుంచి మధ్య‌లోనే వెన‌క్కు తీసుకోవాల్సి వ‌స్తుంది. ఇవన్నీ మనం ముందు ఆలోచించుకుని హెల్త్ ఇన్సురెన్స్ చేసుకోవాలి. ఎలాంటి కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకోవాలి..? ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఏ ఏ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలో ఓ సారి చూద్దాం.

ఈ కింది విషయాలను మనం పాలసీలో తప్పకుండా చూసుకోవాలి.
* ఇన్సురెన్స్ పాలసీ నుంచి వచ్చిన డబ్బులను ఎందుకోసం.. ఎవరికోసం వాడుతామో అనే విష‌యంలో క్లారిటీ ఉండాలి. కొన్ని సార్లు మన ఆరోగ్యం కోసం కావచ్చు లేదా మన కుటుంబం కోసం కావచ్చు. ఈ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని పాల‌సీ ఆ మొత్తాన్ని కవర్ చేసుకునేలా పాలసీ తీసుకోవాలి.

* మనం వ్యక్తిగతంగా తీసుకోవాలంటే తక్కువ ప్రీమియం చెల్లించవలిసి ఉంటుంది. అదే కుటుంబ సభ్యులందరికీ అనుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించవలిసి ఉంటుంది. అంతేకాకుండా మన దగ్గర్లో ఉన్న హాస్పిటల్ ని ఎంచుకుని అందులో యావరేజ్ హస్పిటల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాట‌న్నింటి ఆధారంగా ఒక అంచనాను వేయవలిసి ఉంటుంది. మనం మామూలు హాస్పిటల్ కి వెళితే ఖర్చు ఒకలా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఖర్చు ఎక్కువ‌గా ఉంటుంది.

* సగటు మనిషికి రూ.3 లక్షల నుంచి 15 లక్షల వరకు హెల్త్ ఇన్సురెన్స్ కోసం ఖర్చు చేయవలిసి ఉంటుంది. మనం 15 సంవత్సరాల తర్వాత ద్రవ్యోల్బణాన్ని ఇప్పుడే అంచనా వేసి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎంత డబ్బులు వస్తే మ‌నం సేఫ్ గా ఉంటామో ముందే అంచనా వేసుకుని పాల‌సీకోసం వెళ్ళాలి.

what is cashless claim policy

క్యాష్ లెస్ క్లెయిమ్ పాల‌సీ వివ‌రాలు తెలుసుకోండి
క్యాష్ లెస్ క్లెయిమ్ ఇచ్చే పాలసీలో నో క్లెయిమ్ బోనస్ ఉంటుంది. మనం క్లెయిమ్ చేసుకున్నట్టైతే అటువంటి పరిస్థితుల్లో మనకి బోనస్ ప్రకటిస్తారా లేదా అనేది తెలుసుకోవాలి.
ఇక్క‌డ క్యాష్ లెస్ పాల‌సీ అంటే మ‌నం ఏదైనా హాస్పిట‌ల్లో చేరితే ట్రీట్‌మెంట్ కోసం ఎటువంటి మొత్తం చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. హాస్పిటిల్‌కు వెళ్ల‌గానే అక్క‌డి ఇన్సూరెన్స్ డెస్క్ కు మ‌న పాల‌సీ వివ‌రాలు తెలియ‌జేస్తే వాళ్లే మొత్తం చూసుకుంటారు. ఇన్సూరెన్స్ కంపెనీకి, హాస్పిట‌ల్ యాజ‌మాన్యానికి మ‌ధ్య డైరెక్టుగా ట్రాన్జాక్ష‌న్ మొత్తం జ‌రుగుతుంది. పాల‌సీదారుకు ఎటువంటి సంబంధం ఉండ‌దు. ఈ త‌ర‌హా పాల‌సీలు ఇన్సూరెన్స్ కంపెనీకి ఉండే నెట్‌వ‌ర్క్ హాస్పిటల్స్‌లో న‌డుస్తుంది.
మనకి ఆరోగ్య సమస్యలు వస్తే కొన్ని కంపెనీలు యాన్యువల్ హెల్త్ చెకప్ కి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. ఇలాంటి స‌దుపాయాలు ఉన్న పాల‌సీను ప్రిఫ‌ర్ చేయాలి.

* కొన్ని సార్లు మనం అనారోగ్యానికి గురై చికిత్స పొందుతాం. దానికోసం డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత మనం క్లెయిమ్ కోసం సబ్ మిట్ చేస్తాం. ఇక్క‌డ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది మ‌నం తీసుకున్న‌ ఇన్సురెన్స్ పాలసీని బ‌ట్టి అందులో ప్రస్తావించిన సమయానికి వస్తుంది. ఇందులో వెయిటింగ్ పిరియడ్ ఎంత‌కాల‌మో అనేది మనం చాలా క్షుణ్ణంగా చూడాలి.

take at young age

మనం యంగ్ గా ఉన్నప్పుడే పాలసీలను తీసుకున్నట్లయితే ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. త‌ర్వాత వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇందులో క‌వ‌రై పోతాయి. ప్యూచర్లో కొంచెం ఎక్కువ‌గానే ఈ పాల‌సీ నుంచి మ‌నం లాభాలు పొందుతాం.

ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజస్…
మనం పాలసీ తీసుకున్న సమయానికి మ‌నం ఏదైనా అనారోగ్యంతో బాధ‌పడితే అటువంటి వాటికి కొన్ని సార్లు ఇన్సురెన్స్ పాలసీ వాళ్ళు డబ్బులు రీయింబర్స్ చెయ్యరు. అందువల్ల పాలసీ తీసుకున్నప్పుడు ఈ కాజ్ ని కూడా చూసుకోవాలి. పాల‌సీ తీసుకున్న‌ప్పుడే మ‌నకు ఉన్న దీర్ఘ‌కాల రోగాల గురించి, అనారోగ్యాల గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి చెబితే ఆ రోగాల‌కు అనుగుణంగా ప్ర‌త్యేక పాల‌సీల‌ను సూచిస్తారు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజస్ పాలసీలు వేరువేరుగా ఉంటాయి. వీటిని ఎంచుకోవ‌డం ఉత్త‌మం.

మినహాయింపులు…
ఇన్సురెన్సు కంపెనీలు పాల‌సీ మ‌ధ్య‌లో కొన్నింటికి మిన‌హాయింపులు ఇస్తారు. అంటే కొన్ని ర‌కాల ప్రత్యేక చికిత్స‌ల‌కు ఎటువంటి క్లెయిమ్ చెల్లించ‌రు. ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ అయినా వాళ్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరు. ప్రగ్నెంట్ కి సంబంధించి, కాస్మోటిక్ సర్జరీకి గానీ, స్పెష‌ల్ థెర‌పీల‌కు గానీ ఇటువంటి వాటిలో ఏ రోగానికి కూడా ఇన్సూరెన్స్ వ‌ర్తించ‌దు. వాటికి మినహాయింపులు ఇస్తారు. అందువల్ల మనం జాగ్రత్తగా చదివి పాల‌సీలు తీసుకోవలిసి ఉంటుంది. మినహాయింపులు అనేవి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. మినహాయింపుల‌ను బ‌ట్టే ప్రీమియం చెల్లిపుల‌ను కూడా ఆలోచించుకోవాలి.

what is co pay clause

కో పే క్లాజ్…
కో పే క్లాజ్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీతో పాటు మనం కూడా ఎంతో కొంత చికిత్స కోసం డబ్బులను ఖర్చు చేయవలిసి రావ‌డం. మ‌నం ఎంచుకున్న చికిత్స‌లో స‌గం వ‌ర‌కూ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని మ‌న‌మే చెల్లించుకోవాలి. ఇలాంటి విధానం వ‌ల్ల మ‌న‌కు పూర్తిస్థాయి ఉప‌యోగం క‌ల‌గ‌దు. అందుకే ఇటువంటి కో పే క్లాజ్ లేని పాలసీని ఎంచుకోవడం సరైన విషయం.
మన తల్లిదండ్రులకి వయసు పైబడి ఉంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. అటువంటి వాళ్ళకి హెల్త్ పాలసీలు దొరకడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో మనం కో పే క్లాజ్ కి ఒప్పుకున్నట్లయితే ఎంతో కొంత ఇన్సురెన్స్ కంపెనీ వాళ్ళు సహాయం చేస్తారు కాబ‌ట్టి మ‌న‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

what are the limits and sub limits of insurance polacy

లిమిట్స్ అండ్ సబ్ లిమిట్స్…
కొన్ని ఇన్సురెన్స్ కంపెనీలు మనక‌య్యే ఖర్చు మొత్తం ఇవ్వకుండా కొంతవరకే ఇన్సురెన్స్ ఇస్తాం అని అంటాయి. కానీ మనకి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ చికిత్స సగం వరకూ కూడా సరిపోదు. అందువల్ల పాలసీ తీసుకున్నపుడు అలాంటి విషయాలన్నింటి గురించి ముందే తెలుసుకోవాలి. దేని కోసం ఎంత మొత్తం ఇస్తాయో, ఇన్సూరెన్స్‌లో ఏ ఏ విష‌యాలు క‌వ‌ర్ అవుతున్నాయో అవ‌గాహ‌న క‌లిగిఉండాలి.
మనం పెట్టే ఖర్చులో రూమ్ రెంట్ కి ఎంతో కొంత శాతం రియంబర్స్ చేస్తాం అని ఉంటుంది. అది ఎంత శాతమో.. ఎలాంటి రూమ్‌ల‌కు రీయంబ‌ర్స్ చేస్తారో తెలుసుకోవాలి. మనం పాలసీ తీసుకున్నప్పుడే ఇలాంటి కండిష‌న్స్ అన్నింటినీ ముందే మనం చూసుకోవలిసి ఉంటుంది. ఎలాంటి సబ్ లిమిట్స్, లిమిట్స్ లేనివి తీసుకోవడమే మంచిది. అన్ని వెసులుబాట్లు ఉండే పాల‌సీలకే ప్రాధాన్యం ఇవ్వాలి.

what is claim settlement ratio

క్లెయిమ్ హిస్టరీ లేదా క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో …
ప్రతి ఇన్సురెన్స్ కంపెనీ ఎన్ని సెటిల్ మెంట్లు చేస్తుందో, అంటే త‌మ పాల‌సీదారుల్లో ఎంత‌మందికి అవ‌స‌ర‌మైన స‌మ‌యానికి క్లైమ్ చెల్లిస్తుందో దానినే ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో అంటారు. ఈ రేషియో ఆధారంగా మనం ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోవాలి. మనం లైఫ్ ఇన్సురెన్స్ లో కూడా సెటిల్ మెంట్ రేషియోని చూడాలి. ఇక్క‌డ‌ ఎంతమంది క్లెయిమ్ చేస్తే ఎంతమందికి సెటిల్ మెంట్ చేశారు అని అర్థం. అంటే 10వేలు మంది క్లెయిమ్ సబ్ మిట్ చేస్తే అందులో ఎంతమంది ఇబ్బందులు ఎదుర్కున్నారు అనేది ప‌రిశీలించాల్సి ఉంటుంది. 30 కంటే తక్కువ కంప్లైంట్ లు ఉంటే ఆ కంపెనీ కొంచెం రీజనబుల్ గా ప‌ని చేస్తుంది అని అర్థం.

who is third party administrater

థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్…
థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే ఏజెంట్. అంటే మనకి కంపెనీకి మధ్య ఉండే వ్యక్తి. ఏజంట్ దగ్గర మనకున్న సందేహాలన్నీ ముందే చెప్పి తెలుసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి సమస్య ఉండదు.
మన దేశంలో మెడికల్ ఇన్ ఫ్లేషన్ చాలా ఎక్కువ‌గా ఉంది.

top 5 health insurance companies in india

ఇప్పుడు టాప్ 5 హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలు తెలుసుకుందాం
-రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీ.
దీని క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో 100శాతం.
క్యాష్ లెస్ హాస్పిటల్ 8,014

-డిజిట్ హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీ
క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో 96శాతం,
క్యాష్ లెస్ హాస్పిటల్స్ 5,479

-నివా బూపా హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీ
క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో 96 శాతం,
క్యాష్ లెస్ హాస్పిటల్స్ 8,701

-కేర్ హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీ
క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో 95 శాతం,
క్యాష్ లెస్ హాస్పిటల్స్ 9,592

-ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీ
క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో 94 శాతం,
క్యాష్ లెస్ హాస్పిటల్స్ 8,787

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *