how to get personal loan
ఇటీవల పర్సనల్ లోన్స్ విరివిగా లభిస్తున్నాయి. బ్యాంకులే స్వయంగా ఫోన్ చేసి లోన్ తీసుకోండి అంటూ అడుగుతున్నాయి. ఇతర ఆన్లైన్ లోన్ యాప్స్ సంగతి సరేసరి. ఇక ఈ బ్యాంకులు ఇచ్చే పర్సనల్లోన్ ప్రాసెస్ ఏమిటి..? వడ్డీ ఎంత, ఈఎంఐ ఎంత అనే విషయాలు ఓ సారి చూద్దాం.
మనం అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్ లోన్స్ తీసుకుంటాం. బ్యాంకులు ఈ లోన్స్ ని ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మనకి ఇస్తాయి. కేవలం మనల్ని నమ్మి ఇస్తాయి కాబట్టి ఇవి అంత సురక్షితం కాదని బ్యాంకుల భావన. అందుకే వీటిపై అధిక వడ్డీ రేటు వసూలు చేస్తాయి. అయినా మనం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రుణం తీసుకుంటాం. ఈ రుణాన్ని ఈఎంఐ రూపంలో నెలవారీ చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే మనం పర్సనల్ లోన్ తీసుకునేముందు బ్యాంకు వడ్డీ రేట్లు, కాలపరిమితి, ఆలస్య రుసుము వంటివి తెలుసుకోవాలి.
* ఏ బ్యాంకు వెబ్సైట్లోకి వెళ్లినా మనకు పర్సనల్ లోన్ వివరాలు దొరుకుతాయి. మనం మెసేజ్ చేయగానే మన ఎలిజిబిలిటీ వివరాలు అడుగుతుంది. నమోదు చేయగానే ఎంత వస్తుంది.. ఎంత వడ్డీ అని తెలుస్తుంది. వాటిని బట్టి మనం బ్యాంకు సిబ్బందితో మాట్లాడవచ్చు. ఇక్కడ రుణం మన జీతాన్ని బట్టి ఉంటుంది.
* మనకి లోన్స్ ఇవ్వాలంటే బ్యాంకు మన క్రెడిట్ స్కోర్ ని పరిశీలిస్తుంది. మనం లోన్ తిరిగి చెల్లించగల స్థోమత ఉంటేనే లోన్ ఇస్తారు. లేకపోతే మన అప్లికేషన్ తిరస్కరించే అవకాశం ఉంది. అందువల్ల లోన్ కోసం దాఖలు చేసుకునే ముందుగా క్రెడిట్ స్కోర్ ను మెరుగుపరుచుకోవడం చాలా అవసరం.
అధిక వడ్డీ..
పర్సనల్ లోన్స్ కి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చాలావరకు వ్యక్తిగత రుణాలకు ఎలాంటి హామీ ఉండదు. భద్రత తక్కువగా ఉంటుంది. బ్యాంకులు మినిమమ్ 11 శాతం నుంచి 16 శాతం వరకూ వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. ఇతర ఆర్థిక సంస్థల్లో దీనికంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. వడ్డీ రేట్లు మనం రుణం తీర్చే వ్యవధి బట్టి ఉంటుంది. నెలవారీ వాయిదా ఉంటుంది. కాలపరిమితి ఎక్కువగా ఉంటే ఈఎంఐ తక్కువగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముంటుంది.
what is processing fees in personal loan
ప్రాసెసింగ్ ఫీజులు
మనం పర్సనల్ లోన్ తీసుకున్నపుడు ప్రోసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇవి మనకిచ్చే లోన్స్ బట్టి ఉంటుంది. బ్యాంకులన్నింటికీ ప్రాసెసింగ్ ఫీజు ఒకేలా ఉండదు. బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది.
మనం ఏదైనా కారణం చేత ఈఎమ్ఐ చెల్లించడం ఆలస్యం అయితే బ్యాంకులు ఎక్కువ వడ్డీలు విధిస్తాయి. మన అకౌంట్ లో సరిపోయినంత డబ్బులు లేకపోతే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ తిరస్కరించినా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు చాలా అధిక మొత్తంలో ఛార్జీలను వసూలు చేస్తాయి. ఇది ఒక్కోసారి ఈఎమ్ఐలో 5 శాతం నుంచి 10 శాతం వరకు కూడా ఉండే అవకాశముంది.
ముందే తీర్చినా..
మనం అత్యవసర పరిస్థితుల్లో లోన్స్ తీసుకుంటాం. నగదు అందిన వెంటనే కొంతమంది తిరిగి చెల్లిస్తారు. అందుకే గడువు ముగింపుకంటే ముందే ఖాతాను మూసివేస్తే ఛార్జస్ పడతాయా అనే సందేహం అందరికీ ఉంటుంది. ఇలా ముందే తీర్చేస్తే బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి. వీటినే ప్రీ క్లోజింగ్ చార్జీలు అంటారు. కొన్ని బ్యాంకులు మాత్రం వీటిని వసూలు చేయవు.