SBI offers home loan to all

భార‌తీయుల‌కు ఇళ్లు అంటే ఉండే క‌నెక్ష‌న్‌, ఆ ఎమోష‌న్ వేరు. ఎప్ప‌టికైనా సొంతంగా ఓ ఇళ్లు క‌ట్టుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ క‌ల కంటారు. ఆ క‌ల‌ను సాకారం చేసుకునేందుకు బ్యాంకుల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. అలాంటి వారికి రుణాల‌ను అందించేందుకు బ్యాంకులు కూడా ముందుకు వ‌స్తుంటాయి. ర‌క‌ర‌కాల ఆఫ‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాయి.

అలాంటి చ‌ర్య‌ల్లో భాగంగా ఎస్‌బీఐ ఒక వినూత్న వ్యూహంతో ముందుకు వచ్చింది. ఐదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా రుణ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. గృహ రుణాల విషయంలో ఎటువంటి సేవలకూ నోచుకోని, పొందలేని అసంఘటిత, తక్కువ ఆదాయం గల వర్గాలే లక్ష్యంగా, ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ విభాగాల్లో రుణ మంజూరులకు కృషి చేస్తోంది. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్, ఎడెల్వీస్ హౌసింగ్ ఫైనాన్స్, కాప్రి గ్లోబల్ ఫైనాన్స్ తో ఎస్‌బీఐ జ‌ట్టు క‌డుతోంది.

home loan at low cost

* ఆర్థికంగా వెనుకబడినవారికి, బలహీన వర్గాలకు గృహం అనేది చాలా అరుదు. నిత్యం సవాళ్ళతో బ‌తికే వీళ్ల‌కి రుణ విత‌ర‌ణ పెంచేందుకు ఎస్బీఐ తన వంతు సాయ‌మందించేందుకు కృషి చేస్తోంది. ఎస్బీఐ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల సహాయంతో రుణ పంపిణీ నెట్ వర్క్ ను మెరుగుపరుస్తుంది. 2024 నాటికి అందరికీ ఇళ్ళు ఇవ్వాలనే దిశలో అభివృద్దికి ఈ ఒప్పందాలు దోహదపడతాయి.
* అసంఘటిత, బలహీన వర్గేలకు రుణ విస్తరణ జరిగేలా, చిన్న ఇల్లు కొనేవారికి సమర్థవంతమైన, తక్కువ వడ్డీలకే రుణాలను వేగవంతం చేసేలా కృషి సాగుతోంది.
* ఎస్బీఐ ఒప్పందం రెండు సంస్థల లాభాలను పెంచడానికి , హోమ్ లోన్ ఫోర్ట్ ఫోలియోలను విస్తరించడానికి సహాయపడుతుంది. విలువైన ప్రతి రుణగ్రహీతల‌కు మరింత ఫైనాన్స్ అవకాశాలను సృష్టిస్తుంది. సామాన్యుని ఇంటి కల నెరవేర్చడంతో ఈ భాగస్వామ్యం కీలకమవుతుంది.

One thought on “అంద‌రికీ హౌసింగ్ రుణం – ఎస్బీఐ బంప‌ర్ ఆఫ‌ర్‌”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *