ఎంట్రప్రెన్యూర్షిప్ అనేది కొంచెం సృజనతో కూడుకున్నది. కేవలం మనకు వచ్చే ఆలోచన మాత్రమే గొప్పదని, విజయం వైపు తీసుకెళ్తుందని చెప్పలేం. మన ఆలోచన మరింత మెరుగవ్వాలంటే తప్పకుండా కొన్ని కొత్త విషయాలను, కొత్త కోణాలని జత చేయాల్సిందే. అలా చేయాలంటే ఉపకరించేది పుస్తక పఠనం మాత్రమే. కొన్ని పుస్తకాలు మన జీవితాలను మార్చిరిస్తాయి అనడంలో సందేహం లేదు.
which books will change you
పుస్తక పఠనం మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలకు పుస్తకాలు ఆజ్యం పోస్తాయనడంలో సందేహం లేదు. మేధావుల ఎన్నో ఆలోచనలు, అనుభవం, మధనం అనంతరం వచ్చే అక్షరాలు మనల్ని కదిలిస్తాయి. లక్ష్యం వైపు నడిపిస్తాయి. అలా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు చదివి, నేర్చుకుని, ఉత్తేజితులైన కొన్ని పుస్తకాలను ఇక్కడ మనం తెలుసుకుందాం.
* స్టే హంగరీ స్టే ఫులిష్
– రష్మి బన్సల్
* డ్రీమ్ విత్ యువర్ ఐస్ ఓపెన్
– రోని స్కృవాలా
* భాగ్
– గణేష్.వి
* కనెక్ట్ ది డాట్స్
– రష్మి బన్సల్
* యూ కెన్ విన్
– శివ్ ఖేరా
* ఎగైనెస్ట్ ఆల్ బడ్స్
– జి.కృష్ణమూర్తి
* స్టీల్ కింగ్
– ప్రతీక్ష ఎం. తివారి
* టేక్ మీ హోమ్
– రష్మి బన్సల్
* బుజియా బరోన్స్
– పవిత్ర కుమార్
* ది జెడ్ ఫేక్టర్
– సుభాష్ చంద్ర విత్ ప్రంజల్ శర్మ