great books by mukesh ambani 

క‌రోనా ఒక్కొక్క‌రికీ ఒక్కోలా గ‌డిచింది. సాధార‌ణ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి, కూలీలు, పేద‌వారికి చాలా క‌ష్టంగా, భారంగా న‌డిస్తే, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి, పెద్ద‌పెద్ద వ్యాపారుల‌కు, ఉన్న‌త వ‌ర్గాల వారికి, బడాబ‌డా వ్య‌క్తుల‌కు హాయిగా గ‌డిపేందుకు చాలా ఖాళీ స‌మ‌యం ఇచ్చింది. కానీ చాలా మంది మాన‌సికంగా చాలా కుంగుబాటుకు గుర‌య్యారు. కొంద‌రు ఏం చేయాలో తోచ‌క పిచ్చివాళ్ల‌య్యారు. కొంద‌రు వ్య‌స‌నాల‌కు బానిస‌య్యారు. కానీ కొంత‌మంది మాత్రం ఈ టైంను స‌ద్వినియోగం చేసుకున్నారు. 

most read books in carona time by ambani

కరోనా  కాలంలో ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సైతం కాస్త మానసిక ఆందోళనకు గురయ్యారట. అయితే, ఇలాంటి పరిస్థితుల మధ్య కొన్ని పుస్తకాలు తనలో స్ఫూర్తినిచ్చాయ‌ని తెలిపారు. 2021ను దాటుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని అందించాయన్నారు. అలాంటి ఉత్సాహం, స్ఫూర్తి కావాల‌నుకునే వారెవ‌రైనా వీటిని చదవాలని సూచించారు.

ten lessions for a post pandamic world

* ‘టెన్ లెసెన్స్ ఫర్ ఏ పోస్ట్ పాండమిక్ వరల్డ్‌’- ప్రస్తుత కరోనా మహమ్మారిని, గతంలో ప్రపంచాన్ని భయపెట్టిన మరికొన్ని వైరస్ ల వ్యాప్తి, ఎదురైన పరిస్థితుల మధ్య ఉన్న సారూప్యత గురించి తెలుపుతూ జీవనశైలి, బలహీనమైన ప్రభుత్వాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడే సంక్షోభాల గురించి ఫరీద్ జకారియా ఇందులో వివరించారు.

 

* ‘ప్రిన్సిపల్ ఫర్ డీలింగ్ విత్ ది చేంజింగ్ వరల్డ్ ఆర్డర్: వై నేషన్స్ సక్సీడ్ అండ్ ఫెయిల్’- గత 5 శతాబ్దాల చరిత్రలో ప్రపంచంలోని గొప్ప దేశాలకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక విజయాలు, అపజయాలపై విశ్లేషణాత్మకంగా రచించిన పుస్తకమిది. దీని రచయిత పేరు రే డాలియో. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కఠిన సమయం కంటే రాబోయే కాలం భిన్నంగా ఎందుకు ఉంటుందో తెలుసుకోవడంలో ఈ పుస్తకం ఉప‌యోగ‌ప‌డుతుంది. పాలకులు, వ్యాపారవేత్తలు, అధికారులు, యువతరం ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదివి తీరాలన్నారు ముకేశ్.

* ‘ది ర్యాగింగ్ 2020ఎస్  కంపెనీస్, కంట్రీస్, పీపుల్-అండ్ ది ఫైట్ ఫర్ అవర్ ప్యూచర్’
కార్పొరేట్ కార్యకలాపాలు, ప్రభుత్వ వైపల్యం, ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న వినూత్న ఆర్థిక, రాజకీయ నమూనాలకు సంబంధించిన కథనాలను ఇందులో పొందుపరిచారు రచయిత అలెక్ రాస్.

* ‘2030:హౌ టుడేస్ బిగ్గెస్ట్ ట్రెండ్స్ విల్ కొల్లైడ్ అండ్ రీ షేప్ ది ప్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్’- 2030లో ప్రపంచం ఎలా ఉంటుంది. నగరీకరణ ఏ విధంగా ఉండబోతుంది ఇలాంటి అంశాలను కళ్ల‌కు కట్టేవిధంగా రచించారు మౌరో గిల్లెన్. ఆయన అంచనాల ప్రకారం .. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పాశ్చాత్య దేశాల వినియోగదారులపై ఆధారపడకుండానే వృద్ధి సాధిస్తుంది. పురుషుల కన్నా మహిళల వద్దే సంపద ఎక్కువ ఉంటుంది. కార్మికుల‌ స్థానంలో పెద్ద ఎత్తున రోబోలు వచ్చి చేరుతాయ‌ని అ భిప్రాయం వ్య‌క్తం చేశారు.

* బిగ్ లిటిల్ బ్రేక్ థ్రూస్. హౌ స్మాల్, ఎవ్రీడే ఇన్నోవేషన్స్ డ్రైవ్ ఓవరైజ్డ్ రిజల్ట్స్’.. కరోనా సంక్షోభం అనంతరం ప్రపంచంలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితుల్ని సంస్థలు, వ్యక్తుల వినూత్న ఆవిష్కరణలతో అవకాశాలను తక్కువకాలంలోనే సృష్టించుకుంటారు. ఈ పుస్తకం వివరించే ప్రధానాంశం ఇదే. దీన్ని జోస్ లింకర్ రచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *