ఐపీవోకి అప్లై చేయాల‌నుకుంటే మ‌న‌కు త‌ప్ప‌నిస‌రిగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి.
డిమ్యాట్ అకౌంట్ స్టాక్ బ్రోకర్ దగ్గర ఓపెన్ చేయాలి. అప్పుడు డీపీ క్రియేట్ అవుతుంది. ఈ డీపీ రెండు డిపాజిటర్ల దగ్గర క్రియేట్ అవుతుంది. డీపీ అకౌంట్ 16 నంబర్లు కలిగి ఉంటుంది. ఈ అకౌంట్ నంబర్ కాషన్ స్టేట్ మెంట్ లో ఉంటుంది.

demat account is mandatory to apply ipo

సాధార‌ణంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో చాలా మంది ఐపీవోకి అప్లై చేస్తుంటారు. బ్యాంకింగ్ సైట్‌లోకి లాగిన్ కాగానే ఇన్వెస్ట్ అండ్ ఇన్సురెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ డ్రాప్ డౌన్ లో ఇన్వెస్ట్ ఆన్ లైన్ అని మనకి కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చే స్తే ఆన్ లైన్ ఐపీవో అని ఉంటుంది. అక్కడ ఇన్వెస్ట్ ఇన్ ఐపీవో దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. అవి ఎంటర్ చేసిన తరువాత ఇక్కడ మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. సాదారణంగా మనం ఐపీవో కి అప్లై చేసినపుడు ఇన్వెష్ట‌ర్ ,షేర్ హోల్డర్ కేటగిరి, ఎంప్లాయ్ కేటగిరి అనే ఆప్ష‌న్స్ ఉంటాయి. వాటిలో మ‌న‌కు కావాల్సింది మ‌నం ఎంపిక చేసుకోవాలి.

జిరోదా లాంటి యాప్‌ల‌లో క‌న్సోల్‌లో ఐపీవో ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. అక్క‌డ అప్లై చేస్తే ఆన్‌లైన్ లేదా యూపీఐ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ పే కానీ ఎంచుకుంటే దానికి నోటిఫికేష‌న్ వెళ్తుంది. గూగుల్ యాప్‌లో మ‌న‌ ప్రొఫైల్ పేజ్‌లోకి వెళ్తే అక్క‌డ ఆటోపే ఆప్ష‌న్ ఉంటుంది. దానిమీద క్లిక్ చేయ‌గానే నోటిఫికేష‌న్ క‌నిపిస్తుంది. ఇక దానిపై పే మెంట్ చేయాలి.

how to apply retailers to ipo

ఐపీవోకి అప్ల‌య్ చేసేట‌ప్ప‌డు రిటైల్ లేదా నాన్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్‌ ఇన్వెస్టర్ అని ఉంటుంది. 2లక్షల లోపు మనం అప్లై చేస్తే రిటైల్ కేటగిరి మీద సెలెక్ట్ చేయాలి. అదే రెండు లక్షల కన్నా ఎక్కువ అయితే నాన్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఇన్వెస్టర్ కేటగిరి పై సెలెక్ట్ చేయాలి. ఎక్కువ‌గా 2లక్షల లోపు అప్లై చేస్తాం కాబట్టి రిటైల్ కేటగిరి పై క్లిక్ చేయాలి.

సాధారణంగా తక్కువ ప్రైజ్ బ్యాండ్ నుంచి ఎక్కువ ప్రైజ్ బ్యాండ్ ఉంటుంది. ఎక్కువ ప్రైజ్ బ్యాండ్ ని ఎంపిక చేసుకోవాలి. ఎవరైతే తక్కువ ప్రైజ్ కి ఎక్కువ ప్రైజ్ కి మధ్య‌లో ఎంటర్ చేస్తారో వారికి అలాట్ మెంట్ రాదు. అందువల్ల ఎక్కువ ప్రైజ్ ప్యాడ్ లో ఎంతైతే అమౌంట్ పెట్టారో ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమెటిక్ గా పే చేసిన అమౌంట్ వచ్చేస్తుంది. తర్వాత సబ్ మిట్ క్లిక్ చేయండి.
తర్వాత పేజీ ఓపెన్ అవుతుంది. పేజీ లో మనం అప్లై చేసినట్లు ధ్రువీక‌రించాలి. వెంట‌నే అప్లికేషన్ నంబర్ వస్తుంది. ఇది రిటైల్ కేటగిరి లేదా నాన్ ఇన్వెస్టర్ కేటగిరిలో ఎలా చేయ్యాలో తెలుసుకున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *