మ‌న దేశంలో ప‌న్ను క‌ట్ట‌డం త‌ప్ప‌నిస‌రి. అధిక ఆదాయ వ‌ర్గాల వారంతా ట్యాక్స్ ప‌రిధిలోకి వ‌స్తారు. ఉన్న‌తోద్యోగులు, వ్యాపారులు వివిధ వ‌ర్గాల వారంతా ట్యాక్స్ క‌ట్టితీరాల్సిందే. ఇలా మ‌నం చెల్లించే ట్యాక్స్ తోనే ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూరుతుంది.

వ్యాపార‌వేత్త‌ల మాట ప‌క్క‌న పెడితే సాధార‌ణంగా ఉద్యోగులంతా ప‌క్కాగా ట్యాక్స్ క‌డుతుంటారు. ఈ క్ర‌మంలో ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నా అందిపుచ్చుకోవ‌డానికి వెనుకాడ‌రు. ఇలా ట్యాక్స్ క‌ట్టే క్ర‌మంలో వ‌చ్చే మిన‌హాయింపులు,వెసులుబాట్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

ట్యాక్స్ మిన‌హాయింపుల‌ను ఇచ్చే వాటిలో ముఖ్య‌మైన‌ది సెక్ష‌న్ 80. ఈ సెక్ష‌న్‌ కింద చాలా స‌బ్ సెక్ష‌న్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో అతి ముఖ్య‌మైన‌ది సెక్ష‌న్ 80 సీ. ఈ సెక్ష‌న్ ద్వారా సుమారు ల‌క్షా ఏబై వేల రూపాయ‌ల వ‌ర‌కూ వెసులుబాటు పొంద‌వ‌చ్చు.

 

SECTION 80C
సెక్ష‌న్ 80C

ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో సేవింగ్స్ చేయ‌డం, ఇన్సూరెన్స్ చేయ‌డం వంటి వాటి ద్వారా ట్యాక్స్ మిన‌హాయింపు పొంద‌డం ఈ సెక్ష‌న్ ప్ర‌త్యేక‌త‌. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన సెక్ష‌న్‌.

* ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే  ఈ సెక్షన్ లో డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.

* పిల్లలు స్కూల్ ఫీజులు లక్ష యాబై వేలు వరకు మనం ఖర్చు పెడితే దానిని కూడా ఈ డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.

* మనం ఎవరి పేరు మీదైనా లైఫ్ ఇన్సురెన్స్ తీసుకున్నట్లయితే దానికి చెల్లించే ప్రీమియంను కూడా సెక్ష‌న్ 80 సీ కింద‌ డిడక్షన్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు.

* సుకన్య సమృద్దీ యోజన పథ‌కం లో కూడా మనం లక్ష యాబై వేలు వరకు ఇన్వెస్ట్ చేస్తే దానిని కూడా ఈ డిడక్షన్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు.

* నేష‌న‌ల్‌సేవింగ్స్ స‌ర్టిఫికేట్ లో ఇన్వెస్ట్ చేయ‌డం ద్వారా ట్యాక్స్ మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

* మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఉండే ఒక ప్ర‌త్యేక‌మైన కేట‌గిరి ఈఎల్ ఎస్ ఎస్‌( ఈక్విటీ లింక‌డ్ సేవింగ్స్ స్కీమ్‌). వీటికి మూడు సంవ‌త్స‌రాల లాకిన్ పీరియ‌డ్ ఉంటుంది. వీటిలో ఇన్వెస్ట్ చేయ‌డం ద్వారా అధిక మొత్తంలో మ‌నం రాబ‌డి పొంద‌డ‌మే కాకుండా ట్యాక్స్ మిన‌హాయింపు కూడా పొంద‌వ‌చ్చు.

* నేషనల్ పెన్సన్ స్కీమ్ లో లక్ష యాబైవేలు కాకుండా అధనంగా రూ. 50,000 వ‌ర‌కూ ఎక్స్ ట్రా ఇన్వెస్ట్ చేస్తే దీనిని మనం 80 సీసీడీలో క్లెయిమ్ చేసుకోవచ్చు.

80C కి సంబంధించిన డిడక్షన్ కాకుండా ఇంకా ఎటువంటి సెక్షన్స్ Deduction benefits ఉన్నాయో తెలుసుకుందాం..

శాలరీ పర్సన్స్ కి డిడక్షన్ లో ముఖ్యంగా చూసుకోవలిసినదేమిటంటే ఆదాయానికి సంబంధం లేకుండా స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఒకటి ఇస్తారు. మన గ్రాస్ మొత్తం ఇన్ కమ్ లో రూ.50 వేలు డిడక్షన్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఏ సెక్షన్ కిందకూ రాదు. స్టాండర్డ్ డిడక్షన్ కింద క్లెయిమ్ అవుతుంది.

హౌస్ రెంట్ అలవెన్స్

ఈ హౌస్ రెంట్ అలవెన్స్ కామన్ గా ఎవరైనా క్లెయిమ్ చేసుకోగలిగిన అంశం. కాకపోతే దీనిలో చిన్న టెక్నికల్ కాలుక్యులేషన్ ఉంది.

మొదట మన పేస్లిప్ లో HRA COMPONENTS అనేది ఒకటి ఉంటుంది.
HRA గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవలిసిన పని లేదు. ఉద్యోగం చేసే వారికి HRA గురించి బాగా తెలుస్తుంది. ఉద్యోగి వేతనంలో HRA కలిసి ఉంటుంది. శాలరీ స్ట్రక్చర్ లో ఇది కీలకమైన అంశం. అందువల్ల చాలా మందికి దీని గురించి తెలిసి ఉంటుంది. అద్దె ఇంట్లో ఉండే ఉద్యోగులు పన్ను భారం తగ్గించుకోవడానికి HRA క్లెయిమ్ చేసుకోవచ్చు.

HRA మొత్తంపై పూర్తిగా ట్యాక్స్ పడదు. బేసిక్ సాలరీ మాదిరి కాకుండా దీనిపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. బేసిక్ శాలరీ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది.

HRA క్లెయిమ్ లో 3 రకాలు ఉన్నాయి.
1. కంపెనీ నుంచి పొందిన HRA
2. మూలవేతనంలో 50 శాతం (మెట్రో నగరాల్లో నివాసం ఉంటే ).. 40 శాతం ( నాన్ మెట్రో ప్రాంతాల్లో ఉన్నవారికి)
3. చెల్లించిన అద్దెలో నుంచి 10 శాతం బేసిక్+ డీఏ తగ్గించి మిగిలిన మొత్తం ఇలా ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే దాన్ని క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

HOW TO CLAIM HRA
HRA క్లెయిమ్ ఎలా ?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం HRA లో కొంత భాగంపై పన్నుపడుతుంది. అలాగే కొంత భాగంపై పన్ను మినహాయింపు ఉంటుంది. దీనికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని 80జీజీ కింద HRA క్లెయిమ్ చేసుకోవచ్చు. మన కంపెనీకి ప్రూఫ్స్ అందించడం వల్ల‌ HRA క్లెయిమ్ చేసుకోవచ్చు.

* హోమ్ లోన్ పై..
మనం హోమ్ లోన్ ఏదైనా తీసుకుంటే మనం వ‌డ్డీ చెల్లించిన‌ట్ట‌యితే దానిపై మనం రూ.2 లక్షల వరకు హౌస్ లోన్ ఇంటరెస్ట్ పేమెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు.

DEDUCTIONS UNDER SECTION 80D
సెక్షన్ 80డీ..

హెల్త్ ఇన్సురెన్స్ సంబంధించి మ‌నం చేసే ఖ‌ర్చుకు సెక్ష‌న్ 80 డీ ద్వారా క్లెయిం చేసుకోవ‌చ్చు. ఇందులో మ‌నం పూర్తి అవ‌గాహ‌న క‌లిగి జాగ్రత్తగా క్లెయిమ్ చేసుకోవా ల్సి ఉంటుంది. ఇక్క‌డ కొన్ని కేటగిరీలు ఉన్నాయి. దీంట్లో మన కోసం చేసే హెల్త్ ఇన్సురెన్స్, మన పేరెంట్స్ కోసం చేసిన హెల్త్ ఇన్సురెన్స్ రెండింటికీ డిడక్షన్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనిలో వయసు ప్రకారం లిమిటేషన్ ఇచ్చారు. మ‌నం, మ‌న పేరెంట్స్ వ‌య‌సును బ‌ట్టి క్ల‌యిం చేసుకునే శాతం మారుతుంది. వ‌యసు ఎక్కువైతే క్లెయిం శాతం పెరుగుతుంది.

SECTION 80 DD
సెక్షన్ 80 డీడీ

దీని ప్రకారం మన మీద ఎవరైనా ఆధారపడి ఉన్నారనుకుంటే వాళ్ళు వైకల్యం కలిగి ఉంటే వాళ్ళ మెడికల్ ఖర్చు మనం భరిస్తే ఇక్క‌డ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.

* 40 నుంచి 80 శాతం వైకల్యం కలిగి ఉంటే వాళ్ళు రూ.75వేలు వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక వేళ 80 శాతం కంటే ఎక్కువ ఉంటే రూ. లక్ష 25వేల వ‌ర‌కూ క్లెయిమ్ చేసుకోవచ్చు.

SECTION 80EEB
సెక్షన్ 80 ఈఈబీ

ఈ రోజుల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు గిరాకీ పెరిగింది. ప్ర‌భుత్వం కూడా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా వీటిని ప్రోత్స‌హిస్తోంది. ఈ వాహ‌నాల‌ను కొనే వారికి ట్యాక్స్ డిడ‌క్ష‌న్ వెసులుబాటు ఇస్తొంది.

ఎవ‌రైనా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు లోన్ తీసుకుని వాహ‌నాల‌ను కొంటే ఆ లోన్ మీద పే చేసే ఇంటరెస్ట్ అనేది మనం డిడక్షన్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులోసుమారు రూ 1. 5లక్షల వరకు క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

SECTION 80 G
సెక్ష‌న్ 80 జీ:

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు, సొసైటీల‌కు, ట్ర‌స్టుల‌కు మ‌నం చేసే డొనేష‌న్ ల ద్వారా మ‌నం ట్య‌క్స్ మిన‌హాయింపు పొందే అవ‌కాశం ఉంటుంది.

SECTION 80 GG
సెక్ష‌న్ 80 జీజీ:

ఉద్యోగ‌స్థుల‌కు శాల‌రీలో ప్ర‌త్యేకంగా హెచ్ ఆర్ ఏ లేక‌పోయినా, లేదా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పీపుల్ తాము చెల్లించే ఇంటి అద్దెను ఫైల్ చేసి ట్యాక్స్ మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

SECTION 80 TTA
సెక్ష‌న్ 80 టీటీఏ:

80 టీటీఏ సెక్షన్ ప్రకారం మనకి సేవింగ్ అకౌంట్స్ మీద ఇంటరెస్ట్ వస్తే దానిపై మనం సుమారు రూ.10వేలు వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.

SECTION 80 TTB
సెక్ష‌న్ 80 టీటీబీ:

ఒక వేళ సీనియర్ సిటిజన్ అయితే మనకి సేవింగ్స్‌ అకౌంట్స్ మీద వ‌చ్చే ఇంటరెస్ట్ పై సుమారు రూ.50వేలు వరకు మనం డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది సేవింగ్స్ అకౌంట్స్ మీద వ‌చ్చే వ‌డ్డీ కి మాత్రమే వ‌ర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చిన ఇంటరెస్ట్ కు వ‌ర్తించ‌దు.

ఈ సెక్షన్ల‌న్నీ మనం తెలుసుకుని వీటి ఆధారంగా స‌క్ర‌మంగా ఇన్ కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోగలిగితే రూ.12లక్షల వరకు శాలరీ ఉన్నప్ప‌టికీ మనం జీరో ట్యాక్స్ తో ఫైల్ చేసుకుని ఎటువంటి ట్యాక్స్ క‌ట్ట‌కుండా వెసులుబాటు పొంద‌వ‌చ్చు.

ఇక్క‌డ ప్రతి ఇన్వెస్ట్ మెంట్ కీ, ప్ర‌తి క్లెయిం కి ప‌క్కాగా ఆధారాలు ఉంచుకోవాలి. వాటిన్నిటినీ మనం జాగ్ర‌త్త చేసుకోవాలి. డిపార్ట్ మెంట్ కి ఏదైనా డౌట్ వస్తే మన ఆధారాలు చూపించగలగాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *