* మార్చి నాటికి విక్రయం?
భారత ప్రభుత్వం ప్రవేటీకరణ దిశగా అడుగులను ముమ్మరం చేసింది. చాలా ప్రభుత్వ సంస్థలను ఇప్పటికే అమ్మేందుకు చర్యలు తీసుకుంది. మరికొన్నింటికి ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఐడీబీఐ (ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంకు ఆఫ్ ఇండియా) పై ఇప్పటికే దృష్టి పెట్టింది. దీన్ని పూర్తిగా ప్రవేటుపరం చేయనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి.
government sell its stack in idbi bank
ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఆసక్త వ్యక్తీకరణ) తో సంబంధిత ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. బ్యాంకులో మొత్తం వాటాను ఒకేసారి అప్లోడ్ చేయకపోవచ్చునని సమాచారం. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో యాజమాన్య వాటాను కలిగి ఉన్న ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉండగా, కేంద్ర ప్రభుత్వానికి 48.48 శాతం వాటా ఉంది.
how much lic stack in idbi bank
వచ్చేవారం మార్కెట్ రెగ్యులేటర్ లో ఎల్ఐసీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ లేదా ప్రైమరీ ప్రాస్పెక్టస్ ను ప్రభుత్వం ఫైల్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేయాలని భావిస్తోంది. బ్యాంకులో నాన్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ప్రస్తుతం 5.29 శాతంగా ఉంది. ఆర్బీఐ తో వివరంగా సంప్రదింపులు జరిపి, సంబంధిత ప్రక్రియను రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫైనాన్సియల్ బిడ్లు వేసిన తర్వాత ఎలాంటి అనిశ్చితికి తావు లేకుండా ఎల్ఐసీతో కలిసి వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం సన్నధ్ధమవుతోంది. యాజమాన్య ప్రక్రియలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ మొత్తం స్టేక్ మాత్రం వెల్లదనే సమాచారం. ఐడీబీఐ బ్యాంకు విక్రయం తర్వాత ఎల్ఐసీ ఐపీవో, బీపీసీఎల్ విక్రయంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది.