how to transfer money securely

మీ ఫ్రెండ్‌కో, లేదా మీ ద‌గ్గ‌ర బంధువుకో లేదా ఎక్క‌డో ఉన్న మీ కుటుంబ స‌భ్యుడికో డ‌బ్బులు పంపించాలంటే అది చాలా పెద్ద ప‌ని. బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ ఫార్మ్ తీసుకుని, అత‌ని బ్యాంకు వివ‌రాలు, అడ్ర‌స్ అన్నీ న‌మోదు చేసి అప్ప‌డు డ‌బ్బులు బ్యాంకులో వేయాల్సి వ‌చ్చేది. అలా వేసిన డ‌బ్బులు అవ‌త‌లి వ్య‌క్తి అకౌంట్‌లో జ‌మ అయ్యే స‌రికి కొంత స‌మ‌యం ప‌ట్టేది. ఇదంతా గ‌తం. కానీ ఇప్ప‌డు ప‌రిస్థితులు మారాయి. డ‌బ్బులు పంపించాలంటే క్ష‌ణాల్లో ప‌ని. ఏదో ఒక మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ యాప్ ఓపెన్ చేసి అవ‌త‌లి వ్య‌క్తి ఫోన్ నెంబ‌ర్‌ద్వారా డబ్బులు సులువుగా పంపించొచ్చు. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో వ‌చ్చిన మార్పులు, సాంకేతిక అభివృద్ధి వ‌ల్లే ఇది సాధ్య‌మైంది. అయితే ఈ ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ అభివృద్ది చెందిన క్ర‌మంలో మ‌నీ ట్రాన్జాక్ష‌న్‌కు కొన్ని సుర‌క్షిత విధానాలు ఉన్నాయి. ఆన్‌లైన్ మొబైల్ యాప్ ట్రాన్జాక్ష‌న్‌లో జ‌రుగుతున్న మోసాలు, సైబ‌ర్ క్రైం కు బ‌ల‌య్యే ముందు ఓ సారి సుర‌క్షిత విధానాలైన NEFT, RTGS, IMPS, UPI గురించి తెలుసుకుందాం…

what is NEFT

NEFT  (నేష‌న‌ల్ ఎల క్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స‌ఫ‌ర్‌)
నెఫ్ట్ అనగా రిజ ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చే నిర్వహించబడిన ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ వ్యవస్థ. మన దేశంలో ఇద్ద‌రు బ్యాంక్ కస్టమర్ల ఖాతాల మధ్య నెప్ట్ ద్వారా నిధులను బదిలీ చేయడానికి వీలు కలుగుతుంది. ఇది ఎలక్ట్రానిక్ సందేశాల ద్వారా జరుగుతుంది. ఇది పూర్తి సుర‌క్షితం.

నెఫ్ట్ ఫీచర్స్..
ఆన్ లైన్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్నపుడు మనకి ఒక ఫామ్ ఇస్తారు. దానిలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానికి తగిన ఛార్జస్ పే చేసుకుంటే బ్యాంకు వాళ్ళు మనకి ఐడీ, పాస్ వర్డ్ ఇస్తారు. దాని ద్వారా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ స‌దుపాయాన్ని వాడుకుంటూ నెప్ట్ ట్రాన్జాక్షన్ చేసుకోవచ్చు.
మనం ఆఫ్ లైన్లో కూడా ట్రాన్జాక్షన్ చేయవచ్చు. మనం బ్యాంక్ కి వెళ్ళి నెప్ట్ ఫామ్ ని తీసుకుని, దానికి కావలిసిన పూర్తి వివరాలను నింపి, నెఫ్ట్ ట్రాన్జాక్షన్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ నెఫ్ట్ ట్రాన్జక్షన్ 24 గంటలు చేసుకోవచ్చు.
* నెప్ట్ ట్రాన్జక్షన్ కి మినిమమ్ 2 గంటలు తీసుకుంటుంది.
* నెప్ట్ ట్రాన్జాక్షన్ చేయడానికి కొన్ని ఛార్జస్ ఉండేవి. కాని, జనవరి 2020 నుండి మనం ఆన్ లైన్ లో నెఫ్ట్ ట్రాన్జక్షన్ చేస్తే ఛార్జస్ ను తొలగించారు. అయితే ఆఫ్ లైన్ ట్రాన్జాక్షన్ కి చార్జీలు ఉన్నాయి. ఆఫ్ లైన్ లో 4 లిమిట్స్ ఉన్నాయి.

నెఫ్ట్ ట్రాన్జాక్ష‌న్ కు చార్జెస్ ఇలా..
మనం రూ.10,000 వరకు ట్రాన్జక్షన్ చేస్తే మనకి నెప్ట్ ఛార్జస్ రూ.2.5+ జీఎస్టీ పడుతుంది.
మనం రూ.10,000 నుండి 1 లక్ష వరకు రూ.5 +జీఎస్టీ పడుతుంది.
లక్ష నుంచి 2 లక్షల వరకు రూ.15+ జీఎస్టీ పడుతుంది.
2 లక్షల కంటే ఎక్కువ ట్రాన్జాక్షన్ చేస్తే రూ.25+ జీఎస్టీ పడుతుంది.

what is RTGS

RTGS : రియ‌ల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్‌
RTGS అనగా వ్యక్తిగతంగా, లావాదేవీల వారీగా నిరంతర నిధుల సెటిల్మెంట్ ఉండే వ్యవస్థ. RTGS లో మాక్జిమమ్ 30 నిమిషాలలో మన ట్రాన్జక్షన్ సెటిల్మెంట్ అయిపోతుంది. RTGS కి మినిమమ్ లిమిడ్ 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.
దీనిలో కూడా ఆన్ లైన్, ఆఫ్ లైన్ అను రెండు ప‌ద్ధ‌తులు ఉంటాయి.
RTGS ద్వారా డబ్బులు బదిలీ చేయానలుకున్నవాళ్ళు లభ్దిదారుని పేరు, బ్యాంక్ ఖాతా నంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్ సీ కోడ్, బ్యాంక్ బ్రాంచ్ పేరు కలిగి ఉండాలి.
జూలై 01, 2019 నుంచి RTGS లావాదేవీల ప్రోసెసింగ్ ఛార్జిస్ మాఫీ చేయబడ్డాయి. అయితే, ఆఫ్ లైన్ లో పంపిన డబ్బుల పై ఛార్జిస్ ఉన్నాయి.

how much charges for RTGS money transfer

ఆర్‌టీజీఎస్ చార్జెస్ ఇలా..
రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకు రూ.24.50
రూ.5 లక్షలకు పైగా రూ.49.50
మార్చి 2004 లో ఆర్బీఐ RTGS ను లాంచ్ చేసింది.
నవంబర్ 2010 లో RTGS ఛార్జెస్ తగ్గించారు.
డిసెంబర్ 2019 లో RTGS ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ ఛార్జిస్ ను పూర్తిగా తొలగించారు.

IMMEDIATE MOBILE PAYMENT SERVICE (IMPS)
మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్‌ని మ‌రింత సులువు చేసేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐఎంపీఎస్ అనే స‌దుపాయాన్ని మన ముందుకు తీసుకువచ్చారు.
* నెఫ్ట్, RTGS లో చాలా రకాల ఇన్ఫర్మేషన్ మ‌నం న‌మోదు చేయాల్సి ఉంటుంది. కానీ మనకి మొబైల్ ఉండి ఐఎమ్పీఎస్ చేసుకోవాలనుకుంటే, మనకు బ్యాంక్ సిబ్బంది ఇచ్చే MMID అను ఒక ఐడీ ని న‌మోదు చేస్తే చాలు. ఎవరైతే మనకి ఐఎంపీఎస్ చెయ్యాలనుకుంటున్నారో వారికి మన మొబైల్, MMID ఐడీ ని ఇస్తే స‌రిపోతుంది.
* ఐఎంపీఎస్ లో రెండు రకాల మెకానిజమ్స్‌ ఉంటాయి.
మన మొబైల్, MMID ఐడీ ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొకరికి మనీ ట్ర‌న్స‌ఫ‌ర్ చేసుకోవచ్చు.
వ్యక్తి అకౌంట్ నంబర్ కి బెనిఫిషియ‌రీ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్ సీ కోడ్ ఉంటే మనీ ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. దీని ద్వారా మినిమమ్ 1 రూ, మాక్జిమమ్ రూ.5 లక్షలు వరకు ట్రాన్జాక్షన్ చేసుకోవచ్చు.

ఐఎంపీఎస్ ఛార్జెస్ ఇలా..
రూ.10,000 వరకు ట్రాన్జాక్షన్ చేస్తే రూ.2+ GST పడుతుంది.
రూ.10,000- 1లక్ష అయితే రూ.4 + GST పడుతుంది.
రూ.1 లక్ష – 2 లక్షల వరకు అయితే రూ.12+ GST పడుతుంది.
రూ.2 లక్షల కంటే ఎక్కువ అయితే రూ.20+ GST పడుతుంది.

UNIFIED PAYMENT INTERFACE (UPI)
ఇటీవ‌ల యూపీఐ చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను విరివిగా వాడుతున్నారు. దీనిలో ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ ని ఉపయోగించడానికి మనం తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. ఏ బ్యాంకులైతే యూపీఐ లావాదేవీలను అనుమతిస్తాయో పరీశీలించాలి. దీన్ని ఎన్ పీ సీఐ డెవలప్ చేసింది.
యూపీఐ లావాదేవీకి గరిష్ఠ పరిమితి రోజుకి లక్ష రూపాయ‌ల వరకు ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *