మనలో చాలా మంది కొత్త ఉద్యోగం రాగానే, లేదా చిన్న వ్యాపారం మొదలుపెట్టగానే కారు కొనాలని ప్రయత్నిస్తారు. వీలైనంత ఖరీదైనది, నలుగురిలో గొప్పగా అనిపించే కారును తీసుకుంటారు. బ్యాంకులోన్ వాడి జీతంలో అధిక భాగం ఈఎంఐ కోసం కేటాయించి కారు నడుపుతారు. అయితే ఇది ఎంత వరకు సరైన నిర్ణయం అనేది ఓ సారి సమీక్షిద్దాం.
DISADVANTAGES OF HAVING A CAR
మన ఆదాయం మొదలుకాగానే కారు కొనాలనుకోవడం పొరపాటే అవుతుంది. కారు అనేది మన ప్రాధాన్యాల్లో మూడో లేదా నాలుగో స్థానంలో ఉండాలి. ఎందుకంటే అంతకన్నా ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. మొదట్లోనే మీరు కారు కొంటే ఆదాయంలో ఆదా చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, ఆస్తులు కూడబెట్టడానికి అవకాశం ఉండదు.
* పొదుపు చేయడం, ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టడం, ఇళ్లు కొనుక్కోవడం అనే వాటికి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇవి ఆస్తులవుతాయి. అంటే వీటి నుంచి మనకి ఆదాయం వస్తుంది.
* కారు అనేది లగ్జరీ. అంటే దీనినుంచి మనకు ఆదాయం రాకపోగా దీనిపై మనం తిరిగి ప్రతినెలా, ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తూ ఉండాలి. ఎంత ఖరీదైన కారు కొంటే అంత ఎక్కువగా మెంటెనెన్స్ చార్జీలు ఉంటాయన్న విషయం మరవొద్దు.
* మనం కారు కొనేముందు ఆలోచించుకోవలిసినది మన బడ్జెట్. ఈ విషయంలో మనకి కొంత క్లారిటీ ఉండాలి. మన ఆర్థిక స్థోమతు ప్రకారం మన కారు కొనాలనుకున్నప్పుడు మన సంవత్సర ఆదాయం దాటి ఖర్చు చేయకూడదు. ఎందుకంటే కారు విలువ రోజురోజుకీ తగ్గిపోతూ ఉంటుంది. అదేమిటంటే కేవలం కారు కొనుక్కుంటే సరిపోదు. దానిని ఖచ్చితంగా మనం మెంటైన్ చేయాలి. కాబట్టి మనం ఎక్కువ ఖర్చుపెట్టి కారు కొంటే, దానికి సర్వీసు చేయాలి కాబట్టి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది.
* పెరుగుతున్న ఇంధన ధరలు, ఇన్సూరెన్స్, ట్యాక్స్, డ్రైవర్, మెంటెనన్స్, పార్కింగ్ ఫీజులు ఇవన్నీ మనపై అధనపు భారం మోపుతాయి.
WHEN SHOULD YOU TAKE A CAR
ఇలా ఉంటేనే కారు..
* మనం కారు కోసం ఖర్చు చేయవలిసిన డబ్బు మన సంవత్సర ఆదాయం దాటి ఉండకూడదు. అంటే సంవత్సర ఆదాయం ఆరు లక్షల రూపాయలు అనుకుంటే మీరు కొనాలనుకున్న కారు అంతకన్నా తక్కవ ధర ఉండేలా చూసుకోవాలి.
* మనకారు లోన్ ఈఎమ్ఐ మన నెలజీతంలో 10 శాతం కన్నాతక్కువగా ఉండాలి. అంటే మీకు 50 వేలు జీతం వస్తుంటే మీ కార్ లోన్ ఈఎంఐ నెలకు రూ. 5వేలు మాత్రమే ఉండాలి. అంత కంటే ఎక్కువ ఉండకూడదు.
* కారు మనకి ఆస్తి కాదు. అది డిప్రీసియేటింగ్ అసెట్. అంటే విలువ తగ్గే వస్తువు. రోజురోజుకి దీని విలువ తగ్గుతుంది, కానీ పెరగదు. అంటే కారుపై మీరు పెట్టే డబ్బు వృథా అయినట్టే లెక్క.
* చాలామంది ఏ అసెట్స్ కొనకుండానే కారును కొంటారు. అలా చేయకూడదు.
* అదనపు ఆదాయ మార్గాలు తయారు చేసుకుని కారు కొనుక్కుంటే నష్టం ఉండదు.
మనం సొంతంగా కారు కొనలేనప్పుడు లోన్ కోసం వెళ్తారు. అయితే కార్ లోన్ తీసుకునే ముందు మనం చాలా విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.
CAR LOAN PROCESS
మనం మొదట షోరూమ్ కి వెళ్ళి కారుని ఎంచుకోవాలి. మనం కారు కొన్నప్పుడు షోరూమ్ వాళ్ళు క్యాష్ ఇచ్చేస్తారా లేదా లోన్ తీసుకుంటారా అని మనకి అడుగుతారు. అప్పుడు క్యాష్ ఇచ్చి తీసుకుంటే సమస్యే లేదు. లేకపోతే మనం లోన్ తీసుకుని కారు కొనాలంటే మనకి షోరూమ్ వాళ్ళు ఒక కొటేషన్ ఇస్తారు. అందులో కారుక్ సంబంధించిన వివరాలు అన్ని పూర్తిగా ఉంటాయి. మనం ఆ కొటేషన్ తీసుకుని ఏ బ్యాంకులో అయితే కారు లోన్ వడ్డీ తక్కువగా ఉంటుందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఇస్తాం. ఆ కొటేషన్ తో పాటు మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా గత 3నెలలు జీతం స్లిప్, గత 6నెలలు మన బ్యాంకు స్టేట్ మెంట్ అండ్ మన గత రెండు సంవత్సరాలు ఐటీ రిటర్న్స్ ఇవ్వాలి. మనం ఒకవేళ బిజినెస్ చేస్తే బిజినెస్ కి సంబంధించి ఏదైనా ప్రూఫ్ ఇవ్వాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు ఇవ్వాలి. ఇవన్నీ ఆధారాలు చూసాక బ్యాంకు మనకి లోన్ ఇస్తుంది.
* మన కారు on road price అనేది రూ.10లక్షలు అయితే కొన్ని బ్యాంకులు మన సిబిల్ స్కోర్, ఆదాయం అంతా బాగున్నట్లయితే 100% on road price ఇస్తున్నాయి. కానీ చాలా బ్యాంకులు 75 శాతం మాత్రమే ఇస్తున్నాయి. కారు on road price అనేది రూ.10లక్షలు అయితే 2.5 శాతం డౌన్ పేమెంట్. ఆ డౌన్ పేమెంట్ ఖచ్చితంగా సేవింగ్ సైడ్ ఉండాలి. ఆ మొత్తాన్ని మనం షోరూమ్ లో కట్టాలి. మిగతా అమౌంట్ బ్యాంకు లోన్ ఇస్తుంది. దానితో మనం కారుని తీసుకోవచ్చు.
* మన దగ్గర డౌన్ పేమెంట్ చేసేంత కెపాసిటీ లేకపోతే మనం కారు తీసుకోకూడదు. అందుకు సరిపడా మొత్తం మన దగ్గర సేవింగ్స్ ఉంటే మాత్రమే కారు లోన్ తీసుకోవాలి. కారు తీసుకున్న తర్వాత నెలనుంచి మనకి ఈఎమ్ఐ కట్టవలిసి ఉంటుంది.
EMI TENURE
ఈఎంఐ పదవీకాలం మనం 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎక్కువమంది 5 సంవత్సరాలు టెన్యూర్ పెట్టుకుంటాం. ఎప్పుడైతే చివరి ఈఎమ్ఐ కడతామో అప్పుడు క్లియర్ అయిపోతుంది. అప్పుడు మనం No objection certificate తీసుకుంటాం.
అప్పటివరకు మన కారు ఆర్సీ పై ఫలానా బ్యాంకు లోన్ తీసుకున్నాం అనేది ఉంటుంది.
ఒకవేళ మనం తీసుకోవాలనుకున్న కారు షోరూమ్ బ్యాంక్స్ తో లింక్ అయ్యి ఉంటే మనం కారు కోసం లోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్స్ లో వడ్డీ రేటు 6 నుంచి 10 శాతం ఉంటుంది. కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పోరేషన్ తో లింక్ అయితే మనం లోన్ తీసుకోకూడదు. ఎందుకంటే అందులో వడ్డీ రేట్లు 10 నుంచి 18 శాతం వరకు ఉంటుంది.
ఎలాంటివాళ్ళు ఈ లోన్ కి అర్హులు
జాబ్ చేస్తున్న లేదా వ్యాపారం చేస్తున్నవారు, లేదా నెలనెలా ఆదాయం వచ్చే వారు ఈ లోన్ పొందడానికి అర్హులు. మన వయసు 21నుంచి 60 మధ్యలో ఉండాలి. అదే మనం వ్యాపారం చేసేవాళ్ళమయితే 21 నుంచి 65 వరకు కూడా లోన్ తీసుకోవచ్చు.
మనం జాబ్లో జాయిన్ అయి మినిమమ్ 2 సంవత్సరాలు అయి ఉండాలి. మన జీతం మినిమమ్ రూ.25వేలు ఉండాలి. అదే మనం వ్యాపారం చేసినవాళ్ళమయితే మన ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు నుంచి రూ. 3 లక్షలు వచ్చి ఉండాలి.
మనం ప్రస్తుతం ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నామో ఆ కంపెనీలో మినిమమ్ 1సంవత్సరం అనుభవం ఉండాలి.
ప్రతి బ్యాంకులో documentation charge ఉంటుంది. మినిమమ్ రూ.1000 ఉంటుంది.
అదేవిధంగా part payment charges ఉంటుంది. మనం లోన్ తీసుకున్న తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నా ఒక్కసారి పే చెయ్యడం అవ్వదు. దానికోసం 1సంవత్సరం వరకు వెయిట్ చెయ్యాలి. సంవత్సరం తర్వాత మాత్రమే part payment చెయ్యగలం. ఇక్కడ మనం కట్టే డబ్బులో 5 శాతం ఛార్జ్ తీసుకుంటారు.
Pre Closure Charge: మనం ఎంత డబ్బులు అయితే కట్టి క్లోజ్ చెయ్యాలనుకుంటున్నామో దానిలో 5 శాతం ఖచ్చితంగా ఛార్జ్ కట్టాలి. దానితో పాటు స్టాంప్ డ్యూటీ, లీగల్ ఛార్జ్, సిబిల్ ఛార్జ్ ఇవన్నీ ఉంటాయి.
లోన్-ఈఎమ్ఐ
మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే తక్కువ టెన్యూర్ పెట్టుకుని లోన్ తీసుకోవాలి. ఇలా అయితే మనం వడ్డీ తక్కువ కట్టవలిసి ఉంటుంది.
* మన దగ్గర డబ్బు ఎక్కువ లేకపోతే ఎక్కువ టెన్యూర్ పెట్టుకోవాలి. వడ్డీ కూడా ఎక్కువ కట్టవలిసి ఉంటుంది.
* ఎవరికైతే సిబిల్ స్కోర్ ఆదాయం ఎక్కువ ఉందో వాళ్ళకి వడ్డీరేట్లు తక్కువ ఉంటాయి.
* లోన్‌కి అప్లై చేసేటప్పుడు అదనంగా ప్రోసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి
* మన సంవత్సర ఆదాయం కంటే మనం కొనే కారు ధర ఎక్కువ ఉండకూడదు.
* అన్ని ఈఎమ్ఐ లు కలిపి మన నెలజీతంలో 50 శాతం కంటే తక్కువ ఉండాలి.
* డౌన్ పేమెంట్ ఖచ్చితంగా మన సేవింగ్స్ అయ్యి ఉండాలి.
* మనం ఇన్సురెన్స్ తప్పకుండా తీసుకోవాలి.
* మన దగ్గర డబ్బు ఉండి, డ్రైవింగ్ వచ్చి ఉంటే మనం కొత్త కారు కొనుక్కోవచ్చు. అదే మన దగ్గర డబ్బు ఉండి డ్రైవింగ్ రాకపోతే సెకెండ్ హ్యాండిల్ కారు కొనుక్కోవాలి. ఎందుకంటే డ్రైవింగ్ రాకపోయి ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందులు ఎదుర్కోవలిసి ఉంటుంది.