why housing loan is the best choice

సొంత ఇంటి కల నెరవేర్చుకోవ‌డానికి మ‌నం జీవిత కాలం వెచ్చిస్తుంటాం. ఎంతో క‌ష్ట‌ప‌డి డ‌బ్బులు పోగేసి రాత్రి ప‌గ‌లు నిద్ర‌లు మానేసి ఇంటికోసం ప‌రిత‌పిస్తుంటారు. కానీ బ్యాంక్‌లోన్ ద్వారా అప్పు తీసుకోవ‌డం మ‌న‌కు ఉన్న బెస్ట్ ఆప్స‌న్‌. కానీ కొంత‌మంది సొంత డ‌బ్బులు పెట్టి క‌ట్టుకుందామ‌నుకుంటారు. బ్యాంక్‌లోన్ అంటే చాలా ఎక్కువ వ‌డ్డీ అని, చాలా క‌ష్ట‌మైన ప్ర‌క్రియ‌ అని భావిస్తుంటారు. కానీ హౌసింగ్ లోన్ తీసుకుని ఇళ్లు క‌ట్టుకోవ‌డ‌మే మంచి నిర్ణ‌య‌మ‌ని నిపుణులు చెప్తున్నామ‌న్నారు.

interest on housing loan is zero

హౌసింగ్ లోన్ పై వడ్డీ సున్నానే..
సాధారణంగా హౌసింగ్ లోన్ వడ్డీ 11 శాతం ఉంటుంది. అంటే మనం రూ.100 తీసుకుంటే సంవత్సరం అయ్యేసరికి రూ.111 చెల్లించాలి. కానీ ఏటా మ‌న దేశంలో ఇన్ఫ్లేష‌న్ సుమారు 6 % ఉంటుంది. అంటే ఈ రోజు 100 వ‌స్తువు వ‌చ్చే సంవ‌త్స‌రం 106 రూపాయ‌లు ఉంటుంది. ఆ తర్వాత సంవ‌త్స‌రం సుమారు రూ.112 ఉంటుంది. అంటే ఇక్క‌డ వ‌స్తువు ధ‌ర పెరుగుతుంది, రూపాయి విలువ త‌గ్గుతుంది. మ‌నం తీసుకునే అప్పుపై వ‌డ్డీరేటు కూడా ఏటా త‌గ్గుతున్న‌ట్టే.

ఈ లెక్క చూద్దాం..
ఇప్పుడు హౌసింగ్ లోన్‌ని, ఇన్ఫ్లేష‌న్ ను ఓ సారి ప‌క్క‌ప‌క్క‌న పెట్టి చూద్దాం. పెరిగిన ఇన్ఫ్లేష‌న్‌తో చూస్తే మ‌నం క‌ట్టే వ‌డ్డీ ఏటా త‌గ్గుతున్న‌ట్టే. అంటే లోన్ పై మ‌నం చెల్లించాల్సిన మొత్తంలో ఏటేటా క్ర‌మంగా 6 రూపాయ‌ల చొప్పున త‌గ్గుతున్న‌ట్టే. లోన్ తీసుకోవ‌డం వ‌ల్ల బ‌య‌ట మార్కెట్ విలువ‌తో పోలిస్తే మ‌నం తిరిగి ల‌బ్ధి పొందుతున్నాం. మ‌నం క‌ట్టే వ‌డ్డీ 111 నుంచి ఇన్‌ఫ్లేష‌న్గా మొద‌టి సంవ‌త్స‌రం రూ.6 త‌గ్గ‌న‌ట్టే. ఆ త‌ర్వాత సంవ‌త్స‌రం 105 నుంచి రూ. 6 త‌గ్గినట్టే. ఆ త‌ర్వాత సంవ‌త్స‌రం 99 నుంచి రూ.6 త‌గ్గినట్టే. ఇలా పోతే తిరిగి బ్యాంకు వారు మ‌న‌కు ఉచితంగా డ‌బ్బులు ఇచ్చిన‌ట్టే లెక్క‌. కానీ అదే స‌మ‌యంలో మన ద‌గ్గ‌ర ఉన్న మొత్తాన్ని ఇంటి నిర్మాణంకోసం వాడితే మ‌నం అంతే మొత్తంలో న‌ష్ట‌పోవాల్సి ఉంటుంది.

* హౌసింగ్ లోన్ తీసుకుంటే రూ.లక్షన్నర వడ్డీ మీద ఆదాయపు పన్ను ఉండదు. అలాగే అసలు లక్ష మీద ఆదాయపు పన్ను ఉండదు. అంటే రెండున్నర లక్షల వరకు ఇన్ కమ్ ట్యాక్స్ ఉండదు.
మనం ఇన్ కమ్ ట్యాక్స్ బ్రాకెట్ 20శాతం ఉన్న కూడా 5 శాతం మనకు ఆదా అవుతుంది.
అంటే ఇవ‌న్నీ చూసుకుంటే మనం 0 శాతం కంటే తక్కువ వడ్డీని చెల్లిస్తున్నాం. కాబట్టి సొంత డబ్బులు ఉన్నా కూడా హౌసింగ్ లోన్ తీసుకుని ఇంటి కల నెరవేర్చుకోవడం మంచిది.

ఇదే స‌మ‌యంలో దీనికి కావలిసిన మార్జిన్ మనీని సంపాదించాలి. అది ఎలా అంటే మనకు ఆదాయం వచ్చిన నుంచి నెలనెలా కొంత డబ్బును క్రమ పద్ధ‌తిలో దాచిపెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు లోన్ తీరే స‌మ‌యానికి అంతే మొత్తంలో కొంత నిధిని మ‌నం సృష్టించుకోవ‌చ్చు.

housing loan is all in one

ఆల్ ఇన్ వ‌న్ లోన్‌..
హౌసింగ్ లోన్ ఆల్ ఇన్ వన్ లోన్. ఎందుకంటే మనకి భవిష్యత్తులో పర్సనల్ లోన్ కావాలన్నా, ఎడ్యుకేషన్ లోన్ కావాలన్న ఇదే ఇంటిని సెక్యూరిటీగా పెట్టి రుణం సంపాదించుకోవచ్చు.
హౌసింగ్ లోన్ లో పద్దతిగా రీపేమెంట్ చేసేవాళ్ళకి బ్యాంకులు లోన్స్ ఇస్తుంటాయి. అందుకే హౌసింగ్ లోన్ ను ఆల్ ఇన్ వన్ లోన్ గా చెప్ప‌వ‌చ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *