ఇలాంటి ఇళ్లకు ప్రాధాన్యం..
which type of houses are better to buy
ప్రతి ఒక్కరి కల సొంతంగా ఓ ఇళ్లు కలిగి ఉండడం. అయితే ఇప్పడు కొనే ఉద్దేశాలు కూడా మారుతున్నాయి. కొందరు నివాసం ఉండడానికి ఇళ్లను కొనుక్కుంటుంటే కొందరు పెట్టుబడి నిమిత్తం లాభాలను పొందేందుకు ఇళ్లను కొనుక్కుంటున్నారు. మరి కొందరు అద్దెలకు ఇద్దామనే ఆలోచనతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ఎక్కడ ఎలాంటి ఇళ్లకు ప్రాధాన్యం పెరుగుతుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం.
how to plan for house
కాలానుగుణంగా అయ్యే ఖర్చుల ఆధారంగా ఇళ్ళు కొనుగోలు చేస్తే మంచిది. మనం ఇల్లు కొనేటపుడు దానికయ్యే ఖర్చు అత్యంత కీలకం. దీంతో పాటు నీటి లభ్యత, ప్రజారవాణా, పనిప్రదేశం, ఇంటి విస్తీర్ణం, సౌకర్యాలను తప్పక చూస్తారు. ఇక్కడ బడ్జెట్టే ప్రధానమనే విషయాన్ని మనలో చాలా మంది ఒప్పుకోవాల్సిందే. మన అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుని నిర్మించేవారు ప్రాజెక్టులు చేపడితే ఇల్లు నిర్మించేవారికి, కొనుగోలుదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని పలువురి అభిప్రాయం.
what is the need of own house
మన దేశంలో ఇప్పటికీ ఎక్కువ శాతం మంది నివాసం ఉండేందుకే ఇళ్లను కొంటున్నారు. వీరి సంఖ్య 84 శాతం వరకు ఉంటోంది. పెట్టుబడి కోణంలో కొనుగోలు చేసేవారు 16 శాతంగా ఉన్నారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ లో నివాసం ఉండడానికి మొదటి ఇళ్లు కొనేవారి శాతం ఎక్కువ. రెండు, మూడోసారి ఇల్లు కొంటున్నవారిలో ముందుగా పూణెవాసులు ఉన్నారు.
ఈ మధ్య కాలంలో కొనుగోలుదారులు వాణిజ్య నిర్మాణాలపై ఎక్కువ ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ లో 5 శాతం మంది మాత్రమే కమర్షియల్ రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు. ఇల్లు కొనేటపుడు 76 శాతం వాస్తుకి ప్రాధాన్యం ఇస్తున్నారు. వాస్తు పట్టింపులు లేనివారు 24 శాతం మంది ఉన్నారు.
apartment or individual house which is best
ఈ రోజుల్లో ఎక్కువమంది అపార్ట్మెంట్ ప్లాట్ కాకుండా ఇండిపెండెంట్ గా ఇల్లు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అపార్ట్మెంట్ ప్లాట్ అయితే సొంతదే అయినా అద్దె ఇళ్ళలో ఉన్నామనే భావన కలుగుతోంది. అందుకే అపార్ట్మెంట్ ప్లాట్ కాకుండా వ్యక్తిగత ఇల్లు కావాలనేవారు ఎక్కువ మంది ఉన్నారు. మహారాష్ట్ర లోని పుణెలో అత్యధికంగా 84 శాతం మంది, ఆ తర్వాత ముంబయిలో 77 శాతం మంది అపార్ట్మెంట్ లో ప్లాట్ కావాలంటున్నారు. దేశ రాజధాని డిల్లీలో కూడా 57 శాతం మొగ్గు కన్పిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం మొదటి ప్రాధాన్యం వ్యక్తిగత ఇల్లు అంటున్నారు. హైదరాబాద్, బెంగుళూర్, చెన్నైలో రెండో ప్రాధాన్యంగా ప్లాట్ ను కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. స్థలాల వైపు చూస్తున్న వారిలో హైదరాబాద్ 12 శాతంగా ఉన్నారు.
Leave a Reply