స్టాక్ మార్కెట్‌లో మనం ట్రేడ్ చేయాలంటే చాలా రకాల చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. లాభమొచ్చినా, నష్టమొచ్చినా వీటిని చెల్లించడం తప్పనిసరి.
స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ అనేది తప్పనిసరి. వాటిల్లో పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాల్సిందే.. అయితే ఈరోజుల్లో చాలా బ్రోకరేజీ సంస్థలు డీమ్యాట్ అకౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. డీమ్యాట్ అకౌంట్లను తెరిచే విషయంలో చాలా విషయాలను మనం గుర్తించాలి. ప్రధానంగా దాని నియమ నిబంధనలు, ఈ ఖాతాలపై అనేక రకాల రుసుములు కూడా ఉంటాయని తెలుసుకోవాలి.
వాస్తవంగా ఇటీవల కాలంలో డీమ్యాట్ అకౌంట్లు తెరిచే వారి సంఖ్య భారీగా పెరిగింది. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. ముఖ్యంగా యువత వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే డీమ్యాట్ అకౌంట్ తెరిచాక.. అందులోకి డబ్బులు యాడ్ చేసి స్టాక్ బ్రోకరేజీల నుంచి పెట్టుబడి పెట్టాలి. అవసరమైనప్పుడు అక్కడే విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ తెరవడం దగ్గర్నుంచి.. స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ వరకు కొన్ని రుసుములు ఉంటాయి. వీటి గురించి మనం తెలుసుకోవాలి.
The charges are as follows..
* డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి ముందుగా బ్రోకరేజీ సంస్థకు, డిపాజిటరీ పార్టిసిపెంట్‌కు కొంత మొత్తం రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు బ్రోకరేజీ సంస్థలు నామమాత్రపు రుసుముల్ని వసూలు చేస్తుంటాయి. కొన్ని సంస్థలు.. మొదటి ఏడాది ఉచితంగా సేవలు అందించి.. తర్వాత ఏడాది నుంచి ఛార్జీల్ని వసూలు చేస్తాయి.
* మరికొన్ని సంస్థలు డీమ్యాట్ ఖాతాను నిర్వహించేందుకు మెయింటెనెన్స్ పేరిట వార్షిక ఛార్జీల్ని వసూలు చేస్తాయి. ఏడాదికి ఈ రుసుములు రూ. 300 నుంచి రూ.800 వరకు ఉంటాయి. ట్రాన్సాక్షన్ విలువను బట్టి ఈ ఫీజులు మారొచ్చు.
* అకౌంట్ హోల్డర్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌పైనా ఛార్జీలు ఉంటాయి. ఇది బ్రోకరేజీ సంస్థను బట్టి మారుతుంటాయి. సెక్యూరిటీలు లేదా స్టాక్స్ కొన్నా, విక్రయించినా సర్వీస్ ఛార్జీలు పడతాయి. చాలా బ్రోకరేజీలు ప్రతి ట్రాన్సాక్షన్‌పైనా రూ. 20 చొప్పున వసూలు చేస్తున్నాయి. డీమ్యాట్ అకౌంట్లో ఉన్న సెక్యూరిటీలన్నీ ఎలక్ట్రానిక్ రూపంలోనే ఉంటాయి. ఈ సెక్యూరిటీల భద్రతకు డిపాజిటరీ పార్టిసిపెంట్స్ నెలవారీగా నామమాత్రపు నెలవారీ రుసుమును వసూలు చేస్తాయి.
* రూ. 50 వేలు లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న చిన్న పెట్టుబడిదారుల అకౌంట్‌ను బేసిక్ సర్వీసెస్ డీమ్యాట్ అకౌంట్ అంటారు. దీనిపై వార్షిక నిర్వహణ ఛార్జీ ఉండదు.
* డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు, అకౌంట్ నిర్వహణ, కస్టోడియన్ , ట్రాన్సాక్షన్, డీమెటీరియలైజషన్ ఇలా అనేక ఫీజులు ఉంటాయి. ఈ క్రమంలో కొత్తగా డీమ్యాట్ ఖాతా తీసుకునే వారితో పాటు ఇప్పటికే అకౌంట్ ఉన్న వారు సైతం ఛార్జీల వివరాలు తెలుసుకోవడం మంచిది. లేకుంటే మీకు వచ్చిన లాభం మొత్తం ఛార్జీలకే వెళ్తుంది.
డబ్బులు దాచుకోలేరు.. Can’t hide money..
బ్యాంకు సేవింగ్స్ ఖాతాల మాదిరిగా డీమ్యాట్ అకౌంట్ లో డబ్బులు దాచుకోలేరు. కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి తప్పకుండా డీమ్యాట్ ఖాతా అనేది ఉండాలి. ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినప్పుడు మీ షేర్లు, ఇతర సెక్యూరిటీలను డిజిటల్ రూపంలో డీమ్యాట్ ఖాతాలో ఉంటాయి. ఇతర పెట్టుబడుల బాండ్లు, ఈక్విటీ షేర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి సైతం డీమ్యాట్ ఖాతాలోనే ఉంటాయి.
కొన్ని బ్రోకరేజీ సంస్థలు.. వాటిలో చార్జీలు
జెరోధా డీమ్యాట్ అకౌంట్ ఛార్జీలు (Zerodha Demat Account Charges): ఇందులో డీమ్యాట్ ఖాతా తీసుకున్నట్లయితే వార్షిక నిర్వహణ ఛార్జీల కింద రూ. 300 ప్లస్ జీఎస్‌టీ వసూలు చేస్తారు. ఈక్విటీ ట్రేడింగ్ కోసం ఆన్‌లైన్ అకౌంట్ తెరిచేందుకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ (HDFC Securities): ఇందులో అకౌంట్ తీసుకున్న వారికి రెండో ఏడాది నుంచి వార్షిక ఛార్జీల కింద రూ. 250 నుంచి రూ. 750 మధ్య వసూలు చేస్తారు. అకౌంట్ కేటగిరీని బట్టి ఈ చార్జీలు ఉంటాయనేది గ్రహించాలి.
ఐసీఐసీఐ(ICICI) :ఐసీఐసీఐ డైరెక్ట్‌లో డీమ్యాట్ ఖాతా తీసుకునేందుకు ఎటువంటి ఛార్జీలు లేవు. అయితే నిర్వహణ ఛార్జీల కింద రూ. 700 వసూలు చేస్తారు. ఇందులో షేర్లు కొంటే ఛార్జీలు ఉండవు. కానీ అమ్మితే 0.04 శాతం ఛార్జీలు వసూలు చేస్తారు. ఇందులో ప్లాన్ల బట్టి చార్జీలు మారుతూ ఉంటాయి.
ఏంజెల్ వన్ (Angel One): ఇందులో డీ మ్యాట్ ఖాతా తెరిచేందుకు ఎలాంటి ఛార్జీలు లేవు. ఖాతాలోకి ఈక్విటీ డెలివరీ ఉచితం. ఈక్విటీ డెలివరీ ట్రేడ్స్‌కు ఛార్జీలు ఉండవు. అయితే ఇంట్రాడేలో ఒక్కో ట్రాన్సాక్షన్ కు రూ. 20 వసూలు చేస్తారు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, జీఎస్‌టీ, స్టాప్ డ్యూటీ, సెబీ టర్నోవర్ , డిపాజిటరీ పార్టిసిపాంట్ , బ్రోకరేజ్ ఛార్జీలు కూడా వస్తూలు చేస్తారు. నాన్ బీఎస్‌డీఏ క్లైయిట్స్‌కు నెలకు రూ. 20 ప్లస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులోనూ పలు ప్లాన్ల బట్టి చార్జీలు మారుతూ ఉంటాయి.
Upstox: అప్‌స్టాక్స్‌లో వార్షిక రుసుము రూ. 177గా ఉంది. త్రైమాసింగా నిర్వహణ ఛార్జీలుగా రూ. 88.50 వసూలు చేస్తారు. దీనిని తిరిగి ఇవ్వరు.
గ్రో డీమ్యాట్ (Grow Demat) : ఈ బ్రోకరేజీ సంస్థలో అకౌంట్ ఓపెనింగ్, ఏఎంసీ ఛార్జీలు లేవు. అయితే ఆర్డర్‌పై వసూలు చేస్తుంటారు.
ఎస్‌బీఐ సెక్యూరిటీస్ (SBI Securities): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ అకౌంట్ నిర్వహణ కోసం రూ. 750 వసూలు చేస్తారు. ఇ- స్టేట్‌మెంట్ కోసం రూ. 500 చెల్లించాలి. అకౌంట్ తెరిచేందుకు రూ. 850 చొప్పున వసూలు చేస్తారు.
అకౌంట్ ఓపెనింగ్ చార్జస్
మనం స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేయాలనుకుంటే మనకి డీ మ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసేటపుడు అకౌంట్ ఓపెనింగ్ ఛార్జస్ ఉంటాయి. ఇప్పుడు డిస్కౌంట్ బ్రోకర్స్ వద్ద డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మనం ఎటువంటి చార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు.
అకౌంట్ మెంటెనెన్స్ ఛార్జస్
ఒక్కొక్క బ్రోకరేజీ సంస్థ ఒక్కోలా అకౌంట్ మెంటినెన్స్ చార్జీలు వేస్తారు. కొందరు మాత్రం పూర్తి ఉచితంగా ఈ సేవలను అందిస్తున్నారు.
బ్రోకరేజ్ ఛార్జస్
మనం స్టాక్స్ బ్రోకర్స్ ద్వారా సర్వీస్ పొందుతాం. వాళ్ళకి మనం కొంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అయితే డిస్కౌంట్ బ్రోకర్స్ చాలా మంది బ్రోకర్ ఛార్జస్ రూ.20 లేదా 0.05 శాతం తీసుకుంటారు. ఫుల్ టైం బ్రోకర్స్ వద్ద మాత్రం అధికంగా చార్జీలు ఉంటాయి.
what is security transaction charge
సెక్యూరిటీ ట్రాన్జాక్షన్ ట్యాక్స్…
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనం చేసే ట్రాన్జక్షన్ మీద కొంత శాతాన్ని సెక్యూరిటీ ట్రాన్జక్షన్ ట్యాక్స్ కింద తీసుకుంటారు.
ఇందులో రెండు రకాల ట్రేడింగ్ జరుగుతుంది. 1.డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ 2.ఇంట్రాడే ట్రేడింగ్
డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ అంటే మనం స్టాక్స్ ఒకే రోజు అమ్మకుండా, కొన్ని రోజులకి ట్రాన్జక్షన్ పూర్తి చేస్తాం.
సెక్యూరిటీ ట్రాన్జక్షన్ ఇంట్రాడే ట్రేడింగ్ కి, డెలివరీ బేసిస్ కి వేర్వేరు చార్జస్ ఉంటాయి.
మన ఇండియాలో 0.1 శాతం ట్రాన్జాక్షన్ వాల్యూని సెక్యూరిటీ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ కింద కలెక్ట్ చేస్తారు.
ఇంట్రాడే ట్రేడింగ్ లో 0.025 శాతం ట్రాన్జాక్షన్ వాల్యూ ఉంటుంది. మనం సాధారణంగా షేర్స్ అమ్మినపుడు లేదా కొన్నప్పుడు సెక్యూరిటీ ట్రాన్జక్షన్ ట్యాక్స్ విధిస్తారు.
స్టాంప్ డ్యూటీ…
మన స్టాక్ బ్రోకర్స్ గవర్నమెంట్ గుర్తింపు పొంది పనిచేస్తారు. ప్రతి ఒక్క స్టాక్ బ్రోకర్ చేసే ట్రేడింగ్ డైలీ బేసిస్ లో లీగల్ గా మెంటైన్ చేస్తారు. దానిని కాంట్రాక్ట్ లోన్ కింద స్టోర్ చేసుకుంటారు. దీనిలో కూడా ఇంట్రాడే ట్రేడింగ్, డెలివరీ బేసిస్ కి వేర్వేరుగా స్టాంప్ డ్యూటీని కలెక్ట్ చేస్తారు. డెలివరీ బేసిస్ లో ట్రాన్జక్షన్ ఛార్జ్ 0.015 శాతం. అదే ఇంట్రాడే ట్రేడింగ్ లో అయితే 0.003శాతం.
ఎక్స్ఛేంజ్ ట్రాన్జాక్షన్ ఛార్జ్
సాధారణంగా ఎక్స్ఛేంజీ వాళ్ళు ఎంటర్ చేసే సర్వీసెస్ కి మాత్రం ఈ ఛార్జస్ ని కలెక్ట్ చేస్తారు. మనం NSE, BSE, ఇంట్రాడే, డెలివరీ… ఎందులో మనం ట్రేడ్ చేసినా అన్నింటికి కలిపి 0.00345 శాతం కింద ఈ ఎక్స్ఛేంజ్ ట్రాన్జక్షన్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు.
సెబీ ట్రాన్జాక్షన్ ఛార్జ్
మనం చేసే ట్రాన్జక్షన్ పై సెబీ కొంత శాతం లెక్కవేసుకుని చార్జి వసూలు చేస్తుంది. మనం ఇంట్రాడే, డెలివరీ, బై సెల్ చేసినా 0.00005శాతం సెబీ టర్నోవర్ ఛార్జ్ కింద వేస్తారు.
జీఎస్టీ
జీఎస్టీ దాదాపుగా 18శాతం కింద కలెక్ట్ చేస్తారు. మొదటిగా బ్రోకరేజీ మీద జీఎస్టీ ఛార్జ్ వేస్తారు.
తరువాత డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జస్ పై కూడా జీఎస్టీ 18 శాతం ట్యాక్స్ పడుతుంది.
what is meant by depository participant charges
డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జస్
మనం కేవలం డెలివరీలో స్టాక్స్ ని సెల్ చేసినపుడు ఈ ఛార్జస్ ఉంటాయి. ఈ ఛార్జస్ ఫ్లాట్ రేట్ కింద అప్లై అవుతాయి. ఒక్కో స్టాక్ కి ట్రేడింగ్ రోజు రూ.13.5 ఛార్జ్ పడుతుంది.
ట్యాక్సేషన్స్..
* క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్…
మనం షేర్స్,సెక్యూరిటీస్, రుణసాధనం వీటన్నింటినీ అసెట్ క్లాస్లో తీసుకువస్తారు. ఈ అసెట్స్ ని మనం హోల్డ్ చేసి అమ్మినపుడు, మనకొచ్చే ప్రోఫిట్ లేదా లాస్ ఏదైనా దానిని మనం ట్యాక్సేషన్ కింద చూపించాల్సి ఉంటుంది. ఇందులో రెండు రకాల గెయిన్స్ ఉంటాయి.
1 షార్ట్ టర్మ్ గెయిన్స్ 2. లాంగ్ టర్మ్ గెయిన్స్
* మన అసెట్స్ ను 1సంవత్సరంలోపే కొని, అమ్మిన పరిస్థితి ఉంటే దాని మీద వచ్చే ప్రోఫిట్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు.
* మనం 1సంవత్సరం తర్వాత అమ్మితే దానిమీద వచ్చే ప్రోఫిట్ లేదా లాస్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద క్లాసిఫైడ్ చేస్తాం.
* షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 15 శాతం ట్యాక్స్ కట్టాలి.
* లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో మనకి 1లక్ష కంటే ఎక్కువ ప్రోఫిట్ వస్తే 10 శాతం ట్యాక్స్ కట్టాలి.
డివిడెండ్ ఇన్ కమ్
మనకు కంపెనీలు ఇచ్చే డివిడెండ్లపైనా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది వరకూ కంపెనీలే ట్యాక్స్ పే చేసేవి. కానీ ఇప్పడు ఇన్వెస్టర్లే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇన్ కమ్ ను వేరుగా పే చేయకుండా మన నార్మల్ ఇన్ కమ్ తో కలిపి ట్యాక్స్ పే చేయవచ్చు.