జీఎస్టీ.. ఈ పదం దాదాపు అందరికి తెలిసిందే. సరుకులు (జీ), సేవల (ఎస్)పై పన్ను (టీ)నే సంక్షిప్తంగా జీఎస్టీ అని అంటాం. దేశంలో అమల్లో ఉన్న ఎన్నో పన్ను చట్టాల స్థానంలో ఏకైక పన్ను చట్టంగా జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చారు. 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత జీఎస్టీ అనే పదం గురించి ఎక్కువ చర్చిస్తున్నారు. జీఎస్టీ (GST) అంటే వస్తువుల సేవా పన్ను. అయితే కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేసిన తర్వాత జూలై 2017 నుంచి ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసింది.

ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదా ఒక సేవను పొందినప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ వ‌ల్ల ఏదైనా వస్తువు లేదా సేవలపై ఈ పన్ను రేటు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అంటే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వినియోగదారుడు ఆ వస్తువులు లేదా సేవలపై ఒకే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వస్తువుల కింద మొబైల్స్, కంప్యూటర్లు, వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్ లు మొద‌లైన‌వి వ‌స్తాయి. సేవల కింద కన్సల్టెంగ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, లీగల్ అడ్వయిజ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటివి వ‌స్తాయి. జీఎస్టీ, కార్పొరేట్ ,ఇన్కమ్ ట్యాక్స్ అనేవి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులుగా చెప్పొచ్చు. ఈ మూడు కలిపితే మన ప్ర‌భుత్వం మొత్తం ఆదాయంలో దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉంటాయి.

ITR return..
ఐటీఆర్‌ రిటర్న్‌

కొత్త నిబంధనల ప్రకారం జీఎస్టీ వ్యవస్థలో వ్యాపారుల వ్యాపారంపై పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి నెలా మొత్తం అమ్మకాలు, కొనుగోళ్లు, పన్నులు తదతర వివరాలు ప్రభుత్వానికి చేరుతాయి. ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఇది జీఎస్టీ రిటర్న్‌ వ్యవస్థ.

Gross domestic product is likely to increase
స్థూల జాతీయోత్పత్తి పెరిగే అవ‌కాశం

పాత పన్నుల పద్దతి ప్రకారం ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా పన్నులు వసూలు చేస్తున్నాయి. కానీ జీఎస్టీ బిల్లు ద్వారా ఇప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఒకే రకమైన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల వినియోగదారుడికి వ్యయం తగ్గే అవకాశముంది.. అంతే కాదు స్థూల జాతీయోత్పత్తి కూడా 1.0 నుంచి 1.7 శాతం వరకు పెరిగి అవకాశముందని ఆర్ధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

How does the government get revenue?
ప్రభుత్వానికి ఆదాయం ఎలా వ‌స్తుందంటే..

ప్రభుత్వానికి ముఖ్యంగా ట్యాక్స్ ద్వారానే ఆదాయం వ‌స్తుంది. ఇవి రెండు ర‌కాలు. ఒక‌టి ప్ర‌త్య‌క్ష ప‌న్ను. రెండోది ప‌రోక్ష పన్ను.

Direct tax
డైరెక్ట్ ట్యాక్స్ … (ప్ర‌త్య‌క్ష ప‌న్ను)

మ‌న‌కు తెలిసే మ‌నం చెల్లించే ప‌న్నును డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఇన్‌క‌మ్ ట్యాక్స్‌. మ‌న‌కు ఎంత అయితే ఆదాయం వ‌స్తుందో.. అది ట్యాక్స్ స్లాబ్ కంటే కాస్త ఎక్కువ‌గా ఉంటే ప‌ర్సంటేజీ చొప్పున ప్ర‌భుత్వానికి మ‌నం ఇన్‌కం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మ‌నం డైరెక్ట్‌గా ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట‌మెంట్‌కు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. మ‌న ఆదాయంలో ఎంత మేర ప‌న్ను క‌డుతున్నామ‌న్న‌ది మ‌న‌కు తెలుస్తుంది. మ‌న‌కు తెలిసి మ‌న‌మే క‌డుతున్న ప‌న్నును ప్ర‌త్య‌క్ష ప‌న్ను (డైరెక్ట్ ట్యాక్స్‌) అంటారు. ఇందులోనే కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది.

  • మ‌నం ఏదైనా ఒక కంపెనీని నిర్వ‌హిస్తుంటే.. ఆ కంపెనీకి క‌చ్చితంగా లాభాలు వ‌స్తుంటాయి. మ‌న ప్రాఫిట్ లో ఇంత మొత్తం అని చెప్పి చెల్లించే ప‌న్నును కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. అదేవిధంగా వెల్త్ ట్యాక్స్‌. అంటే ప్రాప‌ర్టీ విలువ‌పై క‌ట్టే మొత్తాన్ని వెల్త్ ట్యాక్స్ అంటారు. మ‌నం ఏదైనా ఒక ప్రాప‌ర్టీని కొనుగోలు చేస్తే క‌చ్చితంగా ఈ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది.

Indirect Tax
ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్‌.. (ప‌రోక్ష ప‌న్ను)

మ‌న‌కు తెలియ‌కుండా చెల్లించే పన్నును ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ (ప‌రోక్ష ప‌న్ను) అని అంటారు. ఉదాహ‌ర‌ణ‌కు మ‌నం ఏదైనా షాప్‌లో టూత్‌పేస్ట్ కొంటే.. దానికి మ‌నం ఇన్‌డైరెక్ట్‌గా ప్ర‌భుత్వానికి ప‌న్ను చెల్లిస్తున్న‌ట్టే. దాని ధ‌ర రూ.100 అనుకుంటే అందులోనే క‌చ్చితంగా ట్యాక్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా క్యాబ్స్ (ఓలా, ఊబ‌ర్‌). వాటిని బుక్ చేసుకున్న‌ప్పుడు కూడా మ‌నం చెల్లించే మొత్తంలో కొంత‌మొత్తం ట్యాక్స్ ఉంటుంది. స‌ర్వీస్ ట్యాక్స్‌ చెల్లింపును ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ కు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ జీఎస్‌టీ.

Many taxes in the past
గ‌తంలో చాలా ట్యాక్స్ లు

గతంలో ప్రభుత్వం Luxary tax, Entry tax, Local tax, Entertainment tax, Excise tax, cst, vat, Octrol ఇలా 13 రకాల పరోక్ష పన్నులు వసూలు చేసేది. ఇవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉండేవి. అలాంటి పన్నుల వ్యవస్థను సులభతరం చేసేందుకు దేశంలో ఒకే విధమైన పన్ను విధానాలను రూపొందించడానికి, పన్ను ఎగవేతను తగ్గించడానికి జీఎస్టీని ప్ర‌వేశ‌పెట్టారు.

Biggest economic reform

అతిపెద్ద ఆర్ధిక సంస్కరణ

మన దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అతిపెద్ద సంస్కరణగా చెప్పవచ్చు. పలు రకాల పన్నులను (సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, సర్ చార్జీలు, రాష్ట్ర స్థాయిలో వ్యాట్ వంటివి) విలీనం చేసి జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. ఈ జీఎస్టీ విధానం మన దేశంలో 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పలు రకాల పన్నుల స్థానంలో జీఎస్టీ విధిస్తున్నారు.

వస్తుసేవలపై శ్లాబుల వారీగా పన్నును విధించడం జీఎస్టీతో మొదలుపెట్టారు. పన్ను శ్లాబులు సున్నా శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్నాయి. కొన్ని పన్నులు మినహా దాదాపు అన్ని రకాల పన్నులను కలిపి సమగ్రమైన జీఎస్టీని తెచ్చారు. జీఎస్టీ పరిధిలోకి రాని వాటిలో పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాల్ డ్రింక్స్, విద్యుత్ ఉన్నాయి. వీటిపై రాష్ట్ర ప్ర‌భుత్వాలు వేరుగా పన్నులను విధిస్తున్నాయి. కొన్ని రకాల ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు సెస్ ను కూడా విధిస్తున్నారు. విలాసవంతమైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, ఎయిరేటెడ్ డ్రింక్స్ వంటి వాటిపై జీఎస్టీతో పాటు సెస్ కూడా ఉంది. దీని మూలంగా సంబంధిత ఉత్పత్తుల ధరలు మరింతగా పెరుగుతాయి. జీఎస్టీ అమలు తర్వాత చాలా రకాల ఉత్పత్తులపై పన్నులు తగ్గాయని చెబుతుంటారు. అమ్మకం, బదిలీ, కొనుగోలు, లీజు, దిగుమతి లేదా సర్వీసులకు సంబంధించిన అన్ని లావాదేవీలపై జీఎస్టీని వసూలు చేస్తారు. అన్ని రకాల ఉత్పత్తులపై జీఎస్టీ ఒకే విధంగా ఉండదు. మనం నిత్యంవాడే వస్తుసేవల పై జీఎస్టీ వేర్వేరుగా ఉంటుంది.

What is The real purpose of GST

జీఎస్టీ అసలు ఉద్దేశమేమిటి 
వస్తు సేవల పన్నును 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ చట్టం 2016గా ప్రవేశపెట్టారు. జీఎస్టీ కౌన్సిల్, దాని ఛైర్మన్ కేంద్ర ఆర్థిక వస్తు సేవల పన్నును ప‌ర్య‌వేక్షిస్తారు. దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవచ్చు. గానీ జీఎస్టీ తప్పక కడతారు. జీఎస్టీ రాకముందు వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పన్ను స్లాబులు ఉండడం వల్ల ప్రాక్టికల్ గా చాలా ఇబ్బందులు ఉండేవి. ఒకే వస్తువు మీద పన్నులు చెల్లించడం వల్ల కస్టమర్ మీద ఎక్కువ భారం పడేది. పైగా పన్ను మీద పన్ను చెల్లించవలిసి వచ్చేది. దానినే Cascading effect అంటారు.

ఎవ‌రైనా ఒక కంపెనీ ప్రారంభించాలంటే కావాల్సిన ప్లానింగ్ క‌రెక్ట్‌గా జ‌రిగేది కాదు. ఎందుకంటే త‌న‌కు అనుకూల మైన ప్ర‌దేశంలో ట్యాక్స్ ఎక్కువ‌గా ఉండేది. ఏదైనా ఒక విదేశీ కంపెనీ మ‌న దేశంలో ఒక కంపెనీ పెట్టాలనుకుంటే త‌క్కువ శ్లాబ్ రేట్లు ఉన్న రాష్ట్రాల్లో పెట్టేది. దానివ‌ల్ల కేవ‌లం కొన్ని రాష్ట్రాలే అభివృద్ధి చెందేవి. అందుకే వ‌న్ నేష‌న్ వ‌న్ ట్యాక్స్ నినాదంతో జీఎస్టీని అమ‌లులోకి తెచ్చారు. ఒక వ్యక్తి 18 శాతం జీఎస్టీ చెల్లించి ఒక వస్తువు కొంటే అందులో 9 శాతం రాష్ట్రానికి SGST రూపంలో 9 శాతం కేంద్రానికి CGST రూపంలో వెళ్తుంది.

జీఎస్టీ మండలి
వస్తుసేవల పన్నుకు సంబంధించిన రేట్లు, నిబంధనలు, రెగ్యులేషన్లను జీఎస్టీ మండలి చూసుకుంటుంది. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు రాష్ట్రాల‌ ఆర్థిక మంత్రులు కూడా ఉంటారు. విభిన్న వర్గాల నుంచి వచ్చే అభ్యర్థనలు, డిమాండ్లను బట్టి జీఎస్టీ మండలి వివిధ వస్తుసేవలపై విధించే పన్నుల్లో మార్పులు చేర్పులు చేస్తుంది. ఇప్పటికే అనేక సార్లుల జీఎస్టీ మండలి సమావేశమై ఈ కొత్త పన్నుల విధానానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంది.

Rates of slabs
స్లాబుల రేట్లు

CGST, IGST, UTGST స్లాబుల రేట్లు ఆయా రకాల వస్తువుల బట్టి మారుతూ ఉంటాయి. నిత్యవసర వస్తువులు 0-5 శాతం పన్ను స్లాబులు ఉంటాయి. విలాసవంతమైన వస్తువులకు 28 శాతం పన్ను స్లాబు ఉంటుంది. మొబైల్ ఫోన్‌కు జీఎస్‌టీ 12 శాతం. మ‌నం మొబైల్‌ను కొంటే 12 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సిందే. అదేవిధంగా శానిటైజ‌ర్. దీనికి జీఎస్‌టీ కింద 18 శాతం క‌ట్టాల్సి ఉంది. ఇక గోల్డ్‌, జ్యూయ‌ల‌రీకి జీఎస్‌టీ 3 శాతం ఉంటుంది. బైక్ లేదా కారును కొంటే 28 శాతం జీఎస్‌టీ చెల్లించాలి.

Income to Government through GST
జీఎస్‌టీ ద్వారా ప్ర‌భుత్వానికి ఆదాయం

జీఎస్‌టీ ద్వారా ప్ర‌భుత్వానికి చాలా ఆదాయం వ‌స్తుంది. దానిని అభివృద్ధి ప‌నుల‌కు, సంక్షేమ ప‌థ‌కాల‌కు వినియోగిస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు 2017-18లో చూసుకుంటే దేశానికి రూ.82,294 కోట్లు జీఎస్‌టీ రూపంలో వ‌చ్చింది. 2018-19లో చూస్తే రూ. 98,114 కోట్లు వ‌చ్చాయి. 2019-20లో రూ. 1,01,844 కోట్లు,  2020-21లో రూ. 94,731కోట్లు , 2021-22లో రూ.1,23,608కోట్లు ఆదాయం వ‌చ్చింది. వ‌చ్చింది. అదేవిధంగా ఏపీలో 2019-20లో రూ. 2,548కోట్లు వ‌చ్చాయి. 2021-22లో రూ.2,685.09కోట్లు వ‌చ్చాయి.

facts about GST
GST గురించి వాస్తవాలు

*వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని విధించిన మొదటి దేశం FRANS
*భారతదేశంలోని GST కెనడాలో మాదిరిగానే రూపొందించారు. 
*విజయ్ కేల్కర్ కమిటీ భారతదేశంలో జీఎస్టీని అమలు చేయాలని సిఫార‌సు చేసింది.
*జూలై 1, 2017న భారతదేశంలో వస్తువులు సేవల పన్ను (GST) అమ‌లులోకి వ‌చ్చింది.
*జీఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం అస్సాం.
*భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 279 ప్రకారం జీఎస్టీ అమల్లోకి వచ్చింది.

* సెప్టెంబర్ 2016లో, భారత రాష్ట్రపతి GST కౌన్సిల్‌ను స్థాపించారు.
* జీఎస్టీ కౌన్సిల్‌లో ప్రస్తుతం 31 మంది సభ్యులు ఉన్నారు.

GST పోర్టల్  what is gst portal

పన్ను చెల్లింపుదారులు, ఇతర వాటాదారులు ఫిర్యాదులను దాఖలు చేయడానికి పోర్టల్ ను రూపొందించారు. హెల్ప్‌డెస్క్‌కి ఈ మెయిల్‌లు పంపడానికి బదులుగా, వారు ఎదుర్కొన్న లోపాలు లేదా సవాళ్లను వివరిస్తూ GST పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను పేజీల స్క్రీన్‌షాట్‌లను అప్‌లోడ్ చేసే విధంగా నిర్మాణాత్మకంగా రూపొందించారు. ఇది ఫిర్యాదులను త్వ‌రిత‌గ‌త పరిష్కారానికి వీలు కల్పిస్తుంది.

ఎవరు జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

పరిమితులతో సంబంధం లేకుండా, సరఫరా కోసం ఇ-కామర్స్‌ను ఉపయోగించే వ్యక్తులు, నివాసితులు లేదా సాధారణ పన్ను విధించదగిన వ్యక్తులు, నిర్దిష్ట సంస్థలు తప్పనిసరిగా GST కోసం నమోదు చేసుకోవాలి. చాలామంది వ్యాపారుల‌కు జీఎస్టీ కింద న‌మోదు చేసుకోవాలా లేదా అని సందేహం ఉంటుంది. అయితే ఇది 3 విషయాలుపై ఆధారపడి ఉంటుంది.
1. మనం విక్రయించే వస్తువులు లేదా సేవలు కొన్ని వస్తువులకి జీఎస్టీ ఉండదు కాబట్టి జీఎస్టీ నమోదు చేసుకోవలిసిన అవసరం లేదు.
2. బిజినెస్ సంవత్సర టర్నవర్. ఇప్పుడు చెప్పుకున్న జీఎస్టీలో వస్తువులు కాకుండా మిగతా వస్తువుల అమ్మకాల వార్షిక టర్నవర్ రూ.20 లక్షలు దాటితే జీఎస్టీ కింద నమోదు చేసుకోవడం తప్పనిసరి.
3 . కొన్ని రాష్ట్రాలను ప్రత్యేక రాష్ట్రాలుగా పరిగణిస్తారు. ఆ రాష్ట్రాలలో ఒక బిజినెస్ సంవత్సరం టర్నవర్ రూ. 10 లక్షలు దాటితే జీఎస్టీ క్రింద నమోదు చేసుకోవలిసి ఉంటుంది.

There are 4 types of GST in force in the country.
దేశంలో 4 రకాల జీఎస్టీ అమలులో ఉన్నాయి.

1. SGST Means State Goods And Services Tax.
ఇది ఒక రాష్ట్రానికి సంబందించినది. స్టేట్‌ జీఎస్టీ (SGST) అంటే రాష్ట్ర వస్తువులు , సేవా పన్ను అని అర్థం. రాష్ట్రంలో ఏదైనా వస్తువులు సరఫరా చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే పన్నును రాష్ట్ర జీఎస్టీ అంటారు. ఒక వ్యాపారి తన సొంత రాష్ట్రంలోని మరొక వ్యాపారి నుంచి ఏదైనా వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు ఈ లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వానికి సీజీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

2. CGST Means Central Goods and Services Tax. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన ట్యాక్స్. మన బిజినెస్ ఒకే స్టేట్ లో ఉంటే ఇవి రెండు వర్తిస్తాయి. ఇంట్రా స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ లావాదేవీలపై సీజీఎస్టీని కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. సీజీఎస్టీ ద్వారా వచ్చే రాబడిని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. దీన్ని ఎస్జీఎస్టీతో కలిపి విధిస్తారు. రాబడిని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పంచుకుంటాయి.

3.IGST Means Integrated Goods and Services Tax. మన బిజినెస్ వేర్వేరు రాష్ట్రాలలో గాని, కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలలో ఉన్నట్లయితే మనకి IGST వర్తిస్తుంది. ఐజీఎస్టీ (IGST) అంటే ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ (Integrated Goods and Services Tax-IGST). సమగ్ర వస్తుసేవల పన్ను అని అర్థం. అంటే అంతరాష్ట్ర (రాష్ట్రాల మధ్య) వ్యాపారం లేదా వాణిజ్యంలో భాగంగా వస్తువులు, సేవల సరఫరాపై ఐజీఎస్టీ చట్టం కింద విధించే పన్ను. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ వాటాను కలిగి ఉంటుంది. రాష్ట్రాల వాటాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడుతుంది. ఐజీఎస్టీ సేకరించే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుంది. కేంద్ర, రాష్ట్రం రెండూ మరొక దేశం నుంచి ఉత్పత్తులు లేదా సేవలపై పన్ను పొందుతాయి.
4. UTGST Means Union Territory Goods & Services Tax.
అంటే మన బిజినెస్ ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నట్లయితే ఇది వర్తిస్తుంది.

Important Principles to Know About GST 

GST గురించి తెలుసుకోవలిసిన 10 ముఖ్యమైన సూత్రాలు …
జీఎస్టీ, కార్పొరేట్‌, ఇన్ కమ్ ట్యాక్స్‌ల నుంచి మన దేశానికి ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయం వస్తుంది. ఈ మూడు కలిపితే మన ప్రబుత్వం మొత్తం ఆదాయంలో దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉంటాయి. గతంలో Luxary tax, Entry tax, Local tax, Entertainment tax, Excise tax, cst, vat, Octrol ఇలా 13 రకాల పరోక్ష పన్నులు వసూలు చేసేవారు. ఇవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉండేవి. అలాంటి పన్నుల వ్యవస్థను సులభతరం చేసేందుకు దేశంలో ఒకే విధమైన పన్ను విధానాలను రూపొందించడానికి, పన్ను ఎగవేతనను తగ్గించడానికి, 1 జూలై 2017 న మన ప్రభుత్వం జీఎస్టీని ప్రవేశపెట్టింది.

  • జీఎస్టీ అనేది ఇప్పటిది కాదు. 23 సంవత్సరాల కింద‌ట అంటే 2000 సంవత్సరంలో వాజ్ పేయి ప్రభుత్వం అశ్విన్ దాత్ గుప్త నేతృత్వంలో జీఎస్టీపై చర్చలు ప్రారంభించారు. 2004లో ఫైనాన్షియల్ మినిష్టర్ అడ్వైజర్ విజ‌య్ కేర్‌క‌ర్ జీఎస్టీ వ్యవస్థ ద్వారా పన్నుల వ్యవస్థను సంస్క‌రించొచ్చ‌ని భావించారు. దేశ వ్యాప్తంగా జీఎస్టీని అమలు చేయ‌డమే గవర్నమెంట్ మీడియం టు లాంగ్ టర్మ్ గోల్ అని 2005లో ఆర్థికమంత్రి చిదాంబరం ప్రకటించారు. ఏప్రిల్ 2010లో జీఎస్టీ అమలు చేస్తామని 2006లో ఆయ‌న వెల్ల‌డించారు. అయితే చివ‌ర‌కు 2017లో మోదీ గ‌వ‌ర్న‌మెంట్‌లో అమ‌లు చేశారు. జీఎస్టీ పన్ను విధానాన్ని ప్రపంచంలో 160 దేశాలు అమ‌లు చేస్తున్నాయి. దాదాపు ప్రపంచంలో 80 శాతం ప్రజలు జీఎస్టీ ని క‌డుతున్నారు. 1954లో మొట్టమొదటిసారిగా జీఎస్టీ ని అమలు చేసిన దేశం ఫ్రాన్స్. మనదేశం కెనడా జీఎస్టీ ని అనుసరిస్తూ ఉంది. అంటే స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ.

how to do GST Registration
జీఎస్టీ రిజిస్ట్రేషన్

జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది ఆన్ లైన్ లో ఈజీగా చేసుకోవచ్చు. మనం జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐడీ నంబర్ కూడా ఇస్తారు. ఇది 15 నంబర్స్ కలిగి ఉంటుంది. మొదటి రెండు అంకెలు స్టేట్ కోడ్ ని తెలియజేస్తాయి. 3 అంకెలు ఇంతకు ముందు ఉన్న పాన్ నంబర్ కి ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో తెలుపుతుంది. ఉచితంగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవ‌చ్చు. కేవ‌లం రెండు నుంచి ఆరు రోజుల్లో జీఎస్టీ నెంబ‌రు వ‌స్తుంది. దీనినే జీఎస్టీ ఐఎన్ అని అంటారు. గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ ఐడింటిఫికేష‌న్ నంబ‌ర్‌. ఇది 15 అంకెల‌ను క‌లిగి ఉంటుంది. దీనిలో చాలా అర్థం కూడా ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు 22 AAAAA 0000A1Z5 అని ఉంటే ఇందులో మొద‌టి రెండు అంకెలు స్టేట్ కోడ్‌ను తెలియ‌జేస్తాయి. తెలంగాణ కోడ్ 36 అయితే ఏపీ కోడ్ 28. త‌ర్వాత ప‌ది అంకెలు పాన్ నెంబ‌ర్‌ను తెలియ‌జేస్తాయి. ప‌ద‌మూడో అంకె .. ఇంత‌క‌ముందు రాసిన పాన్ నెంబ‌ర్‌తో ఎన్నిరిజిస్ట్రేష‌న్లు ఉన్నాయో  తెలియ‌జేస్తుంది.  ప‌ద్నాలుగో అంకె Z. ఇది డీఫాల్ట్‌గా ఉంటుంది. ప‌ద‌హేనో  అంకె  చెక్ కోడ్‌. అది అల్ఫాబెట్ లో లేదా అంకెలో ఉండొచ్చు.
మ‌న‌దేశంలో ఐదు జీఎస్టీ శ్లాబులు ఉన్నాయి. 0, 5, 12, 18, 28 శాతం చొప్పున శ్లాబులు ఉన్నాయి. కొన్ని వ‌స్తువులు మాత్రం 3, 0.25 శాతం శ్లాబుల‌తో ఉన్నాయి.

Who should register for GST
ఎవరు జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి 

పరిమితులతో సంబంధం లేకుండా ఇ-కామర్స్‌ను ఉపయోగించే వ్యక్తులు, నివాసితులు లేదా సాధారణంగా  పన్ను విధించదగిన వ్యక్తులు, నిర్దిష్ట సంస్థలు తప్పనిసరిగా GST కోసం నమోదు చేసుకోవాలి. అయితే చాలామంది వ్యాపారుల‌కు లేదా వ్యాపారం చేయాల‌నుకునే వారికి జీఎస్టీ కింద న‌మోదు చేసుకోవాలా లేదా అని సందేహం ఉంటుంది. అయితే ఇది 3 విషయాలుపై ఆధారపడి ఉంటుంది.
1. మనం విక్రయించే వస్తువులు లేదా సేవలు కొన్ని వస్తువులకి జీఎస్టీ ఉండదు కాబట్టి జీఎస్టీ నమోదు చేసుకోవలిసిన అవసరం లేదు.
2. బిజినెస్ సంవత్సర  టర్నోవర్ వస్తువుల అమ్మకాల ద్వారా రూ.20 లక్షలు దాటితే జీఎస్టీ కింద నమోదు చేసుకోవడం తప్పనిసరి.

3 . కొన్ని రాష్ట్రాలను ప్రత్యేక రాష్ట్రాలుగా పరిగణిస్తారు. ఆ రాష్ట్రాలలో ఒక బిజినెస్ సంవత్సర టర్నోవర్ రూ. 10 లక్షలు దాటితే జీఎస్టీ కింద నమోదు చేసుకోవలిసి ఉంటుంది. ఆ ప్ర‌త్యేక రాష్ట్రాలు ఏమిటంటే.. అరుణాచ‌ల‌ప్ర‌దేశ్‌, అస్సాం, జ‌మ్మూ కాశ్మీర్‌, మ‌ణిపూర్‌, మేఘాల‌య‌, మిజోరాం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌.

Not covered by GST
జీఎస్టీలో భాగం కానివి 

జీఎస్టీ పరిధి లోకి రానివి అనేక రకాల వస్తువులు, సేవలు ఉన్నాయి. వాటిపై జీఎస్టీ విధించ‌రు. వాటిలో NilRated, Zero Rated, Exempt, Non GST, Schedule 3
NilRated… ఇందులో జీరో శాతం జీఎస్టీ ఉంటుంది.
Zero Rated… ఇందులో విదేశాలకు, స్పెషల్ ఎకానమిక్ జోన్ లకు సరఫరా చేసేవి Zero Rated  కిందకు వస్తాయి.
Exempt… నిత్యవసర వస్తువులు ఈ కేటగిరిలోకి వస్తాయి. వీటిపై కూడా ఎటువంటి జీఎస్టీ ఉండదు.
Non GST… అసలు జీఎస్టీ పరిధిలోకి రాని Non GST సప్ల‌యిస్‌ అంటారు. అయితే వీటిపై వేరే ఇతర పన్నులు ఉండవచ్చు.
Schedule 3… సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం 2017 ప్రకారం కొన్ని లావాదేవీలు, వస్తువులు లేదా సేవ‌ల సరఫరాగా పరిగణించబడవు.
IGST (ఐజీఎస్టీ) : ఇంటర్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ లావాదేవీలపై ఐజీఎస్టీని వసూలు చేస్తారు. దిగుమతులు, ఎగుమతులకు కూడా ఇది వర్తిస్తుంది. ఐజీఎస్టీ కింద వసూలు చేసే పన్నును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. వస్తుసేవలను వినియోగించే రాష్ట్రా నికి పన్నులోని ఎస్జీఎస్టీ భాగం వెళుతుంది. ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ ను క్లెయిమ్ చేసుకోవడానికి ఐజీఎస్టీ దోహదపడుతుంది. CGST (సెంట్రల్‌ జీఎస్టీ) అంటే కేంద్ర వస్తువులు,సేవా పన్ను. అంటే రాష్ట్రంలో ఏదైనా వస్తువుల సరఫరా లేదా సేవలు పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నును సీజీఎస్టీ (CGST) అంటారు. ఒక వ్యాపారవేత్త తన రాష్ట్రంలో మరొక వ్యాపారి నుంచి వస్తువులను తీసుకోవడం లేదా ఇతర సేవలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది.

what is Input Tax Credit
ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ 

కస్టమర్ చెల్లించే జీఎస్టీలో ప్రతి ఒక్క రూపాయి గవర్నమెంట్ కి వెళ్తుందా? .. ఒక వ‌స్తువు మీద జీఎస్టీ వేస్తే అది త‌యారుచేసిన వారికి న‌ష్టం వ‌స్తుందా? ఈవిష‌యాలు తెలియాలంటే ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్  అంటే ఏమిలో మ‌నం అర్థం చేసుకోవాలి. 

ఉదాహ‌ర‌ణకు  X అనే వ్య‌క్తి రూ.100 చెల్లించి ఒక మొబైల్ చార్జ‌ర్ కొంటే అందులో ప‌ది శాతం అంటే రూ.10 జీఎస్టీ కింద చెల్లించాడు. కొద్దిరోజుల‌కు X అనే వ్య‌క్తి అదే మొబైల్ చార్జ‌ర్‌ను Y అనే వ్యక్తికి రూ.200 విక్ర‌యించాడు. ఇప్పుడు Y ప‌దిశాతం జీఎస్టీ కింద Xకు రూ.20 చెల్లించాడు. మ‌రికొద్దిరోజుల‌కు Y అనే వ్య‌క్తి అదే మొబైల్ చార్జ‌ర్‌ను Z అనే వ్య‌క్తి కి రూ.250కు  అమ్మాడు. ఇప్పుడు Z అనే వ్య‌క్తి Yకు ప‌ది శాతం జీఎస్టీ కింద రూ.25 చెల్లించాడు. ఇక్క‌డ ముగ్గురు క‌ట్టిన జీఎస్టీ ప‌న్నులు రూ.10, రూ.20, రూ.25..మొత్తం రూ.55 ప్ర‌భుత్వానికి చెల్లిస్తార‌ని మీరు అనుకుంటున్నారా? ఇక్క‌డ X అనే వ్య‌క్తి రూ.10 జీస్టీ క‌డితే.. Y ఇచ్చిన జీఎస్టీ రూ.20.ఇప్పుడు X ఏమిచేస్తాడంటే.. రూ.20ల‌లో రూ.10 తానే ఉంచుకుని.. మిగ‌తా రూ.10 మాత్ర‌మే ప్ర‌భుత్వానికి క‌డ‌తాడు. తాను ఉంచుకున్న ఆ రూ.10 ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. Y విష‌యానికొస్తే అత‌ను క‌ట్టిన జీఎస్టీ రూ.20. వ‌చ్చిన జీఎస్టీ రూ.25. అంటే 25-20 =5. అంటే రూ.5  మాత్రమే  ప్ర‌భుత్వానికి క‌ట్టే జీఎస్టీ. మిగిలిన రూ.20 ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇప్పుడు చెప్పుకునే విధంగానే ఒక వస్తువు తయారుచెయ్యాలంటే ఎన్నో రకాల రా మెటీరియల్స్, స్పేర్ పార్ట్స్ కోసం జీఎస్టీ కట్టినా తమ వస్తువు అమ్మేటప్పుడు కస్టమర్ కట్టిన జీఎస్టీ తో వాటిని టాలీ చేస్తుంటారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *