ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్. ఇది హై స్పెషలైజ్డ్ నేరో గేమ్. ప్రపంచంలోనే చాలా డేంజరస్ బిజినెస్ ఇది. ఇది అందరికీ సెట్ అవుతుందా లేదా అనేది వారి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎంత రిస్క్ తీసుకోగలం అనేది ఇక్క‌డ చాలా కీల‌కం

* ప్రపంచంలో ఎంత పెద్ద ట్రేడర్ అయినా, ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా తను తీసుకున్న నిర్ణయాల్లో అన్నీ సక్సెస్ కావు. 100 నిర్ణయాలు తీసుకుంటే అందులో 40 నుంచి 50 వరకు మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దీనినే రాండమ్ వాక్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటాం.

* 10 స్టాక్స్ కొంటే అందులో 5 స్టాక్స్ క్లిక్ మార్కెట్ మనల్ని చాలా పరీక్షిస్తుంది. అవ్వడం మన అదృష్టం అనుకోవాలి. మిగిలినవి పూర్తిగా ఫెయిల్ అవుతాయి. అలాంటి పెయిల్యూర్‌ నిర్ణయాలు మ‌న‌పై సైకలాజికల్ గా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయినా త‌ట్టుకోగ‌ల‌గ‌డం ఇక్క‌డ అవ‌స‌రం.

* మనం స్టాక్ మార్కెట్ లో రిస్క్, రివార్డ్ రేషియో గురించి పూర్తిగా తెలుసుకుని ఇలాంటి కొన్ని అంశాల మీద అవగాహన సంపాదిస్తేనే మార్కెట్లో కొనసాగడానికి అవకాశం ఉంటుంది.

* స్టాక్ మార్కెట్లో సక్సెస్ స్లో గా వస్తుంది. ఫెయిల్యూర్ తొందరగా వస్తుంది. దీనికి చాలా సహనం మనకి ఉండాలి.

* ట్రేడింగ్ కెరియర్ చాలా కష్టంగా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఎక్కువ‌గా ఉంటాయి. అది తట్టుకోలేనివాళ్ళు ట్రేడింగ్ చెయ్యకూడదు. మ‌న‌కు వేరే ఇన్ కమ్ సోర్స్‌, లేదా మంచి జాబ్ అయినా ఉన్నప్పుడు ఈ ట్రేడింగ్‌ను ఎంచుకోవచ్చు.

* ఫైనాన్షియల్ గా సెటిలైన వాళ్ళు స్టాక్ మార్కెట్‌లో ప్ర‌యోగాలు చేసినా పర్వాలేదు. కానీ కుటుంబమంతా ఒకే వ్యక్తి సంపాద‌న‌పై ఆధారపడి ఉంటే ఆ వ్యక్తి ఇలాంటి ట్రేడింగ్ కెరియర్ ని ఎంచుకోకూడదు. మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏమిటీ? మనం వర్క్ చేయకుండా దీని మీద ఆధారపడితే మన ఫ్యామిలీ నడుస్తుందా లేదా అనేది ఆలోచించుకోవాలి.

ఇవ‌న్నీ చూసాక మనకి ఇంకా ట్రేడింగ్ ఫీల్డ్ పై ఇంటరెస్ట్ ఉంటే ముందు మనం ఇన్వెస్టర్ గా మొదలుపెట్టవచ్చు. తర్వాత పార్ట్ టైమ్ ట్రేడర్ గా కొనసాగ‌వచ్చు. ఒక సంవత్సరం తర్వాత మనం రిజల్ట్స్ చూసుకుంటే అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది.

* ట్రేడింగ్ ను కెరియర్ గా ఎంచుకున్నవాళ్ళు కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుని, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుని అప్పుడు ట్రేడింగ్ చెయ్యవచ్చు. లేదంటే ఇన్వెస్టింగ్ చెయ్యడమే ఉత్తమమైన మార్గం.

* ట్రేడింగ్ లో నాలెడ్జ్ ను ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. టెక్నికల్ ఎనాల‌సిస్, స్ట్రాటజీస్ తెలిసి ఉండాలి. వాటి ఫర్ఫార్మెన్స్ పై నాలెడ్జ్ ఉండాలి. ఇలా ప్రతి దానిమీద గ్రిప్ ఉండాలి.

* మన దగ్గర కొన్ని స్ట్రాటజీస్ ఉంటే వాటిని 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల డేటా మీద టెస్ట్ చేసి ప‌రిశీలించాలి. ప్రతి సంవత్సరం లాభం ఇచ్చి ఉన్న‌యో లేదో తెలుసుకోవాలి. అలాంటి స్ట్రాటజీస్ దొరికినపుడు మార్కెట్లో పుల్ టైమ్ ట్రేడర్ గా ఎంటర్ కావ‌చ్చు.

* ఇన్వెస్టింగ్ అనేది అందరూ చెయ్యవచ్చు. మనం వేరే పనులు చేసుకుని రెగ్యులర్ ఇన్ కమ్ పొందుతుంటాం కాబ‌ట్టి అలాంటి వారంతా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభాలు పొంద‌వ‌చ్చు. మనం మంచి స్టాక్స్ ని 10 నుంచి 20 వరకు తీసుకుంటే దానిలో సగం ఫెయిల్ అయ్యిన మిగిలిన స్టాక్స్ సక్సెస్ అవ్వవచ్చు.

* ట్రేడింగ్ విషయానికి వస్తే ఒక రోజు ఇంట్రాడేలో గాని లేదా వారానికో, 10 రోజులకో పొజిషన్ తీసుకుని ట్రేడింగ్ చేసేట‌ప్పుడు లాస్ బుక్ చేయాల్సి వ‌స్తుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఎందుకు ట్రేడింగ్ చేస్తున్నాం అని బాధ‌పడవచ్చు. ఇంత రిస్క్ తో కూడుకున్న ఫీల్డ్ కాబట్టి అందరికీ సెట్ అవ్వదు. కొందరికి మాత్రమే ఈ ఫీల్డ్ సెట్ అవుతుంది.

* మనం ట్రేడింగ్ కెరియర్ ని ఎంచుకోవాలంటే వేరే విధంగా మనకి ఆదాయం వచ్చే మార్గాలను ఎంచుకోవాలి. ట్రేడింగ్ చేసేవారు చాలా సహనంతో క్రమశిక్షణతో ఉండాలి.

* ట్రేడింగ్ చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఇది అందరికీ సూట్ కాదు. సైక‌లాజిక‌ల్‌గా స్ట్రాంగ్ గా ఉన్నవారికి మాత్రమే సెట్ అవుతుంది. పెట్టిన పెట్టుబడి కొంచెం నష్టపోయినా తట్టుకోగలిగిన వాళ్ళు ఈ ట్రేడింగ్ కెరియర్ ని ఎంచుకోవచ్చు.

Investing or trading is the best
ఇన్వెస్టింగ్ లే దా ట్రేడింగ్.. ఎది బెస్ట్‌

* ఏదైనా సంవత్సరంలోపు ట్రాన్జాక్ష‌న్ క్లోజ్ చేస్తే దానిని ట్రేడింగ్ అంటాం. అదే సంవత్సరం కంటే ఎక్కువ ట్రాన్జాక్షన్స్ చేస్తే దానిని ఇన్వెస్ట్ మెంట్ అంటాం. ఒకటి యాక్టివ్ ఇన్ కమ్ కోసం, ఇంకొకటి పాసివ్ ఇన్ కమ్ కోసం. ట్రేడింగ్ మీద వచ్చే ఇన్ కమ్ యాక్టివ్ ఇన్ కమ్, ఇన్వెస్ట్ మెంట్ వచ్చేది పాసివ్ ఇన్ కమ్.

* ట్రేడింగ్ అనేది ప్రాక్టీస్. కొన్ని లక్షలాది స్ట్రాటజీస్ ఉంటాయి మార్కెట్లో. ఈ స్ట్రాట‌జీ ల‌ను ప్రాక్టీస్ చేస్తే వ‌చ్చే ఎఫర్ట్ మీద ట్రేడింగ్ ఫ‌లితం ఆధార‌ప‌డి ఉంటుంది. మనం ఏదో ఒక దాంట్లో స్పెషలిస్ట్ అయ్యి ఉండాలి. ఈ విష‌యంలో మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి.

* ట్రేడింగ్ చేసేట‌ప్పుడు మ‌న ఎంట్రీ అనేది చాలా కీల‌కం. మనం ఏ టైపు ట్రెండ్ ఉంటే ఎంటర్ అవుతామో ముందుగా నిర్ణ‌యించుకోవాలి. అంటే బ్రేక్ అవుట్ అయితే ఎంటర్ అవుతామా లేదా బ్రేక్ అవుట్ ఫెయిల్యూర్ అయితే ఎంటర్ అవుతామా లేదా పుల్ బ్యాక్‌ అయితే ఎంటర్ అవుతామా అనే విష‌యంలో క్లారిటీ ఉండాలి.

* ట్రేడింగ్ అనేది ప్రాక్టీస్ మీద వచ్చేది. దీనికి డెడికేషన్, డిటర్మేషన్ కావాలి. అవకాశాల కోసం మనం వెయిట్ చెయ్యాలి. స్టాప్ లాస్ మెంటైన్ చేసుకోవాలి. తేడా వస్తే బయటకి వచ్చేయాలి.

* ఈ బిజినెస్ లో ఎంతో గ్రిప్ ఉండి, డమ్మీ ట్రేడింగ్ ఎక్స్ పీరియన్స్ ఉంటే తప్ప మనం సక్సెస్ కాలేం. అందుకే రోజూ మనం ఒక సెటప్ పై ఎక్కువ ట్రేడింగ్ లు చేస్తే మనకి కంట్రోల్ వస్తుంది.

* ట్రేడింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వచ్చే టెక్నిక్. మార్కెట్లో ఎన్నో రకాల స్ట్రాటజీస్ ఉంటాయి. వాటన్నింటితో మ‌న‌కు పనిలేదు. ఒక్క ట్రేడింగ్ టెక్నిక్ పై మంచి గ్రిప్ ఉంటే చాలు.

*ట్రేడింగ్ అంటే రిస్క్ తో కూడుకున్నది. మనం రిస్క్ ని ఎలా మినిమైజ్ చెయ్యాలా, రిస్క్ ని ఎలా డైవర్సిఫై చెయ్యాలా అని క్లారిటీ ఉండాలి.

* మనం సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ట్రేడింగ్ చెయ్యాలి. వీటిపై నాలెడ్జ్ మెరుగుపర్చుకోవడం, డిడక్షన్ ని ప్రాక్టీస్ చేసుకోవడం ఈ రెండింటి వల్ల‌ రిస్క్ మినిమైజ్ అవుతుంది.

Why is the investment safe?
ఇన్వెస్ట‌మెంట్ ఎందుకు సేఫ్‌

* ఇన్వెస్ట్ మెంట్ విషయానికి వస్తే మనకి ఎటువంటి ఎమోషన్స్ కి గురికాకుండా ఉండాలి. మార్కెట్ పడినా మనకి ఫ‌ర్వాలేదు అని అనుకోవాలి. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాం కాబ‌ట్టి.

* ఇన్వెస్ట్ మెంట్ అనేది కమిట్ మెంట్ ఉన్నవారికి సూట్ అవుతుంది. ఇన్వెస్ట్ మెంట్ పాస్ట్ గా చేంజ్ అయ్యే టెక్నిక్ కాదు.

* ఇన్వెస్ట్ మెంట్ అనేది లెస్ ఎమోషన్స్ ఉన్నవాళ్ళకి బాగా సూట్ అవుతుంది. ట్రేడింగ్ బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళకి సూటవుతుంది. ఎక్కువ ఎమోషన్స్ కి గురయ్యేవాళ్ళు నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

* ట్రేడింగ్ , ఇన్వెస్ట్ మెంట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. ఇన్వెస్ట్ మెంట్ చేసేవాళ్ళు రిటర్మెంట్ టైమ్ లో మనకోసం మంచి వెల్త్ ని క్రియేట్ చేస్తుంది.

* మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకులతో మనకి సంబంధం లేదు.
ఎప్పుడు ఒకటి, రెండు స్టాక్స్ పై ఇన్వెస్ట్ చెయ్యకూడదు. డైవర్సఫై చేసుకోవాలి.

* మనకి నాలెడ్జ్ లెకపోతే మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి నాలెడ్జ్ ఉంటే మనం ట్రేడింగ్, ఇన్వెస్ట్ మెంట్ వైపు వెళ్ళవచ్చు.

* ఈ బిజినెస్ లో మనమే ఓనర్. లాభం వచ్చిన, నష్టమొచ్చినా మనమే బాధ్యులం.

2 thoughts on “స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ని కెరియర్ గా ఎంచుకోవచ్చా Can stock market trading be chosen as a career”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *