chitra ramakrishnan – yogi story

అదృశ్య యోగి చెప్పాడంటూ ఒక పెద్ద కంపెనీని కార్పోరేట్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డిపి నిందితురాలైంది చిత్ర రామ‌కృష్ణ‌. త‌న‌పై ఉన్న ఒక బృహ‌త్త‌ర బాధ్య‌త‌ను అవినీతికి బ‌లి చేసింది. ఇండియాలో ఒక పెద్ద మార్కెట్ ఎక్చేంజీని స్వ‌ప్ర‌యోజ‌నం కోసం వాడుకుంది. ఎన్ ఎస్ ఈ సీఈవోగా ప‌నిచేసిన చిత్ర ప్ర‌స్తుతం ఆదాయ ప‌న్ను, సెబీ, సీబీఐ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు.

who is chitra rama krishnan

చార్టెడ్ అకౌంటెంట్ గా జీవితం ప్రారంభించి 1985లో ఐడీబీఐ బ్యాంకు ప్రాజెక్ట్ ఫైనాన్స్ విభాగంలో చేరిన చిత్ర అంచెలంచెలుగా ఎదిగారు. 1994లో ఎన్ ఎస్ ఈ ఏర్పాటు ద‌గ్గ‌ర‌నుంచి 2013లో ఎన్ ఎస్ ఈ సీఈవోగా ఎదిగిన క్ర‌మం అంతా ఆద‌ర్శ‌నీయ‌మే.. కానీ 2016లో ఆమె ప‌ద‌వీకి రాజీనామా చేయ‌డంతో అవినీతి బాగోతం బ‌య‌ట ప‌డింది.

హర్షద్ మెహతా కుంభకోణం తర్వాత ఓ పారదర్శక ట్రేడింగ్ మార్కెట్ నిర్వహించాలని కేంద్రం భావించింది. దీనికోసం ఐదుగురు సభ్యులతో కూడిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఏర్పాటు చేసింది. అందులో ఈమె ముఖ్య సభ్యురాలిగా కొనసాగారు. అక్కడి నుంచి సీఐఐ నేషనల్ కౌన్సిల్ ఆన్ ఫైనాన్సియల్ సెక్టార్ డెవలప్మెంట్, ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, క్యాపిటల్ మార్కెట్స్ కమిటీ వంటి ఇండస్ట్రీ బాడీ కమిటీల్లో కూడా రామకృష్ణ పనిచేశారు. ఆ తర్వాత ఆమె 2009లో ఎన్ఎస్ఈ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. 2013లో ఆమె సీఈవోగా పదోన్నతి పొందారు.

what is allegation on chitra ramakrishnan

2016 లో అనూహ్యంగా ఎన్ఎస్ఈ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవికి తొలగిన తర్వాత ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. హిమాలయాల్లో నివ‌సించే ఒక యోగి చిత్రతో గత 20 సంవత్సరాలుగా ఈ మెయిళ్ల ద్వారా సంభాష‌ణ జ‌రుపుతూ ఆమెను మార్గ‌ద‌ర్శ‌కం చేస్తున్నార‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వ్యక్తిగత, వృత్తిగ‌త విష‌యాల్లో యోగిని ఆశ్ర‌యించేద‌ట‌. దీంతో అత‌ని చెప్పే విధంగా కంపెనీలో కీల‌క విష‌యాల్లో నిర్ణ‌యం తీసుకునేది. దీంతో భారీ అవినీతి జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌.

* ఆనంద్ సుబ్రమణియన్ ను ప్రధాన వ్యూహాత్మక సలహాదారుగా నియమించడంలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
* పాలనపరమైన విషయంలో కూడా రామకృష్ణ, బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇచ్చిన ఉత్తర్వుల్లో వెల్లడైంది.
* కంపెనీల కీల‌క స‌మాచారం, పాల‌నా ప‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కు చెప్ప‌డం, సంస్థ నిర్ణ‌యాలకు వేరొకరిని ఆశ్ర‌యించ‌డం ఈమెపై ఉన్న ముఖ్య ఆరోప‌ణ‌లు.
* పాలనా లోపాల విషయంలో సెబీ రామకృష్ణపై రూ.3 కోట్లు, ఎన్ఎస్ఈ మాజీ ఎండీ సుబ్ర‌హ్మ‌ణియన్, సీఈఓ రవి నరైన్ లపై ఒక్కొక్కరికి రూ.2 కోట్లు, చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్, కాంప్లయన్స్ ఆఫీసర్ గా ఉన్న వి.ఆర్. నరసింహన్ కు ర.6 లక్షలు జరిమానా విధించింది.
* రామకృష్ణ, సుబ్రమణిన్లను ఏ సంస్థతో కలిసి పనిచేయకుండా 3 సంవత్సరాల పాటు నిషేధించింది. అలాగే, నరైన్ కు కూడా 2 ఏళ్ళు నిషేధించింది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు తాను ఆ యోగిని ఎప్పుడూ చూడ‌లేద‌ని, క‌ల‌వ‌లేద‌ని, మాట్లాడ‌లేద‌ని, కేవ‌లం ఈ మెయిళ్ల ద్వారా మాత్ర‌మే సంభాషించే వాళ్ల‌మ‌ని చెప్ప‌డం ఆశ్య‌ర్య‌క‌రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *