ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే నో ఇన్సూరెన్స్ what will happen if you violate traffic
రోడ్లపై చూస్తే అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేవారు, హెల్మెట్ లేకుండా, ఫోన్ మాట్లాడుతూ, రాంగ్ రూట్‌లో వెళ్తూ ప్రమాదాలకు గురయ్యేవారు ఎక్కువగా కనిపిస్తుంటారు. అతి వేగంతో వచ్చి ఎదుటివారిని ఢీకొని గాయపరచడం లేదా, వారి మృతికి కారణమయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి ఘటనలను అరికట్టడానికి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.
no insurance if you violate traffic
ట్రాఫిక్ ఉల్లంఘనల వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటాయన్న మాట వందశాతం నిజం. ఇలాంటి ఉల్లంఘనుల వల్ల సక్రమంగా వాహనాలు నడిపే వారు సైతం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటి వరకూ నిబంధనలు ఉల్లంఘిన వారికి ఫైన్‌లు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు అదనంగా ఇన్సూరెన్స్ క్లయింలో కొన్ని మార్పులు చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ ను అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిన వారిపై మరింత కఠినంగా ప్రభుత్వం వ్యవహరించనుంది.
what are the traffic rules
తస్మాత్ జాగ్రత్త..
* నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు గురై గాయపడినా, మరణించినా అలాంటి వారికి ఎటువంటి బీమా రాదు.
* ఆటో, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్య నిబంధనలకు మించి ఉంటే అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే అలాంటి వారికి బీమా వర్తించదు.
* హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపేవారికి బీమా వర్తించదు.
* రాంగ్ రూట్లో వాహనాలు నడిపేవారికి కూడా ఎలాంటి బీమా ఇవ్వబడదు. ఒకవేళ సరైనదారిలో వాహనాలు నడుపుతున్న వారి కారణంగా రాంగ్ రూట్ లో వాహనాలు నడిపేవారికి ప్రమాదం జరిగినా వారిపై ఎలాంటి కేసూ నమోదు చేయరు.
* రాంగ్ రూట్లో వెళ్ళే వారి వల్ల ప్రమాదం జరిగితే రూ.20 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఉల్లంఘించిన వారి ఆస్తులను అమ్మడం ద్వారా కూడా డబ్బులు రికవరీ అవ్వకపోతే వారికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.
* మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం వర్తించదు.
* మొబైల్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేసినవారికి ప్రమాదం జరిగినా వాళ్ళకి బీమా వర్తించదు. ఇలాంటి వారు హెల్మెట్ పెట్టుకున్నా, సరైన రూట్లో డ్రైవింగ్ చేసినా కూడా అదే శిక్ష వర్తిస్తుంది.
* లిమిట్ ను అదిగమించి వాహనాలు వేగంగా నడిపిన వారికి కూడా అన్ని శిక్షలూ వర్తిస్తాయి. సీటు బెల్ట్ పెట్టుకోకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే బీమా పరిహారం చెల్లించదు.
Leave a Reply