
millionaires in hyderabad
దేశంలో ధనవంతులు పెరుగుతున్నారు. అందులో మన తెలుగువారు మరీ ముందంజలో ఉన్నారు. అత్యంత ధనవంతుల జాబితాలో హైద్రాబాద్ దేశంలో రెండో స్థానంలో ఉంది. ఇటీవల నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెళ్లడించింది. ముంబై మొదటి స్థానంలో ఉండగా బెంగుళూర్, పూణేలు మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
people who have 225 crore rupees
రూ.225 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారిని పరిగణలోకి తీసుకుని దేశంలో ఎంత మంది ధనికులు ఉన్నారనే అంశంపై ఈ సర్వే నిర్వే నిర్వహించారు. ఆల్ట్రా హై నెట్ వర్త్ ఇండివ్యూజివల్స్-2021 పేరుతో ఓ రిపోర్ట్ ను నైట్ ఫ్రాంక్ వెల్త్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ లో ధనికుల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ మొత్తం 467 మంది వ్యక్తులు రూ. 225 కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. 2026 సంవత్సరానికి ఆ వ్యక్తుల సంఖ్య 56 శాతం వృద్ధితో 728కి చేరనున్నట్లు తెలిపింది. ముంబై 1596 మంది ధనికులతో తొలిస్థానంలో నిలిచింది.
hyderabad is master in pharma
నైట్ ప్రాంక్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా మాట్లాడుతూ టెక్నాలజీ , డిజిటల్ ఎకానమీ, ఫార్మా రంగాల్లో హైద్రాబాద్ చక్రం తిప్పుతోంది. కరోనా తర్వాత వీటి ప్రాభల్యం పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 2016 తర్వాత 28.4 నుంచి అనూహ్యంగా 39 శాతం వృద్దితో ధనవంతులు జాబితా పెరిగిందన్నారు. ఈ రంగాల వ్యాపార వేత్తలు అనేక మంది ఆర్థికంగా ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులతో పోటి పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.